వేద యష్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఎలా దగ్గర అవాలని నువ్వు నీకు ఎలా దూరం అవాలని నేను. నీ సంతోషం కోసం ఇలా చేయక తప్పడం లేదు వేద ఐయామ్ హెల్ప్ లెస్ అని బాధపడతాడు. అటు వేద మాత్రం యష్ తో గడిపిన సంతోష క్షణాలన్నీ తలుచుకుని మురిసిపోతుంది. ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తుంది మీ ప్రియమైన భార్య మీకోసం ఎదురు చూస్తుందని అనుకుంటుంది. ఇంటి బయటే ఉండి కూడా ఇంపార్టెంట్ వర్క్ వల్ల ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెప్తాడు. సరే త్వరగా కంప్లీట్ చేసుకుని రండి మీకు ఇష్టమైన వంటలు చేసి ఎదురుచూస్తున్నా రమ్మని చెప్తుంది. ఐలవ్యూ శ్రీవారు త్వరగా వచ్చెయ్యండి అనుకుంటుంది. నాకు కావలసింది నీ సంతోషం అందుకోసం ఏమైనా చేస్తానని అంటాడు. వేద భర్త కోసం ఎదురుచూస్తూనే అలాగే కూర్చుని నిద్రపోతుంది.


ALso Read: ఆట మొదలెట్టిన రాజ్యలక్ష్మి- కండిషన్లు పెట్టి దివ్య, తులసిలను కలవకుండా చేసేసింది


యష్ ఇంట్లోకి వచ్చి బెడ్ రూమ్ డెకరేట్ చేసి ఉండటం చూసి మరింతగా బాధపడతాడు. మన మధ్య ఎంత దూరం వేద నీ నుంచి నేను దూరం అయితేనే నీ లైఫ్ ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే నిర్ణయం తీసుకున్నానని అనుకుంటాడు. సులోచన, మాలిని మాట్లాడుకుంటూ మళ్ళీ పోట్లాడుకుంటారు. ఆఫీసుకి వెళ్తూ మాలినికి అమెరికా వెళ్తున్నట్టు చెప్తాడు. వేదని కూడా తీసుకుని వెళ్తున్నావా అంటే లేదని అంటాడు. ఒక్క పది రోజులు మాత్రమే పెద్ద ప్రాజెక్ట్ మీద సైన్ చేశాను అందుకే వెళ్తున్నానని కవర్ చేస్తాడు. వేదకి చెప్పావా అంటే ఇంకా లేదని అంటాడు. ఏమైంది యష్ కి సడెన్ గా అమెరికా ట్రిప్ పెట్టుకున్నాడు వేద ఎలా రియాక్ట్ అవుతుందో ఏమోనని మాలిని బాధపడుతుంది. వేదకి మెలుకువ వచ్చి లేస్తుంది. రాత్రి ఆయన రాలేదా రూమ్ లో లేరని అనుకుని మాలిని దగ్గరకి వచ్చి యష్ గురించి అడుగుతుంది. ఆఫీసుకి వెళ్లాడని చెప్తుంది.


Also Read: అదిరిపోయే ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన స్వప్న- కావ్యకి మరొక అవకాశం ఇచ్చిన రాజ్


అప్పుడే మాటల్లో రత్నం యష్ అమెరికా వెళ్తున్న విషయం చెప్తుంది. అదేంటని షాక్ అవుతుంది. పది రోజులు మాత్రమే నువ్వు నిద్రపోతున్నావని చెప్పలేదు వాడు ఈ పరిస్థితిలో ఒక్కడే వెళ్ళడం కరెక్ట్ కాదు మీరిద్దరూ వెళ్లండని రత్నం సలహా ఇస్తాడు. ఏమైంది ఈయనకి రాత్రి రావడం లేట్ గా వచ్చారు ఇప్పుడేమో అమెరికా ట్రిప్ అంటున్నారు అంతా అయోమయంగా ఉంది అసలు ఏమైంది పెద్ద గండం నుంచి గట్టెక్కారని అనుకుంటుంటే అసలు ఏం జరుగుతుంది. నాకు మళ్ళీ కొత్త పరీక్ష అని వేద కంగారు పడుతుంది. యష్ వసంత్ ని పిలిచి కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టమని అడుగుతాడు. కంగ్రాట్స్ ఇక నుంచి నువ్వు మన కంపెనీకి ఎండీవి అని చెప్పేసరికి వసంత్ షాక్ అవుతాడు. ఎవరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు విషయం తెలుసుకోవాలని అంటాడు. నేను అమెరికా వెళ్లిపోతున్నా శాశ్వతంగా. ఇంట్లో మాత్రం బిజినెస్ ట్రిప్ అని అబద్ధం చెప్పాను అనగానే అప్పుడే ఒక వ్యక్తి వచ్చి డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఏం జరుగుతుందో తెలియక వసంత్ అయోమయంలో ఉంటాడు. డివోర్స్ ఏంటి నీకేమైన పిచ్చి పట్టిందానని కంగారుగా అడుగుతాడు. అప్పుడే వేద యష్ కి కాల్ చేస్తుంది. మీరు అమెరికా వెళ్తున్నారా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నాకు చెప్పకూడదని అనుకున్నారా అని ప్రశ్నిస్తుంది.