తనని క్షమించమని స్వప్న తల్లిని బతిమలాడుతుంది. కానీ కనకం మాత్రం ఫుల్ ఫైర్ అవుతుంది. నేను చచ్చేదాక నీమీద నాకు కనికరం కలగదని అంటుంది. నువ్వు బతికున్నప్పుడు నీకు అన్నీ ఇచ్చాను ఇప్పుడు చచ్చావ్ కాబట్టి జానెడు జాగ కూడా ఇవ్వను వెళ్ళు అని అరుస్తుంది. కృష్ణమూర్తి హాల్లోకి వచ్చి స్వప్నని చూసి ఉగ్రరూపం దాలుస్తాడు. దీన్ని ఈ ఇంట్లోకి ఎవరు రానిచ్చారు నడవవే బయటకి అని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాడు. మమ్మల్ని క్షమించి మేము బొమ్మలకు రంగులు వేసుకుని బతుకుతున్నాం. తల కడిగేసుకుని తద్దినం కూడా పెడతాం వెళ్ళు అని అరుస్తాడు. నీలాంటి దానికి తండ్రిని అని చెప్పుకోవడం కంటే ఇద్దరు కూతుళ్లని చెప్పుకోవడం ఇష్టమని అంటాడు. తను ఏ తప్పూ చేయలేదని చెప్పబోతుంటే కృష్ణమూర్తి మాత్రం వినిపించుకోడు.
Also Read: ఫస్ట్ నైట్ కి ముస్తాబైన మిసెస్ న్యూసెన్స్ - వేద జీవితంలో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన యష్
స్వప్న; తల్లిదండ్రులు మీరే క్షమించకపోతే ఇంక ఎవరు క్షమిస్తారు. నీకు నేను అంటే ప్రాణం కదమ్మా నేను అనాథలా వీధిలో తిరిగితే నువ్వు భరించగలవా
కనకం: నా భర్త మాట వినకుండా చేసిన తప్పు తెలిసింది. నా భర్త నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నిన్ను ఉండనివ్వమని చెప్పి ఇంకొక పాపం చేయలేను. నా వాకిట్లో నుంచి వెళ్లిపో
అప్పు: ఆరోజు చిన్నక్క బతుకు పాడైపోతుందని కారు వెనుక పడి రమ్మని బతిమలాడాను వినిపించుకోకుండా నాకు యాక్సిడెంట్ అయినా పట్టించుకోకుండా వెళ్లిపోయావు
కృష్ణమూర్తి: పరాయి ఆడవాళ్ళని బయటకి గెంటేయలేను మర్యాదగా వెళ్లిపొమ్మని చెప్పు
కనకం: వెళ్ళు ఈ రంగుల లోకంలో నుంచి నీ రంగుల ప్రపంచంలోకి వెళ్ళు. ఇప్పుడు నాకు ఇంట్లో పెళ్ళయిన కూతురు ఉంది నిన్ను ఇంట్లో ఉండనిస్తే నా అల్లుడు తనని వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళు
స్వప్న: నిన్న మొన్నటి దాకా ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేదు ఎక్కడికి వెళ్లిపోతాను శాశ్వతంగా వెళ్లిపోతాను అప్పుడన్నా నా వల్ల వచ్చిన చెడ్డ పేరు పోతుందని అక్కడే ఉన్న పెట్రోల్ తీసుకుని మీద పోసుకుంటుంది. కృష్ణమూర్తి అగ్గి పెట్టె తన చేతిలో పెడతాడు. కావ్య అడ్డుపడి ఆపుతుంది. చూస్తూ చూస్తూ కన్న కూతుర్ని చంపుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరందరూ. ఎవడో ఏదో చెప్పి మోసం చేశాడు అది పట్టుకుని వేలాడతామా. తన వల్ల నాకు మంచి జరిగింది దుగ్గిరాల ఇంటికి కోడలిని అయ్యాను. అక్కకి ఎక్కడ ఆశ్రయం దొరక్క ఇంటికి వచ్చిందని అంటుంది.
Also Read: క్షణక్షణం ఉత్కంఠభరితం- కృష్ణ, భవానీలో గెలుపు ఎవరిది? మురారీ ఎవరికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు
తనని ఇంట్లోకి రానివ్వలేమని కనకం అంటుంది. అందరికీ నచ్చజెపుతుంది. మా దృష్టిలో దీనికి ప్రాణం ఉందని మేము అనుకోమని కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు. స్వప్న బ్యాగ్ లో నుంచి విత్ లవ్ ఆర్ అని ఉండటం చూస్తుంది. అది రాహుల్ అని అర్థం చేసుకుని ఈ సాక్ష్యం చూపిస్తే నమ్మడు ఇంట్లో వాడు తప్పు చేశాడంటే నమ్మదని అనుకుంటుంది. రాజ్ వెళ్లబోతుంటే కావ్య అడ్డుపడుతుంది. దీంతో తనని తోసేయడంతో వెళ్ళి బెడ్ కి తగలడంతో కావ్య తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి రాజ్ మీద పడబోతు ఆగిపోతుంది. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనే తప్పు చేశానని అనుకుంటున్నారు కదా. నన్ను వదిలేయాలని అనుకుంటున్నారు కదా నేను తప్పు చేశానని నిజంగా తెలిసిన రోజు వదిలేయమని అంటుంది. మీరు నాకు వారం రోజులు గడువు ఇచ్చారు కదా అప్పటి వరకు టైమ్ ఇవ్వండి నిరూపించుకుంటాను. తప్పని రుజువైతే నేనే మీ ఇంటి నుంచి వెళ్లిపోతానని అంటుంది. సరే నీ మాట నమ్మి కాదు మీ అక్క ప్రవర్తనలో తేడా ఉందని అర్థం అయ్యింది అందుకే అవకాశం ఇస్తానని అంటాడు.