విక్రమ్ దివ్యని తీసుకుని తండ్రి ప్రకాశం దగ్గరకి తీసుకొస్తాడు. మావయ్యని పెళ్ళికి తీసుకురావాల్సింది కదా ఆయన పెళ్లి చూసేవారని దివ్య అంటుంది. చాలా కాలం తర్వాత నా కోసం ఒక గొంతు మాట్లాడుతుందని ప్రకాశం సంతోషపడతాడు. నాన్నని తీసుకురావాలని నాకు అనిపించింది కానీ ఆయన మనసులో మాట తెలుసుకోలేకపోయామని విక్రమ్ చెప్తాడు. ఇక నుంచి అలా కుదరదు ఈ ఇంటి పెద్ద మావయ్య ఆ ఇంటి పెద్ద చీకట్లో ఉండిపోతే ఎలా అయినా అత్తయ్య ఎలా వదిలేశారు. ఈరోజు నుంచి ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క. మీ మొహంలో సంతోషం కనిపించేలా చేస్తానని దివ్య ప్రకాశంకి ధైర్యం చెప్తుంది. ఇక నుంచి మావయ్య పనులు తనే చూసుకుని మామూలు మనిషిని చేస్తానని మాట ఇస్తుంది. ఆ మాట విని విక్రమ్ చాలా సంతోషిస్తాడు.


Also Read: అదిరిపోయే ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన స్వప్న- కావ్యకి మరొక అవకాశం ఇచ్చిన రాజ్


రాజ్యలక్ష్మికి లాస్య ఫోన్ చేస్తుంది. నీ మనిషిగానే ఈ ఇంట్లో ఉంటాను ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకాసేపటిలో నందు, తులసి మీ ఇంటికి వస్తున్నారని చెప్తుంది. రానివ్ ఇంకోసారి వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కకుండ వెళ్లిపోతారని అంటుంది. లాస్య ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి నందు ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నవని నిలదీస్తాడు. వియ్యపురాలితో మాట్లాడానని చెప్తుంది. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని హెచ్చరిస్తాడు. పెళ్లి ముందు వరకు హ్యాపీగానే ఉన్నాడు పెళ్లి అవగానే ఈయన మూడ్ మారిపోయింది ఏంటని లాస్య ఆలోచిస్తుంది. దివ్య దగ్గర ఏ విషయం చెప్పకూడదని ప్రియకి రాజ్యలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. గదిలో ఉన్న దివ్యని చూసి అందమైన మనసే కాదు అందమైన దివ్య కూడా నా సొంతం అయిపోయింది. పెళ్లి అయిన వెంటనే ఫస్ట్ నైట్ కూడా చేసేయొచ్చు కదా అని వెళ్ళి దివ్యని వెనుక నుంచి కౌగలించుకుంటాడు. దీంతో దివ్య గట్టిగా అరుస్తుంది. దెబ్బకి వెళ్ళి గోడకి అతుక్కుపోతాడు.


Also Read: ఫస్ట్ నైట్ కి ముస్తాబైన మిసెస్ న్యూసెన్స్ - వేద జీవితంలో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన యష్


ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కౌగలించుకోబోతుంటే ప్రియ వస్తుంది. దివ్యని మేడమ్ అని పిలుస్తుంటే ఇప్పుడు ఇద్దరం తోడికోడళ్లమే దివ్య అని పిలువు అంటుంది. రాజ్యలక్ష్మి మంచిదని అనుకుని దివ్య తనని తెగ పొగుడుతుంది. నిప్పుల కొలిమిలో వచ్చి పడ్డారని ప్రియ మనసులోనే బాధపడుతుంది. తులసి, నందు వాళ్ళు రాజ్యలక్ష్మి ఇంటికి వస్తారు. బసవయ్య పెళ్లి ఖర్చు ఎక్కువ అయి ఉంటుంది డబ్బు కావాలేమోనని అవమానకరంగా మాట్లాడతాడు. కూతుర్ని, అల్లుడిని ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చామని తులసి చెప్పేసరికి రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. మొదటి రాత్రికి ముహూర్తం ఉంది వాళ్ళని తీసుకుని వెళ్తామని అడుగుతారు. మొదటి రాత్రి ముహూర్తం మీ ఇష్టప్రకారం పెట్టించుకోవడం ఏంటి మమ్మల్ని అడగాలి కదా రివర్స్ అవుతుంది. తులసి వాళ్ళు మాట్లాడుతున్న ప్రతీ మాటకు బసవయ్య పెడార్థాలు తీస్తాడు. ముందు సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత ఫస్ట్ నైట్ చేయాలని చెప్తుంది. సరే అలాగే కానిద్దామనీ అంటుంది. మూడు రాత్రులు కూడా మా ఇంట్లోనే జరగాలీ అది మా ఆచారమని చెప్తుంది. నందు కోపంగా మొహం పెడతాడు.