అన్నయ్య స్టేషన్ లో ఉన్నందుకు పైకి మాత్రం బాధపడుతున్నట్టు నటించమని విష్ణు మల్లికని బతిమలాడుకుంటాడు. జ్ఞానంబ బాధగా కూర్చుంటే వెన్నెల ఓదార్చుతుంటే మల్లిక వచ్చి పుల్ల పెడుతుంది. బావ జైల్లో ఉన్నారు జానకి తప్ప ఎవరైనా చూశారా? బావని కలిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని అడ్డం పడుతుంది. తన ప్రయత్నం తను చేస్తే మన ప్రయత్నం మనం చేద్దాం. మీరు నేను వెళ్ళి ఎస్సైని బతిమలాడుకుందామని సలహా ఇస్తుంది. ఇంత మంచి సలహా ఇంట్లో ఎవరూ ఇవ్వలేదు పద వెంటనే వెళ్దామని జ్ఞానంబ వాళ్ళు బయలదేరుతుంటే గోవిందరాజులు అడ్డం పడతాడు. మల్లిక వెళ్తే ఏదో ఒక గొడవ చేస్తుందని అనుకుంటాడు. నేను వెళ్ళి విషయం కనుక్కుని ఎస్సై కాళ్ళు పట్టుకుని బతిమలాడతానని భర్త సర్ది చెప్తాడు. దీంతో జ్ఞానంబ స్టేషన్ కి వెళ్ళకుండా ఆగిపోతుంది.


ALso Read: ఆట మొదలెట్టిన రాజ్యలక్ష్మి- కండిషన్లు పెట్టి దివ్య, తులసిలను కలవకుండా చేసేసింది


జానకి భర్తకి క్యారేజ్ తీసుకుని వస్తుంది. ఎస్సై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోమను మన యుద్ధం మనం చేద్దామని రామ అంటాడు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఆ నిజం చెప్పేవరకు భోజనం చేయమని కోపంగా వెళ్లిపోతుంటే జానకి ఆపుతుంది. మిమ్మల్ని ఈ కేసులో ఇరికించింది బిల్డర్ మధుకర్. మిమ్మల్ని అరెస్ట్ చేయించి నా చేతులు కాళ్ళు కట్టేసి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని మధుకర్ బెదిరించిన విషయం మొత్తం రామకి చెప్తుంది. వెంటనే ఈ విషయం ఎస్సైకి చెప్పి రక్షించమని అడుగుదామని అంటాడు. ఎస్సై కూడ మధుకర్ తో చేతులు కలిపాడు డీల్ కి ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నాడని వాళ్ళు చెప్పింది చేయడం తప్ప మరొక మార్గం లేదని అంటుంది. కానీ రామ మాత్రం జానకికి ధైర్యం చెప్తాడు. అప్పుడే గోవిందరాజులు రావడం చూసి విషయం తెలియకూడదని చెప్తుంది.


Also Read: అదిరిపోయే ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన స్వప్న- కావ్యకి మరొక అవకాశం ఇచ్చిన రాజ్


ఎస్సైతో మాట్లాడదామని మల్లిక జ్ఞానంబని తీసుకుని వస్తుంటే వాళ్ళని ఆపి నేను వచ్చాను. మీ అమ్మని పట్టుకోవడం సర్ది చెప్పడం కష్టంగా ఉంది. రేపు బారసాలకి నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో భయంగా ఉందని అంటాడు. జానకిని ఎవరు బాధ పెట్టకుండా చూసుకోమని అడుగుతాడు. మావయ్యని ఇబ్బంది పెట్టకండి నిర్ణయం తీసుకోవాల్సింది తనేనని జానకి అంటుంది. అప్పుడే ఎస్సై వచ్చి వెటకారంగా మాట్లాడతాడు. రామని విడిపించే విషయంలో తనేమి చేయలేనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాల్సిందేనని అనేసరికి గోవిందరాజులు బాధపడతాడు. రామ బయటకి రావాలంటే మీ పెద్ద కోడలు గట్టిగా పూజ చేయాలని ఇన్ డైరెక్ట్ గా మాట్లాడతాడు. గోవిందరాజులను తీసుకుని జానకి స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో జ్ఞానంబకి ఏం సమాధానం చెప్పాలా అని గోవిందరాజులు డైలమాలో పడతాడు. ఎస్సై చెప్పిన మాటలు ఇంట్లో చెప్పొద్దని నిజం దాచి పెట్టమని జానకిని అడుగుతాడు. ఇంట్లో అందరి కళ్ళు మన మీదే ఉంటాయి మొదటి సారి అబద్ధం చెప్తున్నానని బాధపడతాడు.