నందినితో ఎలాగైనా పెళ్లి చేస్తానని కృష్ణమ్మ ధైర్యం చెప్తుంది. నా వల్ల నీ సంసారం ఏమైపోతుందనని కంగారు పడతాడు. గౌతమ్ ఫోన్ తీసుకుని మురారీకి ఫోన్ చేస్తుంది. గొంతు మార్చి మాట్లాడుతుంది. మాజీ కమిషనర్ ని అబద్ధం చెప్తుంది. మీ చెల్లి పెళ్లి చేస్తున్నావంట కదా ఎక్కడ పెళ్లి జరిగేదని అడుగుతుంది. కృష్ణ అని గుర్తు పట్టేసిన మురారీ జోక్స్ చేయకని కాల్ కట్ చేస్తాడు. నందుని ముకుంద వాళ్ళ ఇంట్లో దాచారని గెస్ చేసిన కృష్ణ వెంటనే గౌతమ్ ని తీసుకుని బయల్దేరుతుంది. అక్కడ ఇంట్లో నందినిని పెళ్లి కూతురిగా రెడీ చేస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చేజారిపోతుందోనని గౌతమ్ టెన్షన్ పడుతుంటే కృష్ణ తన మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది. దారిలో వెళ్తూ వెళ్తూ మంగళసూత్రం కొంటుంది. ఏ ధైర్యంతో అది కొన్నావని అడుగుతాడు. ముకుంద ఇంటికి వెళ్ళగానే నందిని మెడలో అందరి ముందు తాళి కట్టేయమని సలహా ఇస్తుంది.
Also Read: దివ్య, విక్రమ్ ఫస్ట్ నైట్ జరగకుండా చేసిన రాజ్యలక్ష్మి- తులసికి నందు నిజం చెప్పేస్తాడా?
మండపంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మురారీ డల్ గా ఉండటం భవానీ గమనిస్తుంది. మనం ఇద్దరం ఇలా జంటగా నిలబడి మీ చెల్లి పెళ్లి చేస్తుంటే చాలా సంతోషంగా ఉందని ముకుంద అంటుంది. ఇక్కడ ఎవరికీ తెలియదు కదా మనం ఇద్దరం భార్యాభర్తలం కాదని నవ్వుతుంది. మురారీ మొహంలో చెల్లెలి పెళ్లి జరుగుతుందని సంతోషమే కనిపించడం లేదని ఈశ్వర్, ప్రసాద్ భవానీతో అంటారు. ఇప్పటి వరకు కృష్ణ తనకి అసలు విషయం చెప్పలేదని అర్థం అయ్యిందని అనుకుంటుంది. ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి రహస్యంగా జరగడానికి కారణం ఆ తింగరి పిల్ల. ఈ పెళ్లి జరగనివ్వు తర్వాత దాని సంగతి చూస్తానని అంటుంది. కృష్ణ వాళ్ళు ముకుంద ఇంటికి వస్తారు. కానీ అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంటుంది. మనం రావడం గెస్ చకేసి నందిని మండపానికి తీసుకుని వెళ్లిపోయారని కృష్ణ టెన్షన్ పడుతుంది.
Also Read: స్వప్నకి వార్నింగ్ ఇచ్చిన కావ్య- భార్యని వదిలేసి రాజ్ ని ఇంట్లో అడుగుపెట్టమన్న అపర్ణ
ఏసీపీ సర్ మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేసి నందిని పెళ్లి ఎక్కడ జరుగుతుందో కనుక్కోవడానికి కృష్ణ ట్రై చేస్తుంది. వాళ్ళ దామోదర్ అంకుల్ కి ఫోన్ చేసి నెంబర్ ట్రేస్ చేయమని అడుగుతుంది. పంపిస్తానని ఆయన చెప్తాడు. నందినిని పెళ్లి మండపానికి తీసుకుని వస్తుంటే రానని మారాం చేస్తుంది. కృష్ణ కావాలని అంటే లోపల ఉందని అబద్ధం చెప్తారు. పెళ్లి కొడుకు సిద్ధూ అనుకుని సంతోషంగా నందిని మండపం లోపలికి వస్తుంది. పెళ్లికూతురిగా ఉన్న నందినిని చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. కృష్ణ ఏది, సిద్ధూ రాలేదా మళ్ళీ బాబాయ్ వాళ్ళు కొట్టారా అని నందిని అడుగుతుంది. తనకు ఈ పెళ్లి వద్దని ఇంటికి వెళ్లిపోదామని ఈ అలేఖ్య అబద్ధం చెప్పిందని నందిని గొడవ చేస్తుంది. పెళ్లి జరిగేదాక నోరు ఎత్తడానికి వీల్లేదని ఈశ్వర్, ప్రసాద్ బెదిరిస్తారు.