స్వప్న తన గదికి వెళ్తుంటే అది అక్క, బావ ఉంటున్నారని అప్పు చెప్తుంది. తన గదికి తీసుకెళ్ళి చాప ఇచ్చి కింద పడుకోమని అంటుంది. లేచిపోయిన దానికి ఇదే ఎక్కువ అని అవమానించేలా మాట్లాడుతుంది. కావ్య నిద్రపోకుండా తెల్లారే వరకు బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి అది చూసి రాత్రంతా నిద్రపోలేదా అని అడుగుతాడు. నేను ఇలా చేయకపోతే ఒక పది రోజులు రాత్రుల పాటు మీకు ఏమి ఉండదని బాధగా చెప్తుంది. అంత గొడవ జరిగినా కూడా ఇంత అందంగా ఎలా వేయగలిగావు చెయ్యి తొణకలేదా అంటాడు. అదే కళాకారుల గొప్పదనం అంటుంది. రాత్రి జరిగిన దానికి మీ ఆయన నిన్ను దోషిగా చేయలేదా అని అడుగుతాడు. అంటుకుంది కానీ దాన్ని పోగొట్టుకుంటానని ధైర్యం చెప్తుంది.


రాహుల్ రాజ్ కి ఫోన్ చేస్తాడు. నేను ఎక్స్ పెక్ట్ చేసింది జరిగింది రాత్రి స్వప్న ఇక్కడికి వచ్చిందని అనగానే షాక్ అవుతాడు. కళావతి స్వప్నని బయటకి పంపించిందని నువ్వు చెప్పింది కరెక్ట్ అంటాడు.


రాహుల్: అయితే కళావతిని అక్కడే వదిలేసి వస్తున్నావ


Also Read: యష్ షాకింగ్ డెసిషన్- వేదకి విడాకులు, అయోమయంలో వసంత్


రాజ్: లేదు తీసుకొస్తున్నాను అందుకు వేరే కారణం ఉందిలే అంటుండగా స్వప్న వచ్చి పిలుస్తుంది. డోర్ బయట నిలబడమని చెప్తాడు.


స్వప్న: నీకు చాలా అన్యాయం జరిగింది నేను వెళ్ళిపోవడం అవకాశంగా తీసుకుని కావ్య బెన్ఫిట్ పొందింది


రాజ్: అది నేను మీ చెల్లి తేల్చుకుంటాం మధ్యలో నీ ఎనాలసిస్ అవసరం లేదు


స్వప్న: నేను వెళ్లిపోతే పెళ్లి ఆగిపోతుందని అనుకున్నా కానీ కావ్యని పెళ్లి చేసుకుంటారని అనుకోలేదు


రాజ్: మీ చెల్లి మోసం చేసిందని బయట పడితే శిక్ష అనుభవిస్తుంది కానీ నువ్వే మోసం చేశావని తెలిస్తే దుగ్గిరాల వారసుడిని ఎందుకు మోసం చేశానా అని జీవితాంతం బాధపడేలా చేస్తాను అప్పటి వరకు నీ చెల్లి గురించి చెడుగా చెప్పే అర్హత నీకు లేదు వెళ్ళు


కావ్య వచ్చి మేము వెళ్లిపోతున్నామని అంటుంది. రాహుల్ అప్పుడే స్వప్నకి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కావ్య లిఫ్ట్ చేస్తుంది. అసలు నీకు బుద్ధి ఉందా రాజ్ వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పినా కూడా అక్కడికి ఎందుకు వెళ్లావ్ అని అరుస్తాడు. ఈ వాయిస్ రాహుల్ ది అంటే స్వప్నని ట్రాప్ చేసింది ఇతనా అని కావ్య షాక్ అవుతుంది.


రాహుల్: రాజ్ దగ్గరకి వెళ్ళి ఏం మాట్లాడావ్ పెళ్లి నుంచి లేచిపోయింది నాతో అని చెప్పకు నువ్వు నేను రోడ్డున పడాల్సి వస్తుంది అంటుండగా రాజ్ రావడం చూసి కాల్  కట్ చేస్తుంది. ఉండమని కనకం రాజ్ ని బతిమలాడుతుంది. కానీ రాజ్ మాత్రం క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఈరోజు కోపంతో వెళ్తున్న ఈయన అభిమానంతో ఇంటికి వస్తారని కావ్య సర్ది చెప్తుంది. మన ఇంటికి చిచ్చు పెట్టిన మనిషిని బయటకి తీసుకొచ్చి రాజ్ కి అప్పగిస్తానని స్వప్నకి వార్నింగ్ ఇస్తుంది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పి వెళ్తుంది ఏంటని ఫోన్ చెక్ చేసుకుంటుంది. రాహుల్ అని తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతుంది.


ALso Read: ఆట మొదలెట్టిన రాజ్యలక్ష్మి- కండిషన్లు పెట్టి దివ్య, తులసిలను కలవకుండా చేసేసింది


రాజ్ వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటే అపర్ణ ఆగు అని అరుస్తుంది. మొదటి సారి కన్న తల్లి మాట పెడ చెవిన పెట్టి ఇష్టం లేని కొంపకీ వెళ్లావ్. ఈ మార్పు నీలో రావడానికి కారణం అయిన ఆ మనిషిని ఈ ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ఇంట్లో దింపి రమ్మని కళ్యాణ్ కి చెప్పమని అపర్ణ అంటుంది. క్షమించు అక్క నా కొడుక్కి ఆ పాపం నేను అంటగట్టలేనని ధాన్యలక్ష్మి ఎదురు తిరుగుతుంది. నీకు దెబ్బ తగిలినప్పుడు మీ అమ్మ తట్టుకోలేక అక్కడికి వస్తే ఎందుకు తనతో రానని సరైన వివరణ ఇచ్చుకోమని ఇంద్రాదేవి నిలదీస్తుంది. నేను వెళ్ళమని చెప్పాను కానీ అప్పుడు నడవలేక స్థితిలో ఉండి రాలేకపోయారని కావ్య చెప్తుంది.