Gruhalakshmi Today Episode : దివ్య తులసి దగ్గరకు వచ్చి ఇంకా ఎన్నాళ్లు ముభావంగా ఉంటావని అడుగుతుంది. ఇప్పటికైనా అందరితో కలివిడిగా ఉండమని కోరుకుంటుంది.  జీవితంలో సర్దుకుపోవడం మాకు నేర్పిన నువ్వే ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తుంది దివ్య.


తులసి:  నా కాలు తొక్కితే భరిస్తాను. నా చెయ్యి విరిస్తే సహిస్తాను. ఏకంగా నా గొంతు మీదే కాలేసినప్పుడు నేను అరవకపోతే.. అది త్యాగం అనిపించుకోదు చేతకాని తనం అనిపించుకుంటుంది.


దివ్య: అది కాదమ్మ..


 తులసి: దివ్య హనీ విషయంలో విక్రమ్‌తో నువ్వు ఏమన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో.. మా అమ్మ ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. తప్పు చేయదు అన్నావ్‌.. మరిప్పుడు ఆ నమ్మకం ఏమైందమ్మా ఎందుకు మీ అమ్మను ప్రశ్నిస్తున్నావ్‌. మీ నాన్న మీద నీకున్న ప్రేమ అమ్మ మీద నమ్మకాన్ని మింగేస్తుందా?


అనగానే దివ్య లేదమ్మా మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటోళ్లు అనగానే నాకు ఆ రెండో కంటి గురించి తెలియదు అంటుంది దివ్య. దూరం నుంచి గమనిస్తున్న నందగోపాల్‌ బాధగా నిలబడి చూస్తుంటే.. వాళ్ల నాన్న వచ్చి ఓదారుస్తాడు. నువ్వు భోజనం చేయడం లేదని తాతయ్య, నాన్నమ్మ కూడా  భోజనం చేయడం లేదని చెప్పడంతో తులసి బాధపడి పాలు తాగుతుంది. ఇంతలో అక్కడికి తులసి వాళ్ల తమ్ముడు వస్తాడు. తమ్ముడిని చూసిన తులసి వాళ్ల అమ్మ గురించి తలుచుకుని బాధపడుతుంది. పుట్టింటికి రావాలని తమ్ముడు కోరగా వస్తానని చెప్పి దివ్యను వాళ్ల తమ్ముడిని ఇంటికి  వెళ్లమని చెప్తుంది తులసి.


విక్రమ్‌ వాళ్ల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంత అర్జెంట్‌గా ఎందుకు పిలిచావని విక్రమ్‌ వాళ్ల అమ్మను అడుగుతాడు. హాస్పిటల్‌ గురించి ఒక ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడుదామని పిలిచానని వాళ్ల అమ్మ చెప్పగానే..


విక్రమ్‌: హాస్పిటల్‌ నీది ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే హక్కు నీకుంది. మాకు చెప్పడం ఏంటమ్మా? అనవసరం..


దివ్య: విక్రమ్‌.. అత్తయ్యగారు చెప్పాలనుకున్నప్పుడు వినోచ్చు కదా? లేకపోతే తను బాధపడుతుంది. మీరు చెప్పండి అత్తయ్యా విక్రమ్‌ మాటలు పట్టించుకోకండి.


అనగానే వాళ్ల అమ్మ హాస్పిటల్ లో సడెన్‌గా నష్టాలు వస్తున్నాయని చెప్తుంది. ఎందుకొచ్చాయని అందరూ అడగ్గానే సేవాభావం ఎక్కువైనందుకు నష్టాలు వచ్చాయని  చెప్తుంది.  ఫ్రీ సర్వీస్‌ వల్ల మనకు మంచి పేరు వస్తుందని.. బాధపడటం కన్నా మన వేరే బిజినెస్‌ లు లాభంగానే నడుస్తున్నాయని అక్కడి నుంచి ఫండ్స్‌ తీసుకొచ్చి హాస్పిటల్‌లో పెట్టండని దివ్య చెప్తుంది. దీంతో విక్రమ్‌ కూడా దివ్య ఐడియా బాగుందని మెచ్చుకుంటాడు.  


విక్రమ్‌ : అమ్మా హాస్పిటల్‌కు లాస్‌ వచ్చిందని ఇక్కడ నిన్ను అడిగే వారెవ్వరూ లేరు. మనం చేసే ‌ఫ్రీ ఆపరేషన్స్‌ ఆపాల్సిన అవసరం లేదు.


దివ్య: అత్తయ్యాగారు. మీ డౌట్స్‌ అన్ని తీరినట్లేగా.. మీటింగ్‌ అయిపోయినట్లేగా.. ఇక ఎవరి పనులు వాళ్లు చేసుకోరి అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.


తులసిని వాళ్ల అత్తయ్య, మామయ్య వచ్చి ఓదారుస్తారు.


తులసి: అమ్మ జ్ఞాపకాలు నన్ను బాధపెట్టడం లేదు మామయ్య. నిజానికి ఆ జ్ఞాపకాలు అమ్మ ఇంకా బతికే ఉందేమోనన్న అనుభూతిని ఇస్తున్నాయి. కాకపోతే అమ్మను బతికించుకోలేకపోయిన నా దురదృష్టం నన్ను బాధిస్తుంది. జీవితాంతం దోషిగా బతకాల్సిందే


మామయ్య: ఏది ఎలా జరగాలో మన చేతుల్లో ఉంటే ఎవరికి కష్టాలు కన్నీళ్లు ఉండవు. అవి లేకుండా ఆ పై వాడు ఎవరి తలరాతలు రాయడమ్మా


అత్తయ్య: అవును కన్నీళ్లు లేకపోతే సంతోషం విలువ తెలియదు.


అని చెప్తుండగానే లాస్య, భాగ్యం అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన తులసి వాళ్లు షాక్‌ అవుతారు. ఎందుకొచ్చారని అడుగుతారు తులసిని పరామర్శించడానికి వచ్చామని భాగ్యం చెప్తుంది. నువ్వొచ్చావు సరే తనను ఎందుకు తీసుకొచ్చావు అంటూ అడుగుతారు. నందగోపాల్‌, లాస్య, భాగ్యం మాట్లాడుకుంటుండగా


తులసి: అత్యయ్య నాకు ఆయనకు సంబంధం లేదని చెప్పినా ఎందుకు నా విషయంలో ఇంకా జోక్యం చేసుకుంటున్నారు.  ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి


అంటూ కోపంగా తులసి లోపలికి వెళ్తుంది. తులసి బెడ్‌ రూంలోకి వెళ్లిన తర్వాత భాగ్యం తులసి దగ్గరకు వెళ్లి..


భాగ్యం: అక్క సిన్సియర్‌గా చెప్తున్నాను  మీ అమ్మగారు పోయారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. నిన్ను ఓదార్చి పలకరించి వెళ్దామనే వచ్చాను. నన్ను నమ్ము అక్క. ఈ కష్టాన్ని తట్టుకునే గుండె ధైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.  


లాస్య: నా తరపున కూడా కోరుకో.. తులసి అక్క ధైర్యం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిని తట్టుకున్న ఉక్కుమనిషి. ఇంకా ఎన్నో ఎదురుదెబ్బలు తినాల్సి ఉంది.


అంటూ వెటకారంగా లాస్య మాట్లాడుతుంటే.. తులసి కోపంగా చూస్తుంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.