దివ్య తండ్రి బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని అనుకుంటుంది. తండ్రి కోసం డ్రెస్ తీసుకొచ్చి అది వేసుకుని పార్టీకి రమ్మని అంటుంది. ఒంటరి వాడికి అసలు పుట్టినరోజు చేసుకోవడమే ఎక్కువ ఇంత గ్రాండ్ గా అవసరమా అని నందు అంటాడు. లాస్య పీడ విరగడ అయ్యిందని పండగ చేసుకోమని దివ్య సలహా ఇస్తుంది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నానని నందు బాధపడతాడు.
దివ్య: నువ్వు పాడు చేసుకున్న జీవితం గురించి ఆలోచిస్తున్నావ్. నువ్వు చెల్లాచెదురు చేసిన మరొక జీవితం గురించి ఆలోచించవా? సంబంధం లేదా?
నందు: మీ అమ్మకి చేసిన అన్యాయం తలుచుకుని బాధపడని రోజు లేదు
దివ్య: ఉన్న కొంచెం జీవితం బాధపడుతూ వృధా చేసుకోవడం అవసరమా? నీకు అమ్మతోడు కావాలి. మాకు మీ ఇద్దరూ కలిసి ఉండటం కావాలి. ప్రయత్నించి చూడు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడని అనుకో. భారం దేవుడి మీద వెయ్యి. నీలో నిజాయితీ కనిపిస్తే అమ్మ ద్వేషించదు
Also Read: 'సాటి మనిషి' అంటూ రాజ్ తిక్క కుదిర్చిన కావ్య- వైరల్ గా మారిన స్వప్న యాడ్
ఇల్లంతా అందంగా డెకరేట్ చేస్తారు. విక్రమ్ కూడా పనుల్లో సాయం చేస్తూ ఉంటాడు. వద్దని చెప్పినా కూడా వినకుండా అల్లుడు, అమ్మాయి ఈ పార్టీ ఏర్పాటు చేశారని తులసి గొప్పగా చెప్తుంది. ఇక నందు కిందకి వస్తుంటే పూలు జల్లి మరీ తీసుకొస్తారు. బాబోయ్ చండాలంగా అనిపిస్తుంది. ఇక పార్టీకి వచ్చిన ఆడవాళ్ళు నందుకి విషెష్ చెప్పి లాస్య ఎక్కడని అడుగుతారు. లాస్యకి డివోర్స్ ఇచ్చానని కోపంగా చెప్తాడు. లాస్యకి కూడా డివోర్స్ ఇచ్చారా? అని అనేసరికి అందరీ మొహాలు మాడిపోతాయి. దివ్య తండ్రికి నచ్చజెపుతుంది.
రెండో పెళ్ళానికి కూడా డివోర్స్ ఇవ్వడం ఏంటని పార్టీకి వచ్చిన వాళ్ళు గుసగుసలాడుకుంటారు. లాస్య మీద పగ తీర్చుకోవడానికి తులసి మాజీ మొగుడిని దగ్గర చేసుకుంటుందని తప్పుగా మాట్లాడతారు. అవన్నీ నందు విని ఆవేశంగా వెళ్లబోతుంటే తులసి అడ్డుపడుతుంది. ఇక లాస్య గొడవ చేసేందుకు ఇంటికి వస్తుంది. లాస్యని చూడగానే ఒక బేరర్ వచ్చి తనని పలకరిస్తాడు. వచ్చిన గెస్ట్ లకు మామూలు డ్రింక్స్, నందగోపాల్ ఫ్యామిలీకి మత్తు కలిపిన కూల్ డ్రింక్స్ వెళ్తాయని అతడు చెప్తాడు. తులసికి ఎలాగైనా ఈరోజు తన మనసులో మాట చెప్పాలని నందు తెగ ట్రై చేస్తాడు. లాస్య రావడం చూసిన తులసి ఏదో పెంట పెట్టబోతుందని అనుకుని తనని పంపించాలని ఎదురువెళ్తుంది. ఇద్దరూ వాదులాడుకోవడం నందు చూసి తను కూడా వెళతాడు.
నందు: నువ్వు ఎందుకు వచ్చావు
లాస్య: నీ మాజీ భార్య ఇప్పటి వరకు ఇదే పీక్కుని తిన్నది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా?
Also Read: యష్ కి తలస్నానం చేయించిన మాళవిక, వాత పెట్టిన వేద- వసంత్ కాపురంలో చిచ్చుపెట్టబోతున్న గీత
నందు: కోర్టు మనకి విడాకులు ఇచ్చింది నీకు నాకు సంబంధం లేదు
లాస్య: తులసికి నీకు కూడా ఇచ్చింది కదా మరి ఎందుకు తనని పట్టుకుని వేలాడుతున్నావ్. తులసిని తరిమేయ్ నేను నీ జోలికి రాను
నందు: చెప్పడానికి నువ్వు ఎవరు
లాస్య: నేను తులసిలాగే మాజీ భార్యని. నిజం చెప్పాలంటే తాజా మాజీ భార్యని
లాస్య ఇచ్చిన బొకేని నందు తన కాలి కింద వేసి తొక్కేస్తాడు. తనని బలవంతంగా బయటకి గెంటేయబోతుంటే అందరూ ఆపుతారు.