యష్ తనకి తలస్నానం చేయించమని వేదని అడుగుతాడు. దీంతో వేద నలుగు పెట్టి మరీ భర్తకి ప్రేమగా స్నానం చేయిస్తుంది. అది మాళవిక చూసి కుళ్ళుకుంటుంది. చూడలేక చస్తున్నా తలుపులు అయినా వేసుకోవచ్చు కదా అని తిట్టుకుంటుంది. ఇక యష్ కుదురుగా ఉండకుండా చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఖుషి పిలుస్తుంది. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయమని పంపిస్తాడు. తను వెళ్ళగానే కుంకుడు రసం కళ్ళలో పడేసరికి మాళవిక వస్తుంది. వేదనే వచ్చిందని యష్ అనుకుని కాసేపు తలంటమని చెప్తాడు. కాసేపటికి మాళవిక వెళ్ళిపోయి వేద వచ్చి సోరి చెప్తుంది. ఇప్పటి వరకు నా తలంటావ్ కదా అంటాడు. అప్పుడే వేద మాళవికని చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది. తన కళ్లలో ఎంత కుళ్ళు, ఎంత పొగరు అని మాళవిక కిచెన్ లో ఉండి తిట్టుకుంటూ ఉండగా వేద వచ్చి ఏం చేస్తున్నావని అంటుంది. కాసేపు తనని పొగిడి వేద అట్లకాడ తీసుకుని మాళవిక చేతికి వాత పెడుతుంది.


వేద: ఏమన్నావ్ నా కళ్లలో కుళ్ళు కనిపించిందా? అది కుళ్ళు కాదు నా మొగుడిని ముట్టుకున్నందుకు కసి. నా పొగరు పగగా మారితే తట్టుకోలేవు. నేను బిగిన్ చేస్తే దేనికి పనికిరావు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.


Also Read: తులసమ్మ ఇంట్లో వెల్లివిరిసిన నవ్వులు- రాజ్యాలక్ష్మి ముందే మొగుడ్ని లాక్కుని వెళ్ళిపోయిన దివ్య


వసంత్ గీత దగ్గరకి వస్తాడు. తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. గీత వసంత్ ని కౌగలించుకుంటే కాస్త ఇబ్బందిగా ఫీల్అవుతాడు.


గీత: నీ వైఫ్ ఎలా ఉంది. అన్నీ తెలుసుకుని వచ్చాను. నేను నీమీద ఎటువంటి హక్కు కోరుకోవడం లేదు. కానీ నా మనసులో నువ్వే ఉన్నావ్. నేను నీ దాన్ని కాకపోయినా నీ మనసులో నేను ఉంటానని నాకు తెలుసు


వసంత్: తనకి ఫీవర్


గీత: ఈ విషయం చెప్తే అసలు కలుద్దామని కూడా అడిగేదాన్ని కాదు కదా. సరే వెళ్ళు వసంత్. అవును నా నెంబర్ ఫీడ్ చేసుకున్నావా?


వసంత్: లేదు


గీత: సరే ఇవ్వు నేను ఫీడ్ చేస్తాను అనేసి ‘లైఫ్ ఆఫ్ లవ్’ అని నెంబర్ ఫీడ్ చేస్తుంది.


మాళవిక చేతికి ఆయింట్ మెంట్ రాసుకుంటుంటే సులోచన, మాలిని చూసి ఏమైందని అడుగుతారు. అది పెట్టుకున్న వాత లాగా లేదు పెట్టిన వాత లాగా ఉందని కాసేపు తనని ఆడుకుంటారు. వేద వాత పెట్టిందని చెప్తే యష్ కి స్నానం చేయించిన విషయం తెలుస్తుంది. అది తెలిస్తే వీళ్ళు అసలు ఊరుకోరని మనసులో అనుకుని తనకెవరూ వాత పెట్టలేదని కవర్ చేసుకుంటుంది. కానీ మాలిని మాత్రం వదలకుండా ఎవరు వాత పెట్టారు చెప్పమని ఫోర్స్ చేస్తుంది.


Also Read: ముకుంద కుట్రతో సన్మానం నుంచి వెళ్ళిపోయిన మురారీ - కృష్ణ దూరం కాక తప్పదా?


యష్ వేదని పిలిచి తనని పట్టించుకోవడం లేదని అంటాడు. టై కట్టమని చెప్పి భార్యతో సరసాలు మొదలుపెడతాడు. ఖుషి డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ మమ్మీ అని పిలుస్తుంది. మాళవిక వచ్చి తను తినిపిస్తానని అంటుంది.


ఖుషి: నేను పిలిచింది నిన్ను కాదు వేద అమ్మని. తను వచ్చి తినిపిస్తుంది నువ్వు వెళ్ళు


మాళవిక: వేద అమ్మ వేద అమ్మ ఎవరు అసలు ఆ వేద.. ఏం నీకు తినిపించకూడదా?


ఖుషి: ఎవరికైనా తినిపించేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి కానీ నీ చేతులు చూడు ఎంత జిడ్డుగా ఉన్నాయో. వేద అమ్మ నాకు అన్నీ మంచి అలవాట్లు నేర్పిస్తుంది. కానీ నువ్వు ఆది అన్నయ్యకి చెడు అలవాట్లు నేర్పిస్తున్నావ్. అందుకే నాకు వేద అమ్మ అంటేనే ఇష్టం


మాళవిక: ఏంటే నీ వేద అమ్మ త్వరలో దాన్ని ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను చూడు


ఖుషి: నువ్వు మా అమ్మని ఏం చేయలేవు. అయినా ఇది నీ ఇల్లు కాదు వేద అమ్మ ఇల్లు


మాళవిక: ఏంటే నువ్వు దాన్ని సమర్థిస్తున్నావ్. నేను నిన్ను తొమ్మిది నెలలు మోసి కన్నాను


ఖుషి: కన్నా ఆరు నెలలకే నన్ను వదిలేసి వెళ్లిపోయావ్ నాకు వేద అమ్మ ఎక్కువ అనగానే మాళవిక తనని కొట్టబోతుంటే వేద ఆపుతుంది.