కృష్ణకి సన్మానం జరిగే చోటుకి నందిని వస్తుంది. కూతుర్ని చూసి భవానీ దేవి ఎమోషనల్ అవుతుంది. తప్పు చేశాను క్షమించమని నందిని అడుగుతుంది. నీ ఇంటికి నువ్వు రావడానికి అమ్మ అనుమతి కావాలా అని భవానీ అనేసరికి అందరూ చాలా సంతోషపడతారు. ఇక నందిని ఇంట్లో అందరినీ పేరు పేరునా వెళ్ళి పలకరిస్తుంది.
భవానీ: ఈరోజు నా కూతురు నా దగ్గరకి వచ్చింది కృష్ణ నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు
కృష్ణ: అవేం మాటలు పెద్దత్తయ్య మీరు నాకు దైవంతో సమానం
ఇక కృష్ణ సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడికి ముకుంద తండ్రి శ్రీనివాసరావు మురారీతో మాట్లాడటానికి వస్తాడు.
మురారీ: ఆదర్శ్ కావాలని ఇంటికి రావడం లేదని పెద్దమ్మతో ఎందుకు చెప్పారు
Also Read: కావ్యని పాతాళానికి తొక్కేసిన రాజ్ - స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తారా?
శ్రీనివాసరావు: నిజాలు తెలియాలనే చెప్పాను. నువ్వు ముకుంద ప్రేమించుకున్న విషయం, మీ ప్రేమ త్యాగం తెలియాలనే చెప్పాను
మురారీ: త్యాగం అంటే నైతికంగా భౌతికంగా బంధాన్ని వదిలేయడం. మరి మీరు ఎందుకు ఆ బంధాన్ని కలపాలని చూస్తున్నారు
శ్రీనివాసరావు: నా కూతురి జీవితాన్ని కాపాడుకోవడం కోసం చెప్పాను
మురారీ: మీ కూతురి కోసం ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారా?
శ్రీనివాసరావు: ఎవరో అమ్మాయి కోసం నా కూతురి జీవితాన్ని నువ్వు బలి చేస్తావా?
మురారీ: ఎవరో అమ్మాయి కాదు నాకు జీవితాన్ని ఇచ్చిన గురువు కూతురు. నేను తాళి కట్టిన భార్య
శ్రీనివాసరావు: నా కూతురు నువ్వు ప్రేమించిన అమ్మాయి. నీకు తన మీద బాధ్యత ఉంటే మీదఈ అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా ఉండేవాడివి. ఎందుకు చెప్పావు. నీకు ఏం చెప్పాను తనకి నీమీద కోపం వచ్చేలా చేయమని చెప్పాను కానీ ఏం చేశావు
మురారీ: నేను చాలా చేశాను. తన మీద ద్వేషం కూడా చూపించాను. కానీ తన ప్రేమని భరించలేకపోతున్నా. తను నా ప్రాణ స్నేహితుడి భార్య, తన ప్రేమ నాకొద్దు. తనని ఎప్పటికీ ప్రేమించలేను
శ్రీనివాసరావు: నాకూతురి జీవితం ఏమవుతుందో నాకు తెలియదు. కానీ తను ఏమైనా చేసుకుంటే మాత్రం దానికి కారణం నువ్వు మాత్రమే
ముకుంద మురారీ దగ్గరకి వచ్చి కృష్ణని దూరం చేసే విధంగా తప్పు దోవ పట్టించేలా మాట్లాడుతుంది.
ముకుంద: కృష్ణ నిజంగా నిన్ను ప్రేమిస్తే ఈ సన్మానంలోనే తన ప్రేమ నీకు చెప్తుంది. ఒకవేళ తనని నీమీద ప్రేమ లేకపోతే ఏసీపీ సర్ అంటుంది. ప్రేమలో హక్కు ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ ఆ హక్కుని ఫీల్ అయ్యిందా? నేను నీ ప్రేమలో బతుకుతున్నా? నువ్వు భ్రమలో బతుకుతున్నావ్
మురారీ: కృష్ణ నన్ను ప్రేమిస్తుందని గట్టి నమ్మకం. నువ్వు ఎలా నీ ప్రేమ నిలబడుతుందని నమ్ముతున్నావో నా ప్రేమ నిలబడుతుందని నేను నమ్ముతున్నా. నీది సంస్కృతికి విరుద్ధమైన ప్రేమ. నా ప్రేమ గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్
భవానీ దేవిని స్టేజ్ మీదకి పిలుస్తారు. కృష్ణ గురించి గొప్పగా చెప్తుంది. నిజంగా కృష్ణ తన కోడలు అవడం చాలా గర్వంగా ఉందని అందరి ముందు చెప్తుంది. తర్వాత కృష్ణకి ట్రైనింగ్ ఇచ్చిన సీనియర్ డాక్టర్ గౌతమ్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతాడు. మురారీ దూరంగా నిలబడి ఉంటే కృష్ణ పక్కన వచ్చి కూర్చోమని పిలుస్తుంది. కానీ మురారీ మాత్రం రానని చెప్తాడు. కృష్ణకి సన్మానం చేసేందుకు స్టేజ్ మీదకి పిలుస్తారు.
Also Read: షాకింగ్ ట్విస్ట్, రొమాన్స్ లో మునిగిపోయిన యష్, వేద- వసంత్ జీవితంలోకి మరో అమ్మాయి?
కృష్ణ: నా సక్సెస్ వెనుక కారణం మా ఏసీపీ సర్. ఆయన ప్రోత్సాహం వల్లే ఇక్కడ ఉన్నా. ఈ చప్పట్లు, సన్మానం అన్నీ ఆయన పెట్టిన భిక్ష. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేను
ముకుంద: ఇప్పుడు చెప్పు మురారీ.. ప్రేమికుల మధ్య రుణాలు, కృతజ్ఞలు ఉంటాయా?
కృష్ణ: నన్ను డాక్టర్ ని చేయడం కోసం ఆయన చాలా శ్రమించారు. బాధ్యత తీసుకున్నారు. నన్ను పసిపాపలాగా గాజుబొమ్మలాగా చూసుకున్నారు. నేను ఎంత అల్లరి చేసినా విసుక్కోలేదు. నన్ను ఎవరూ ఏమి అనకుండా నా గమ్యాన్ని చేర్చారు. గురువుకి ఇచ్చిన మాట నెరవేర్చారు. నా మాటల్లో మీరు ఎంత ఇష్టమో చెప్పాను ఇది సభ కాబట్టి చెప్పలేకపోతున్న లేదంటే ఐలవ్యూ అని గట్టిగా అరిచి చెప్పేదాన్ని అని మనసులో అనుకుంటుంది.