వేద, యష్ తాగిన మైకంలో ఒక్కటవుతారు. నిద్రలేచిన వేద రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుని చాలా సంతోషపడుతుంది. సులోచన పట్టరాని ఆనందంతో మాలిని దగ్గరకి వస్తుంది. రత్నం ఏంటి అంట సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. మాలిని రాగానే ఇక కానివ్వండి మీరు ఇద్దరూ కలిస్తే మా చెవుల్లో డప్పులు వాయిస్తారు కదా అనేసరికి ఇక ఇద్దరూ రత్నం మీద గొడవకు దిగుతారు.
సులోచన: సంతానప్రాప్తి కలగబోతుంది. పిల్లలు పుట్టబోతున్నారంటే సంతోషపడకుండా ఆశ్చర్యపడతారు ఏంటి వదిన
మాలిని: అవ్వా.. ఈ వయసులో ఏంటి వదిన వెంటనే తీయించేసుకో. ఇంక ఎవరికైనా తెలిస్తే బాగోదు
సులోచన: ఛీ ఛీ అది నాకు కాదు. వేదకి తల్లి అయ్యే ఛాన్స్ వచ్చిందంట
మాలిని: అవునా.. అయితే నాకు బుజ్జి మనవరాలు పుట్టబోతోందన్నమాట
Also Read: బోల్డ్ యాడ్ షూట్ లో స్వప్న, పుట్టింటికి అండగా నిలిచిన కావ్య
సులోచన మాటలు మాళవిక విని షాక్ అవుతుంది. వేద ఎప్పటికీ తల్లి కాదు ఇదే నా నిర్ణయం, ఇదే నా శాసనం అనుకుంటుంది. వేద తలస్నానం చేసి యష్ షర్ట్ వేసుకుంటుంది. యష్ వచ్చి చూసేసరికి తెగ సిగ్గు పడిపోతుంది. మళ్ళీ ఇద్దరూ రొమాన్స్ లో మునిగిపోతారు. చిత్రకి ఫీవర్ రావడంతో వసంత్ కంగారుపడిపోతాడు. హాస్పిటల్ కి వెళ్దామని అంటే వద్దని చెప్పి ట్యాబ్లెట్ వేసుకుంటుంది. అప్పుడే ఆఫీసు నుంచి మీటింగ్ ఉందని రమ్మని కాల్ చేస్తారు. భార్యకి ఆరోగ్యం బాగోలేదని మీటింగ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్తాడు. మళ్ళీ వసంత్ కి ఫోన్ వస్తుంది. అటు వైపు నుంచి అమ్మాయి వాయిస్.. ఎలా ఉన్నావ్ వసంత్.. నేను గీతని అంటుంది.
గీత: నీకోసమే వచ్చాను. నిన్ను చూడాలని మాట్లాడాలని. నీతో ఏకాంతం పంచుకోవాలని అనిపిస్తుంది
వసంత్: ఎక్కడ ఉన్నావ్, లొకేషన్ షేర్ చెయ్యి వస్తాను
వేద సంతోషంగా భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని పాట పాడుకుంటూ ఉండగా ఖుషి వస్తుంది. తల్లి సంతోషంగా ఉండటం చూసి ఆనందంగా ఉంటుంది. నువ్వు చాలా బాగా పాడుతున్నావ్ అమ్మా అని మెచ్చుకుంటుంది. వీళ్ళ మాటలు మాళవిక వింటుంది. ఖుషి వెళ్లిపోగానే మాళవిక వచ్చి ఏంటి చాలా ఆనందంగా ఉన్నావని అంటుంది.
వేద: ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు నచ్చదు అది ఒక్కటే కదా నీకు తెలిసింది
మాళవిక: నేను ఇక్కడ ఉన్నా కూడా నువ్వు ఆనందంగా ఉన్నావంటే ఏదో గొప్ప విషయం అయ్యి ఉంటుంది. అది ఏంటో తెలుసుకుందామని
వేద: నా సంతోషానికి కారణం తెలిస్తే నువ్వు భరించలేవు
Also Read: రిషిధార మీద అనుమానపడిన ఏంజెల్- రిషిని మట్టి కరిపించమని కొడుక్కి నూరిపోసిన దేవయాని
మాళవిక: భరించలేను.. ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉండటం అసలు భరించలేను
వేద: దీన్నే అహంకారం అంటారు. నీ అహంతో నా ఆనందాన్ని ఆపలేవు. ఈరోజు ఖుషి నన్ను కన్నతల్లిగా ట్రీట్ చేస్తుంది. రేపు ఆదిత్య కూడా నాకు దగ్గరవుతాడు. అప్పుడు నువ్వు ఒంటరి దానివి అవుతావు. కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడమే మంచిది. కాలం గడిచే కొద్ది నా ఆనందానికి కారణం తెలుస్తుంది. అప్పటి వరకు ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటావో లేదంటే ప్రశాంతంగా ఉంటావో నీ ఇష్టం. నీలాగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకొను. అందరిలాగా హ్యపీగా ఉండటానికి ట్రై చెయ్యి
యష్ స్నానం చేసి వేదని పిలుస్తాడు. మా ఆయన పిలుస్తున్నాడు నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని. ఏమైనా నీకు థాంక్స్ చెప్పాలి. అంత మంచి హజ్బెండ్, కూతురు, ఫ్యామిలీ దొరికాయని అనేసి వేద వెళ్ళిపోతుంది.