ధాన్యలక్ష్మి కావ్య దగ్గరకి వస్తుంది. రాజ్ నిన్ను అందరి ముందు అంతగా వెనకేసుకురావడం అంటే మామూలు విషయమా అని సంతోషపడుతుంది. చూసిన నాకే అంత సంతోషంగా ఉంది, ఇక నువ్వు ఎంత సంబరపడుతున్నావో అని చూద్దామని వచ్చానని చెప్తుంది. కావ్య బాధగా మాట్లాడుతుంది.
ధాన్యలక్ష్మి; దీని కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశా. నీ అణుకువ ఈ ఇంట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ ఇన్నాళ్లకి రాజ్ నీ మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. రాజ్ లో మంచి మార్పు వచ్చింది
కావ్య: మార్పు అని మీరనుకుంటున్నారు ఓదార్పు అని ఆయన అనుకుంటున్నారని మనసులో అనుకుంటుంది. మీరు అనుకున్నంతగా ఆయనలో మార్పు రాలేదు. అంత త్వరగా వస్తుందని నేను అనుకోవడం లేదు
ఇంద్రాదేవి: నీ ఆలోచన తప్పు రాజ్ లో మార్పు మొదలైంది. మాట, ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూసుకుంటున్న విధానానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నువ్వు పడిన కష్టానికి ఫలితం రాబోతుంది. నువ్వు కోరుకున్న రోజు దగ్గర్లోనే ఉంది. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు
Also Read: ముకుంద కుట్రతో సన్మానం నుంచి వెళ్ళిపోయిన మురారీ - కృష్ణ దూరం కాక తప్పదా?
సాటి మనిషిగా సాయం చేశానని అన్నారు కదా ఆయన చుట్టు తిరుగుతూ సాటి మనిషికి భార్యకి ఉన్న తేడా చూపించాలని కావ్య డిసైడ్ అవుతుంది. రాజ్ తినడానికి వస్తాడు. తింటుంటే రాజ్ కి పొలమారుతుంది. ఎవరు తలుచుకున్నారని కళ్యాణ్ అంటాడు. ఎవరో సాటి మనిషి తలుచుకుని ఉంటారని కావ్య సెటైర్ వేస్తాడు.
కళ్యాణ్: మీరు సాటి మనిషి అనే మాట అనడం కరెక్ట్ గా లేదు వదిన
కావ్య: ఎవరో ఎవరినో అన్నారు
ఇద్దరూ కాసేపు సాటి మనిషి గురించి కాసేపు సోది పెడతారు. దీని మీద కవిత చెప్పొచ్చు కదా కావ్య అంటే కళ్యాణ్ కవిత్వం ఎత్తుకుంటాడు. అది వినలేక రాజ్, ప్రకాశం అల్లాడిపోతారు. ఈ కళావతి సాటి మనిషి అనే పదాన్ని ఇన్ని సార్లు ఎందుకు నొక్కిందని రాజ్ డౌట్ పడతాడు. స్వప్న డల్ గా కూర్చుని ఉంటే రాహుల్ వచ్చి సోరి చెప్తాడు.
రాహుల్: నీకు ముందే చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు ఇలాగే రియాక్ట్ అవుతారని నువ్వే వినలేదు
స్వప్న: నవ్వుతూ.. ఏడుస్తున్నాను అనుకున్నావా?
రాహుల్: అదేంటి నీకు కోపం రాలేదా? వాళ్ళు అన్ని మాటలు అంటే హర్ట్ అయ్యావు అనుకున్నా
స్వప్న: హర్ట్ అయ్యాను కానీ వాళ్ళకి నేను చేసిన పని తెలియదు కదా. నిజం తెలిశాక తిట్టిన నోటితోనే పొగుడుతారు
రాహుల్: అంటే నువ్వు మళ్ళీ యాడ్స్ చేయాలని అనుకున్నావా?
స్వప్న: అవును చిన్నప్పటి నుంచి మోడల్ అవాలని కలలు కన్నా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినను యాడ్ షూట్స్ చేసి తీరతాను. రేపు నా యాడ్ సోషల్ మీడియాలో వస్తే నన్ను అందరూ గ్రేట్ అంటారు చూస్తూ ఉండు
Also Read: కావ్యని పాతాళానికి తొక్కేసిన రాజ్ - స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తారా?
గ్రేట్ కాదు గెటవుట్ అంటారు నువ్వు చేయాల్సిన డ్యామేజ్ చేశావ్ ఇక ఇంట్లో నుంచి గెంటేయడమే మిగిలి ఉందని రాహుల్ సంబరపడతాడు. రాజ్ కావ్య సాటి మనిషి అని నొక్కి మాట్లాడినది గుర్తు చేసుకుని మమ్మీతో మాట్లాడింది వినేసిందా ఏంటని అనుమానపడతాడు. కావ్య గదిలోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేయలేకపోతుంటే సాయం చేస్తాను కదా అంత కష్టం ఎందుకని అంటాడు. ఏంటి సాటి మనిషిగానా అని కౌంటర్ వేస్తుంది. మాటకి ముందొక సారి సాటి మనిషి వెనుకొక సాటి మనిషి అని ఆడుకుంటుంది.
రాజ్: నేను మా మమ్మీతో మాట్లాడటం విన్నావ్ అంతే కదా
కావ్య: ఆ మాట మీ నోటి నుంచి వచ్చినప్పుడు నా గుండె ఎంత విలవిల్లాడిందో తెలుసా? అత్తగారికి అక్కర్లేని కోడలిగా, భర్తకి అవసరం లేని భార్యగా ఈ ఇంట్లో అతిథిలా ఉండటం ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలియదు
రాజ్ కి నిద్రలో ఎక్కిళ్ళు వస్తాయి. వెంటనే కావ్య లేచి వాటర్ అందిస్తుంది. సాటి మనిషిగా జాలి వేసి ఇస్తున్నావా అంటాడు.
కావ్య: భార్యని సాటి మనిషి అనుకున్నంత తేలికగా భర్తని సాటి మనిషి అనుకోలేను తాగండి. ముందు మీరు మనిషిని మనిషిగా చూడండి. రుద్రాణిని పట్టుకుని ఇది మీ పుట్టిల్లా అత్తిల్లా అని అడిగారు అవసరమా?
రాజ్: ఈ సాటి మనిషి ఏంటి అంత చీప్ గా చూస్తున్న మా అత్తని పాజిటివ్ గా చూస్తుంది అచ్చం మా అమ్మలాగే అని మనసులో అనుకుంటాడు.
స్వప్న యాడ్ రాహుల్ సోషల్ మీడియాలో చూసి తెగ మెచ్చుకుంటాడు.
రాహుల్: ఈ యాడ్ సోషల్ మీడియాలో వస్తే వైరల్ గా మారుతుందని అంటాడు. వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పాలి
స్వప్న: వద్దు ఈ వీడియో గురించి అందరి నోట విని ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ఇంట్లో ఒక సెలెబ్రెటీతో కలిసి ఉండటం గొప్ప అని వాళ్ళు అనుకోవడం వినాలి. నన్ను ఒక మహారాణిలాగా చూసుకుంటారు. ఇన్ని రోజులు మన దారికి కావ్య అడ్డు వస్తుంది. రాజ్ వచ్చి నన్ను బతిమలాడి మా కంపెనీకి నువ్వే అవాలి రోల్ మోడల్ అని అనాలి. అప్పుడు నేను మా రాహుల్ చెప్తేనే చేస్తానని చెప్తాను
రాహుల్: అప్పుడు నేను రెచ్చిపోయి అధికారం ఇస్తేనే ఒప్పుకుంటానని కండిషన్ పెడతాను
స్వప్న: అప్పుడు పేరు నాకు అధికారం నీకు