లాస్య దివ్య నిద్రమాత్రలు మింగిందని చెప్పి విక్రమ్ కి చెప్తుంది. అదంతా అబద్ధమని దివ్య అంటుంది. మీ నాన్న కూడా ఇలాగే నన్ను అపార్థం చేసుకుని విడాకులు ఇచ్చాడని లాస్య చెప్తుంది. తను సమయానికి వచ్చి నన్ను హెచ్చరించింది కాబట్టి సరిపోయింది లేదంటే ఏమై ఉండేదని విక్రమ్ అరుస్తాడు. బసవయ్య నోటికొచ్చినట్టు మాటలు అంటాడు. ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావ్, దయచేసి వాడి జోలికి వెళ్లకని రాజ్యలక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి మామీద కేసు పెడుతుంది అప్పుడు అందరం బయటకి వెళ్లిపోతామని బసవయ్య అనేసరికి అమ్మ లేని ఇంట్లో ఉండలేను అసలు ఈ ఇల్లే వద్దని విక్రమ్ అంటాడు. విక్రమ్ బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు ఏం చెప్పినా అర్థం చేసుకోడు మౌనంగా ఉండటమే మంచిదని దివ్య బాధగా వెళ్ళిపోతుంది. ఇద్దరి మధ్య మళ్ళీ చిచ్చు పెట్టినందుకు రాజ్యలక్ష్మి వాళ్ళు ఆనందపడతారు. నందు తులసి ఇచ్చిన తాళి చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
Also Read: అత్త మనసు గెలుచుకున్న కావ్య- స్వప్నని బయటకి పంపేందుకు ఐడియా ఇచ్చిన రుద్రాణి
తులసి వచ్చి నచ్చజెప్పడానికి చూస్తుంది కానీ నువ్వు ఎన్ని చెప్పినా కూడా వినను. నేనంటే నీ మనసులో ఏదో ఒక మూలన జాలి, కరుణ ఉంది. మన మధ్య బంధం లేకపోయినా అనుబంధం ఉంది. అందుకే నీ మనసు నాగురించి ఆలోచిస్తుందని నందు అంటాడు. అవును నా మనసు మీ గురించి ఆలోచించడం మానదు అందుకు కారణం మీరు నా పిల్లలకి తండ్రి. భార్యగా నాతో వేసిన ఏడడుగులు వెనక్కి తీసుకున్నా పిల్లల కోసం ఉంటాను. నా పిల్లల తండ్రి ఇబ్బందులో ఉంటే చూస్తూ ఉండలేను. అందుకే అవసరమైనప్పుడు చేతనైనంత సహాయం చేస్తున్నానని తులసి చెప్తుంది. దివ్య బాధపడుతుంటే విక్రమ్ వచ్చి మాట్లాడతాడు. నువ్వంటే నాకు ఇష్టం, నన్ను ఒక్కడినే వదిలేసి వెళ్లిపోతే సంతోషంగా బతుకుతానా? నువ్వు లేకపోతే నేను కూడా బతకను. నన్ను సాధించాలని అనుకుంటే నేను బతకడం ఇష్టం లేదనుకుంటే స్లీపింగ్ పిల్స్ వేసుకుని వచ్చి ఇస్తాను ఇద్దరం కలిసి తాగుదామని విక్రమ్ వెళ్లబోతుంటే దివ్య చెయ్యి పట్టుకుని ఆపుతుంది.
దివ్య: మనిషి మీద ప్రేమ ఉంటే సరిపోదు నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా కూడా ఉపయోగం లేదు. నాకు మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తాను
విక్రమ్: నీమీద నమ్మకం లేదని ఎవరు అన్నారు
దివ్య: నన్ను దొంగ అన్నావ్.. అబద్దం చెప్తే నమ్మేశావు. పాలలో స్లీపింగ్ పిల్స్ కలుపుకోలేదని చెప్పిన నమ్మడం లేదు. నిన్ను ఎలా ఒప్పించాలో అయోమయంగా ఉంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నా. అంతే తప్ప నిన్ను వదిలి వెళ్లలేను. ఇది కూడా అబద్ధంఅని ఎవరైనా చెప్తే నిజమని అనుకుంటావ్ ఏమో ఈద్ పచ్చి నిజం. నామీద నీకు నమ్మకం కలిగించలేకపోతున్నా
Also Read: యష్ పేరు టాటూ వేయించుకున్న మాళవిక- సవతి పోరుకి చెక్ పెట్టబోతున్న వేద
నందు, తులసి తాళిబొట్టు తాకట్టు పెట్టమని డబ్బు ఇవ్వమని నగల షాపుకి వెళతారు. 20 వేల కంటే ఎక్కువ రాదని సేటు చెప్తాడు. బయట నుంచి దొంగ ఒకడు వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. మంగళసూత్రం అమ్మేస్టె ఎంత వస్తుందని తులసి అడుగుతుంది. నందు మాత్రం అది అమ్మడం లేదని చెప్పి తీసుకుని బయటకి వచ్చేస్తారు. రోడ్డు మీద నడుస్తూ తులసి దాన్ని బ్యాగ్ లో పెట్టబోతుంటే దొంగ దాన్ని తీసుకుని పారిపోతాడు. వాడి వెనుక నందు పరిగెడతాడు. ఎలాగో వాడిని పట్టుకుంటే దొంగ నందుని తోసేసి పారిపోతాడు. నందు, దొంగ పెనుగులాట చూసి విక్రమ్ కారు దిగుతాడు. కిందపడటంతో నందుకి దెబ్బ తగులుతుంది. వద్దు వద్దు అంటే బలవంతంగా మంగళసూత్రం అమ్మించడానికి ట్రై చేశావు. కేఫ్ నడిపించలేకపోతే మూసుకుని కూర్చుని ఏదో ఒక గుమస్తా ఉద్యోగం చేసేవాడిని. కానీ ఇప్పుడు చూడు నీ జీవితాన్ని నీకు దూరం చేశానని నందు బాధపడతాడు. ఆ మాటలు విక్రమ్ వింటాడు. దివ్య డబ్బులు ఇచ్చిందని అపార్థం చేసుకున్నా, డబ్బులు ఉంటే వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారని అనుకుంటాడు.