Trinayani july 13th: పాము కాటేస్తే బిడ్డ కూడా చనిపోతుంది అని హాసిని అనటంతో అయినా కూడా తీస్తాను అని అంటుంది సుమన. నయని వద్దు అంటుంది. ఇంతకు పాము ఎవరిని కాటేస్తుంది అని సుమన మళ్లీ నయని అడగటంతో.. నిన్నే కాటు వేస్తుంది అని అంటుంది నయని. దాంతో సుమన వెంటనే గాయని పాపని ఎత్తుకొని పాము దగ్గరికి వెళ్లడంతో ఇంట్లో వాళ్ళు వద్దు అని అరుస్తారు.


దానితో సుమన గానవిని ఎత్తుకున్న కదా తనకేమీ కాదు కదా.. అని నాగయ్య దగ్గర ఉన్న మణి తీసుకోవడానికి ప్రయత్నించగా పాము బుస కొట్టడానికి ప్రయత్నిస్తుంది. దానితో సుమన భయపడుతుంది. అయినా కూడా మణి తీసుకునే ప్రయత్నం చేసి మొత్తానికి తీసుకుంటుంది. వెంటనే నాగయ్య సుమన కడుపు మీద కాటు వేసి అక్కడి నుంచి వెళ్తాడు. సుమన స్పృహ కోల్పోతుంది. 


ఇక సుమనను హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా అక్కడే పడుకోబెడతారు. తిలోత్తమా ఆ సమయంలో సుమన చేతిలో ఉన్న మణి తీసుకోగా అది విశాల్ చూసి కోపంగా కనిపిస్తాడు. ఇక గురువు రావటంతో అందరూ సుమన ను కాపాడమని అడుగుతారు. సుమనకు పాము ఎక్కడ కరిచింది అని అడగటంతో కడుపు మీద కాటేసింది అని అనగా వెంటనే గురువు పాము కాటేయలేదు.. కడుపులో ఉన్న పామును ముద్దాడింది అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు.


సుమన కు స్పృహ రావాలి అంటే మణి తీసుకోని గాయత్రి ఎడమ కాళ్లు లో పెట్టి ఆ పాదాన్ని సుమన కడుపు మీద రాయమని అంటాడు. తిలోత్తమా ఆ మణి ఇవ్వటానికి ఒప్పుకోదు. వెంటనే హాసిని లాక్కొని వచ్చి నయనికి ఇవ్వటంతో నయని గురువు చెప్పినట్టు చేస్తుంది. ఇక గాయత్రి పాపతో సుమన కడుపు మీద రాసిన తర్వాత సుమన కడుపు మీద మళ్లీ పాము కనిపించడంతో అందరూ భయపడతారు.


సుమన స్పృహలోకి వచ్చాక తనకు ఏమీ కాలేదు సంతోషపడుతుంది. ఇక గాయత్రి పాప వల్ల తనకు స్పృహ వచ్చిందని తెలియడంతో.. దత్తత తీసుకున్న పాప తన కడుపుని తన్నిందా అని కోపడుతుంది. ఆ తర్వాత మణి గురించి అడుగుతుంది. ఇక నయని తన దగ్గరే ఉందని కానీ ఇవ్వను అని గట్టిగా చెప్పేస్తుంది. ఇక తిలోత్తమా కూడా నయని దగ్గరే ఉంచమని అంటుంది.


ఆ మణి తో మచ్చ గురించి తెలుసుకోవాలి అని అనటంతో అది కరిగిపోతుంది కదా అని సుమన అంటుంది. ఇక దానికంటే ఎక్కువ విలువైనది నీకు ఇస్తాను అనటంతో.. ఇక సుమన ఇప్పుడు తల ఊపుతాను కానీ తర్వాత ఏం చేస్తానో చూడండి అని అనుకుంటుంది. ఇక గురువు చీకటి పడ్డాక వెన్నెల వచ్చాక ఆ మచ్చ గురించి చూడమని చెబుతాడు.


Also Read: Krishnamma kalipindi iddarini July 12th: ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు.. గౌరీని కిడ్నాప్ చేయించనున్న సౌదామని?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial