Krishnamma kalipindi iddarini July 12th: ఈశ్వర్ గౌరీ తో తనలో ఉన్న ప్రేమను బయట పెడుతుండటంతో అక్కడే ఉన్న అఖిల వారు అలా మాట్లాడుకోవడం చూసి బాగా కుళ్ళుకుంటుంది. వీరిద్దరిని దూరం చేయాలి అని అనుకుంటుంది. ఈశ్వర్ గౌరీ తో మాట్లాడి రేపు కలుసుకుందామని చెప్పి వెళ్తుండగా వెంటనే అఖిల తన చెప్పును ఈశ్వర్ వెళ్లేదారిలో వేయటంతో ఈశ్వర్ ఆ చెప్పు తొక్కి కింద పడిపోతుంటాడు. వెంటనే గౌరీ పట్టుకోవడంతో వారిద్దరి మధ్య రొమాంటిక్గా అనిపిస్తుంది.
దాంతో అఖిల తన ప్లాన్ సక్సెస్ కాలేదు అని కోపం తెరలిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి పెళ్లికి ముందే రొమాన్స్ చేస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో గౌరీఅలా కాదు ఈశ్వర్ గారు పడిపోతుంటే పట్టుకున్నాను అని అంటుంది. ఇక ఈశ్వర్ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక గౌరీ ఈశ్వర్ ను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అఖిల కు మాత్రం బాగా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్తుంది.
మరోవైపు ఆదిత్య అమృత మాట్లాడిన మాటలు తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏదైనా సరే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సునంద అక్కడికి వచ్చి నా కోసం ప్రేమని త్యాగం చేసావా అనుకొని లో లోపల కుమిలిపోతూ ఇంకా పడుకోలేదా అని ఆదిత్యను అడుగుతుంది. ఇప్పుడే ఈశ్వర్ అక్కడి నుంచి వెళ్తుండగా ఈ సమయంలో ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు ఆదిత్య.
గౌరీ గారితో మాట్లాడిసి వస్తున్నాను అనడంతో సునంద గౌరీ తో మాట్లాడేసి వస్తున్నావా అని అంటుంది. ఇక ఇంకా పడుకోలేదా అని ఈశ్వర్ అడగటంతో పెళ్లి పనులు ఉన్నాయి అని అంటుంది. ఇక ఆదిత్య కూడా.. ప్రేమించిన అమ్మాయి అఖిలను పెళ్లి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు.. నాకోసం నువ్వు ఆదిత్యతో మాట్లాడకుండా మూడేళ్లు ఉన్నావు.. కానీ ఇప్పుడు ఆదిత్య నువ్వు మాట్లాడేసరికి చాలా సంతోషంగా ఉన్నాడు అని.. ఇప్పుడు ఆదిత్య సంతోషంగా ఎలా ఉన్నాడో నేను చూడలేను కాబట్టి నువ్వు వివరించు అమ్మ అని అడుగుతాడు ఈశ్వర్.
దానితో సునంద తన మనసులో వాడు బాధపడుతున్నాడని ఎలా చెప్పను అని.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ నేను కూడా అలసిపోయాను అంటూ ఈశ్వర్ ను పడుకోమని ఆదిత్యను తీసుకెళ్ళమని చెబుతుంది. ఇక సునంద బాధపడుతూ ఉండగా అప్పుడే తన భర్త వచ్చి ఏం జరిగింది అని అడగటంతో.. నా మాట కోసంనా చిన్న కొడుకు తన ప్రేమను త్యాగం చేశాడు అని చెప్పి ఏడుస్తుంది.
దాంతో ఆయన షాక్ అవ్వగా జరిగిన విషయం మొత్తం చెబుతుంది. ఒక కొడుకు సంతోషం కోసం ఇంకో కొడుకుని బాధ పెడుతున్నావా అని ఆయన అనడంతో.. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటుంది. కానీ ఈ పెళ్లిళ్లు ఎలాగైనా జరగాలి అని అంటుంది. ఇక మరుసటి రోజు మంగళ స్నానాలు చేయిస్తారు. అందరూ ఈ వేడుకలో సంతోషంగా కనిపిస్తారు.
కానీ సౌదామిని వాళ్లు కోపంతో కనిపిస్తారు. వెంటనే సౌదామిని కూతురు తన గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. పెళ్లి చూసుకుంటే ఈ ఇంట్లో ఉండనని అనటంతో సౌదామిని.. నా తల్లి గారి ఇంట్లో నా కూతుర్ని కోడలుగా పంపించాలని అనుకున్నాను. ఈ ఆస్తి మొత్తం తనకే దక్కాలని అనుకున్నాను అటువంటిది కానీవ్వకుండా ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంటుంది.
దాంతో ఏం చేయబోతున్నావు అని అడగటంతో.. ఇంత చేస్తుంది పెళ్లి ఆపడానికే అని.. కాసేపట్లో గౌరి కిడ్నాప్ అవుతుంది అని అంటుంది. మరోవైపు గౌరీ పెళ్లికూతురుగా రెడీ అయి ఉంటుంది. అదే సమయంలో సునంద ఇంటి ముందుకు సౌదామిని పంపించిన వ్యక్తి వస్తాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial