Trinayani july 12th: తిలోత్తమా మచ్చ గురించి అడగటంతో.. ఇంట్లో ఉన్న అర్థ చంద్రకారపు మణిని తీసుకువచ్చి ఆ మణి ని వెన్నెల్లో పెట్టినప్పుడు ఆ మణి కరిగి నీరు గా మారుతుంది ఆ నీటిలో ఇంతకు ముందుకు ఆ మచ్చ ఎవరికి ఉందో కనిపిస్తుంది అనడంతో అందరూ షాకుల మీద షాకులు తింటారు. ఆ నీరు కింద పడిపోతే కుండలో బోనం చేసి మరుసటి రోజు సూర్యోదయం వరకు తలపై పెట్టుకుని ఉండాలి అని చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు.


ఆ తర్వాత విశాలాక్షి అక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరుతుంది. ఇక ఇంత రిస్క్ తీసుకున్నది ఎవరు అనటంతో.. సుమన మాత్రం మణి మాత్రం కావాలి అని గట్టిగా అంటుంది. ఇక నయని మణి కోసం చెల్లి పాము కాటుకు గురి అవ్వనుందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తిలోత్తమా మాత్రం ఏదేమైనా ఆ మచ్చ గురించి తెలుసుకోవాలి అనడంతో అందరూ మరోసారి షాక్ అవుతారు.


ఆ తర్వాత సుమన పూజ చేసి హారతి తీసుకొని వచ్చి గాయత్రిని ఎత్తుకున్న పావని మూర్తి దగ్గరికి వెళ్లి హారతి తీసుకోమని అంటుండగా.. ఆ సమయంలో గాయత్రి చేయి తగిలి హారతి పళ్లెం కింద పడుతుంది. దానితో సుమన గాయత్రి పై అరవడంతో విశాల్, నయని సుమనపై కోప్పడతారు. ఇక ఏదైనా అదృష్టం జరుగుతుందేమో అని తిలోత్తమా అనడంతో.. వెంటనే నయని సుమనకు పాము కాటేస్తుందేమో అని భయపడుతుంది.


ఇక ఈ టైంలో పూజ ఎందుకు చేసావు అని ఇంట్లో వాళ్ళు అడగటంతో.. అర్థ చంద్రకారపు మణి దక్కాలి అని పూజ చేశాను అని అంటుంది. దాంతో ఆ మణి గురించి ఆరాట పడవద్దు అని అందరూ అంటారు. తిలోత్తమా మాత్రం ఆ మణి సుమన కు ఇస్తే ఏమవుతుంది అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇంట్లో వాళ్ళు మాత్రం వద్దు అని అంటారు. అంతేకాకుండా మచ్చ గురించి టాపిక్ వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం గురువు చెప్పినట్లు వినాలి అని .. ఒక్కొక్కరి తమ భయాల గురించి చెప్పటంతో ఏమైనా చచ్చిపోతారా అని అనిత అంత వెంటనే సుమన అని అంటుంది నయని.


ఏంటి నేను చచ్చిపోతానా అని సుమన వెటకారం చేసి కడుపుతో ఉన్న దాన్ని చస్తుందా అని ఎలా అంటుంది అని కోప్పడుతుంది. దాంతో నయని మణి కావాలి అంటే చచ్చిపోతావు అని అందుకే నిన్ను కాపాడుతున్నాను అనడంతో.. నేను పోయినా పర్వాలేదు ఆ మణి కావాలి అని అంటుంది సుమన. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక విక్రాంత్ సుమనపై కోప్పడతాడు.


కానీ సుమన మొండికేయటంతో విశాల్, విక్రాంత్ నయని ని ఆ మణి ఇచ్చేమని అంటారు. దాంతో తిలోత్తమా మణి ఎక్కడ ఉంది అని అడగటంతో నాగయ్య నెత్తి మీద పెట్టాను అనడంతో ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. కాకమ్మ కథలు చెబుతుంది అని సుమన, తిలోత్తమా అంటుంటారు. ఇక ఆ పాము కోసం జోగయ్య శాస్త్రి దగ్గరికి వెళ్లాలా అనటంతో.. అవసరం లేదు నాగయ్య ఇంట్లో ఉన్నాడు అనటంతో అందరూ షాక్ అవుతారు.


ఇక సుమన, తిలోత్తమా, వల్లభ నాగయ్య ఉన్నాడని వెటకారం చేయటంతో వెంటనే విశాల్ నాగయ్యను పిలవమని అంటాడు. నయని వెంటనే నాగయ్య అని పిలుస్తుంది. దాంతో పాము మణి తలపై పెట్టుకుని రావటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు. సుమన నయనితో మణి తీసి ఇవ్వమని అంటుంది. దాంతో తనకు అర్హత లేదని ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళే తీయాలి అనటంతో వెంటనే విక్రాంత్ సుమన అప్పుడే పుట్టింది కదా అని అంటాడు.


ఇక ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా సుమన తిలోత్తమా మాత్రం సుమనకు సపోర్టుగా మాట్లాడుతుంది. పాము కాటేస్తే బిడ్డ కూడా చనిపోతుంది అని హాసిని అనటంతో అయినా కూడా తీస్తాను అని అంటుంది సుమన. నయని వద్దు అంటుంది. ఇంతకు పాము ఎవరిని కాటేస్తుంది అని సుమన మళ్లీ నయని అడగటంతో.. నిన్నే కాటు వేస్తుంది అని అంటుంది నయని.


Also Read: Prema Entha Madhuram July 12th: కొడుకుతో కేక్ కట్ చేయించిన ఆర్య.. వర్ధన్ ఫ్యామిలీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మాన్సీ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial