వసంత్ ని అమెరికా వెళ్ళకుండా చేసినందుకు అటు వేద మీద నోటికొచ్చినట్టు అరుస్తాడు. వేద చెప్పడం వల్ల ఏమి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని వసంత్, చిత్రని తిడతాడు. తన మనసు ఎవరూ మార్చలేదని వదిన మాట్లాడిన తర్వాత డ్రాప్ అవడం మంచిదని అనిపించిందని వసంత్ చెప్తాడు. కానీ యష్ మాత్రం ఒప్పుకోడు. ఇలాగే మీకు నచ్చినట్టు చేసుకుంటే మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవనని చెప్పేసి బాధగా వెళ్ళిపోతాడు. యష్, వేద తమ మధ్య జరిగిన గొడవ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. పెళ్ళాన్ని కూల్ చేయడం కోసం ఫోన్ చేస్తాడు. ఇంట్లో అన్నేసి మాటలు అని ఇప్పుడు ఫోన్ చేస్తారా ఏం మాట్లాడనని వేద బెట్టుగా ఉంటుంది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయదని అనుకుని యష్ మళ్ళీ చేస్తాడు. కానీ వేద మాత్రం ఎన్ని సార్లు చేసినా కూడా తీయనంటే తీయనని అంటుంది.


Also Read: ఇకనైనా మారమంటూ లవ్ లైట్స్ తేంపేసిన మురారీ- ముకుంద లవ్ ఫోటోస్ భవానీ చూస్తుందా?


వేద ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి రిసెప్షన్ కి ఫోన్ చేస్తాడు. మేడమ్ ఖాళీగానే ఉన్నారని నర్స్ చెప్తుంది. సరేనని కనెక్ట్ చేయడం కోసం వేదని అడిగితే వద్దని చెప్తుంది. నేను ఏదో ఆవేశంలో అంటే బాగా మనసులో పెట్టేసుకుందే. ఏదో ఒకటి చేయాలి పెళ్ళాం ఫైర్ లో ఉంటే తట్టుకోవడం కష్టమని అనుకుంటాడు. నీలాంబరి ఇచ్చిన షాక్ కి అభిమన్యు దిమ్మతిరిగిపోతుంది. భర్త ఒంటి మీద చెయ్యి వేయకుండా ఎ భార్య నెల తప్పుతుందా? తను నన్ను ఫూల్ ని చేస్తుందని అభి భ్రమరాంబికకి చెప్పుకుని వాపోతాడు. తను ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదని ఖైలాష్ కూడా చెప్తాడు. అసలు తను నిజంగానే కడుపుతో ఉందా? లేదంటే ఆట పట్టిస్తుందా అని తమ్ముడి మీద డౌట్ పడుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా నీలాంబరి వస్తుంది.


పెళ్ళాం కడుపుతో ఉంటే మీ తమ్ముడు పట్టించుకోవడం లేదని అంటుంది. తనకి ఏం కావాలో లిస్ట్ రాశానని చెప్పి పె.. ద్ద చీటీ ఇస్తుంది. అది చదవమని ఖైలాష్ కి ఇస్తుంది. గారాలు పోతూ భ్రమరాంబిక దగ్గర మాట్లాడుతుంది. వేద కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా మాళవిక వచ్చి కావాలని కబోర్డ్ లో ఏదో తీస్తున్నట్టు కలరింగ్ ఇస్తూ చెయ్యి పైకి పెడుతుంది. తన చేతి మీద ఉన్న y అనే పేరు పచ్చబొట్టుని వేద చూస్తుంది. మాళవిక ఏంటి అది చేతి మీద టాటూ వేయించుకున్నావని వేద అడుగుతుంది. ఏం లేదు ఇది అందరికీ చూపించేది కాదని అంటుంది. Y అంటే ఏంటి అర్థమని వేద అడుగుతుంది. నువ్వు అనుకుంటున్నది y ఫర్ యష్.. షాక్ అయ్యావా? ఇలాంటివి రాసుకుంటేనే కదా నేను ఇంకా తన జీవితంలో ఉండాలని అనుకుంటున్నట్టు అర్థం అయ్యేదని మాళవిక అంటుంది.


Also Read: కావ్య, కళ్యాణ్ ని స్టేషన్ నుంచి విడిపించిన రాజ్- హనీమూన్ కావాలంటూ రచ్చ చేసిన స్వప్న


వేద కోపంగా తనని హాల్లోకి తీసుకెళ్ళి మాలిని వాళ్ళని పిలిచి టాటూ వేయించుకుంది. మీ అబ్బాయి పేరు. మొన్న పెళ్లి ఫోటో గోడ మీదకి వచ్చింది. ఇప్పుడు మీ అబ్బాయి పేరు ఒంటి మీదకి వచ్చిందని చెప్తుంది. ఏ ఉద్దేశంతో తన కొడుకు పేరు టాటూ వేయించుకున్నావని మాలిని నిలదీస్తుంది. ఫోటో పెడితే తీయకుండా వదిలేశామని టాటూ వేయించుకున్న ఏమి అనమని వేయించుకుందని వేద తిడుతుంది. ఆదిత్య బాధ పడతాడని ఇంట్లో ఉండనిచ్చామని అసలు ఉద్దేశం ఏంటని రత్నం అడుగుతాడు. అసలు అది యష్ పేరు కాదని మాళవిక అంటుంది. అవునా అయితే మరి y అంటే ఏంటని యష్ నిలదీస్తాడు. అసలు అది y కాదని k అని చెప్తుంది. K అంటే ఖుషి.. నా కూతురు అంటే నాకు ప్రాణం అందుకే తన పేరు టాటూగా వేయించుకున్నా. టాటూ వేసే వాడు స్టైల్ గా y అని రాశాడని చెప్తుంది. ఖుషి పుట్టకముందే వేయించుకోమంటే వేయించుకోలేదు ఇప్పుడు సడెన్ గా ప్రేమ పుట్టుకొచ్చిందా అని తిడతాడు. తనని టార్చర్ పెట్టి సంతోషపడుతున్నారని ఏడుస్తూ వెళ్తుంది.


ఈ ఇంట్లో తనకి విలువ లేదని తనని పురుగుని చూసినట్టు చూస్తున్నారని కొడుకు ఆదిత్య ముందు డ్రామా మొదలుపెడుతుంది. నామీద ప్రేమతో ఏమైనా ఇక్కడ ఉండనిచ్చారా? నీమీద ప్రేమతో నీకోసం నన్ను ఇక్కడ ఉండనిచ్చారని ఏడుస్తూ చెప్తుంది. తల్లిని అలా చూసి ఏమైందని అడుగుతాడు. టాటూ వేయించుకున్నానని అందరూ తనని తిట్టారని చెప్తుంది. మెల్లగా మాలిని ఆంటీతో పాటు అందరూ ఇష్టపడుతుంటే వేద మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడి అందరి మనసు మారుస్తుందని అబద్ధాలు చెప్తుంది. నీ నాటకాలకి ముగింపు పలికిస్తానని వేద అనుకుంటుంది.