Janaki Kalaganaledhu August 14th: నిశ్చితార్థం వేడుకలో రామ జానకితో సరసాలు ఆడుతూ ఉంటాడు. కిషోర్ కంగారు పడుతూ ఉండటంతో వెంటనే రామ కిషోర్ ని దేనికి కంగారు పడుతున్నారు అని అడుగుతాడు. దాంతో కిషోర్ షాక్ అవుతాడు. వెన్నెల గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని.. తను చాలా మంచి అమ్మాయి అని జానకి అంటుంది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వెన్నెల గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక అప్పుడే విష్ణు తన చెల్లి మాట వినకపోతే తను ఉగ్రవాది అవుతుంది అనడంతో ఆ మాట కిషోర్ తన చేతిలో ఉన్న వస్తువు కింద పడేస్తాడు.


దాంతో జానకి ఉగ్రవాది అనగానే మా తమ్ముడు భయపడినట్టున్నాడు.. అలా ఏమీ కాదు అని మా వెన్నెల చాలా మంచిది అని చెబుతుంది. ఇక పంతులు మరో వారంలో పెళ్లి ముహూర్తం ఉందని చెప్పటంతో.. వెంటనే కిషోర్ తల్లిదండ్రులు తొందరగా ముహూర్తం పెట్టినందుకు ఏమీ అనుకోకండి అని అంటారు. దాంతో రామ అటువంటిదేమీ లేదు అని వెన్నెలకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నాము త్వర త్వరగా పనులు చేసుకుంటాము అని చెబుతాడు.


ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లాక వెన్నెల జానకితో తనకు కొత్త జీవితం ఇచ్చినందుకు థాంక్స్ అని చెబుతుంది. ఇక ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళాలి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని జానకి అక్కడి నుండి వెళ్తుంది. చీకటి పడ్డ తర్వాత గోవిందరాజు దంపతులు వెన్నెల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్ళికొడుకు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కట్నం కూడా అడగలేదు అని జ్ఞానంబ అంటుంది. కానీ పెళ్లి మాత్రం ఘనంగా చేయమని అన్నారు అని గోవిందరాజులు అంటాడు.


ఇప్పుడు అంత డబ్బు లేదు కదా.. మనకు ఒక్కతే కూతురు పైగా ఆఖరి పెళ్లి.. తన పెళ్లి ఘనంగా చేద్దాం అంటే చేతిలో డబ్బులు లేవు అని బాధపడుతుంది. ఇక గోవిందరాజులు బాధపడుతూ అప్పులు చేయాలన్నా కూడా ఓపిక లేదు అని.. అవి తీర్చాలంటే అప్పటివరకు నా ప్రాణం ఉంటుందో పోతుందో.. ఒకవేళ అప్పులు చేసిన కూడా అప్పుల బాధలు కొడుకుల మీద వేయొద్దు అని అంటాడు. అలా అని పెళ్లి ఘనంగా చేయకుంటే ఎలా అని జ్ఞానంబ అనడంతో.. దాంతో గోవిందరాజులు తనకు ఇష్టం లేకున్నా ఒక పనిచేయాలి అనుకుంటున్నాను అని.. అదే ఈ ఇల్లు అమ్మటం అనటంతో జ్ఞానంబ షాక్ అవుతుంది.


పెళ్లి గురించి ఇల్లు అమ్మటం ఎందుకు.. అయినా ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్లు బాధ్యత తీసుకుంటారు అని అంటుంది. దాంతో గోవిందరాజులు కొడుకులు ఒప్పుకోరు అని.. అది మీ బాధ్యత అని అంటారు అని అంటాడు. మరి ఇల్లు అమ్ముతున్న విషయం కొడుకులకు కూడా చెప్పాలి కదా అని జ్ఞానంబ అనటంతో ఇప్పుడే ఆ విషయం చెబుతాను అని అంటాడు. అయితే వాళ్లు కూడా ఇల్లు అమ్మవద్దని చెప్పి వెన్నెల పెళ్లి తమ బాధ్యత అని అంటారు చూడు అని అంటుంది జ్ఞానంబ.


దాంతో గోవిందరాజులు కూడా సరే అన్నట్లుగా ఉంటాడు. ఇక గదిలో జానకి తన ఆఫీసు పనిలో బిజీగా ఉండటంతో రామ తనతో సరదాగా సరసాలు ఆడుతూ ఉంటాడు. తనతో సమయం కేటాయించమని సరదాగా అడుగుతుంటాడు. ఆ తర్వాత గోవిందరాజులు కొడుకులతో వెన్నెల పెళ్లి గురించి మాట్లాడడానికి అందర్నీ పిలుస్తాడు. ఇక మల్లిక నిద్రపోతున్న సమయంలో ఇప్పుడు మాట్లాడటం ఏంటి మామయ్య.. రేపు మాట్లాడదాం అనటంతో గోవిందరాజులు వెటకారం చేస్తూ ఉంటాడు. 


బట్టల గురించి చింత చెందకండి మన షాపులో 20% డిస్కౌంట్ ఇస్తాను అని అంటుంది. దాంతో జ్ఞానంబ ఆ విషయం గురించి కాదు పెళ్లి ఏర్పాట్ల గురించి అంటుంది. అదేందత్తయ్య వెన్నెల పెళ్లి చేయాల్సిన బాధ్యత మీదే కదా.. మమ్మల్ని అడుగుతున్నావేంటి అని అంటుంది. దానికి రామ కూడా అవును అమ్మ మల్లిక చెప్పింది కరెక్టే అనటంతో గోవిందరాజులు దంపతులు కాస్త బాధ పడినట్లు కనిపిస్తారు. కానీ రామ మాత్రం అవునని వెన్నెల పెళ్లి చేయాల్సిన బాధ్యత మాది అని అంటాడు. దానికి తల్లిదండ్రులు సంతోషిస్తారు. 


కానీచిన్న కొడుకు మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక రామ తన అన్నయ్యని అడగటంతో మల్లిక మా ఇద్దరిది ఒకటే అని చెబుతుంది. దాంతో గోవిందరాజులు అలా అనకు అంటూ తనను గట్టిగా హెచ్చరిస్తాడు. జ్ఞానంబ కూడా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది. మీ నాన్న కష్టపడి మిమ్మల్ని పోషించాడు.. ఇప్పుడు ఒక పెళ్లి చేయటానికి ఇంతలా చేస్తున్నారు అని బాధపడుతుంది. ఇక మల్లిక ఘనంగా చేసే అంత అది లేనప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేయొచ్చు కదా అంటూ వెటకారం చేసి మాట్లాడుతుంది. దాంతో జ్ఞానంబ మధ్యతరగతి గురించి.. వాళ్లు పడే బాధలు గురించి చెప్పటంతో అందరూ సైలెంట్ అవుతారు. ఇక వెన్నెల కూడా కాస్త బాధపడుతున్నట్లు కనిపిస్తుంది.


 


also read it: Prema Entha Madhuram August 12th: అను బాబు కోసం దిగిన మరో అపరిచితుడు.. మారువేషంలో రంగంలోకి దిగిన జిండే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial