ఫ్రెండ్షిప్ డే ఎప్పుడో తెలుసు కదా.... ఆగస్టు నెలలో వచ్చే తొలి ఆదివారం. ఈ ఏడాది ఆగస్టు 4న ఫ్రెండ్షిప్ డే. 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ షో 'ఫ్యామిలీ స్టార్స్' (Family Stars Show) టెలికాస్ట్ అయ్యేది ఆ రోజే. అందుకని, ఆ రోజు ఎపిసోడ్ ఫ్రెండ్షిప్ బేస్డ్ చేశారు. యాంకర్లు స్రవంతి చొక్కారపు (Sravanthi Chokarapu), భాను శ్రీ (Bhanu Sri) ఆ షోలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. 


ఒసేయ్ బర్రె గొంతు భాను... 
స్రవంతి అంత మాట అనేసింది ఏంటి?  
ఆగస్టు 4న ప్రసారం కానున్న 'ఫ్యామిలీ స్టార్స్'లో తొలుత ఇద్దరి మధ్య స్నేహం చూపించి... ఆ తర్వాత గొడవ పడినట్లు చూపించారు. భాను శ్రీ, స్రవంతి మధ్య స్నేహం చూపించినప్పుడు బావుంది. కానీ, గొడవ పడే సమయంలో 'ఒసేయ్ బర్రె గొంతు భాను' అని స్రవంతి చొక్కారపు అనడంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు. 



స్రవంతి మాటకు భాను శ్రీ షాక్ అయ్యింది. ఎందుకంటే... 'ఈ డైలాగ్ స్క్రిప్ట్ లో లేదు కదా సార్' అని అవాక్కయ్యింది. ఆమె మాటలు బట్టి ఆ గొడవలు సైతం స్క్రిప్ట్ అని తెలిసింది. భాను శ్రీ గొంతు గురించి స్రవంతి చేసిన కామెంట్ అంత కంటే ఎక్కువ హైలైట్ అయ్యింది. భాను శ్రీది మగ గొంతులా ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారు. కానీ, ఆమెను బర్రె గొంతు అని ఇప్పటి వరకు ఎవరూ అనలేదు ఏమో!? ఏది ఏమైనా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం చేసేది కనుక స్రవంతి మాటల్ని భాను శ్రీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు.


Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!



సుధీర్ పరువు తీసి పారేసిన విష్ణు ప్రియ!
Vishnu Priya Bhimeneni comments on Sudigali Sudheer height: ఇక, సుడిగాలి సుధీర్ హైట్ గురించి చెబుతూ విష్ణు ప్రియా భీమనేని చేసిన పని అతడి పరువు తీసే విధంగా ఉందని చెప్పాలి. వాళ్లిద్దరూ 'పోరా పోవే' చేశారు. 'జబర్దస్త్'లో కొన్ని స్కిట్స్ చేశారు. మంచి అనుబంధం ఉంది. అందువల్లో, లేదంటే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసమో... 


సుధీర్ పక్కన నిలబడినప్పుడు 'వెయిట్! హైట్ ప్రాబ్లమ్! నేను ఫుట్ వేర్ (చెప్పులు) తీసేసి వస్తా' అని వెళ్ళింది విష్ణు ప్రియ. ఆ వెంటనే 'అందరి ముందు పరువు పోయిందిగా' అని సునీల్ వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో వేశారు. ఆ తర్వాత విష్ణు ముక్కు మీద సుధీర్ పంచ్ వేశాడు. 'నోస్ ప్రాబ్లమ్! సుత్తి ఉందా?' అని అడిగాడు. నిజానికి, ఈ ఎపిసోడ్ లో మానస్, విష్ణు ప్రియా భీమనేని స్నేహితులుగా వచ్చారు. మరికొందరు స్నేహితులు సైతం షోలో సందడి చేశారు.


Also Readవర్షతో శోభనం... రాఘవతో భాస్కర్ గొడవ... రామ్ ప్రసాద్ గాలి తీసిన రోహిణి... 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూశారా?