Family Stars Latest Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్స్’ షో మరో ఫన్నీ ఎపిసోడ్‌తో సిద్ధమయ్యింది. తాజాగా ఈ అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఈవారం ‘ఫ్యామిలీ స్టార్స్’.. 90స్ థీమ్‌తో అలరించడానికి సిద్ధమయ్యింది. అంటే 90ల్లో నుండి ఇప్పటివరకు సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటీనటులు ఈవారం ఈ షోకు వచ్చి సందడి చేయనున్నారు. ‘కొంతమందిని నా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. కొంతమందిని నా టీనేజ్ నుండి చూడడం మొదలుపెట్టాను. కొంతమందిని ఇప్పటికీ చూస్తూనే ఉన్నా’ అంటూ వారందరికీ ఇంట్రో ఇచ్చాడు సుధీర్.
సుధీర్‌పై కౌంటర్లు..
సీరియల్ యాక్టర్ రాగిని ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సుధీర్‌పై జోకులు వేస్తూ అందరినీ నవ్వించారు. ‘ఇక్కడ ఫ్యాన్ లేదు చాలా వేడిగా ఉంది అన్నారు’. వెంటనే సుధీర్ పక్కకు రాగానే ‘గాడిగాడివి పక్కకు వచ్చావు కదా. ఇప్పుడు చల్లగానే ఉంది’ అని కౌంటర్ ఇచ్చారు. ‘నాకెప్పుడూ అనిపిస్తూ ఉండేది. నాకొక కూతురు ఉంటే సుధీర్‌లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని’ అని తన మనసులో మాటను బయటపెట్టారు రాగిని. ‘అబ్బాయి అయినా పర్వాలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చాడు సుమిత్. సెల్వరాజ్ ఫిజిక్ చూసి ‘ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలి’ అని అడుగుతాడు సుధీర్. ‘నేను కూడా చెమట చిందిస్తాను’ అని సుధీర్ సమాధానమివ్వగా.. ‘నువ్వు చేసే చెమట చిందించడం కాదు’ అని సెల్వారాజ్ కౌంటర్ ఇస్తాడు.
తీర్చుకోలేని రుణం..
టాస్కుల్లో కూడా సీరియల్ ఆర్టిస్టులు పోటాపోటీగా ముందుకెళ్లారు. సెల్వారాజ్, సుమిత్ కలిసి ‘అర్జున్ రెడ్డి’ స్పూఫ్ చేసి అందరినీ నవ్వించారు. రాగిని, హరిత కలిసి నవరాసాలు పండించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నవారంతా ఈటీవీతో తమ అనుబంధం గురించి మాట్లాడారు. ముందుగా హరిత.. ‘కొన్ని రుణాలను తీర్చుకోలేము. జీవితాంతం సేవిస్తూనే ఉండాలి. అలాంటిదే నాకు ఈటీవీ. మా బాబు పుట్టినరోజు, ఈటీవీ పుట్టినరోజు ఒకటే. ఆగస్ట్ 27. రామోజీ రావు ఒక ఛానెల్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి పని ఇచ్చి ప్రతీ ఒక్కరు ఆత్మాభిమానంతో బ్రతకగలిగే ఒక జీవితాన్ని ఇచ్చారు. కళమ్మ తల్లి ఉన్నంతవరకు రామోజీ రావు చిరస్మరణీయులు’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు హరిత.
పడిపోతుంటే పట్టుకుంది..
‘తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటే కేవలం ఈటీవీ వల్లే’ అని మరొక ఆర్టిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నందకిషోర్ సైతం ఈటీవీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘నేను ముత్యమంత పసుపు అనే సీరియల్ చేశాను. అందులో బాలసుబ్రహ్మణ్యంతో యాక్ట్ చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. ‘అప్పట్లో ఈటీవీ సీరియల్స్ ఒక బాటవేశాయి’ అని లిరిష అన్నారు. ‘ఈటీవీ నాకొక తల్లిలాంటిది ఎందుకంటే నాకొక తమ్ముడిని ఇచ్చింది’ అని సుమిత్ తెలిపాడు. ‘నేనెప్పుడు పడిపోతున్నా.. నేను ఉన్నాను పట్టుకోవడానికి అంటూ నన్ను ఈటీవీ పట్టుకుంది’ అని సుడిగాలి సుధీర్ సైతం ఈటీవీపై తన ప్రేమను బయటపెట్టాడు. చివరిగా అందరూ కలిసి రామోజీ రావును గుర్తుచేసుకున్నారు.
Also Read: భారతీయుడు గెటప్‌లో కార్తీక్... సైలెంట్ స్కిట్‌తో నవ్వించిన రాఘవ... ‘జబర్దస్త్’ ప్రోమో