Satyabhama Today Episode రేణుక తండ్రి మంచి చేయకపోయినా కొంప ముంచుతాడని మహదేవయ్య రుద్రతో చెప్తాడు. మీ మామ మేకు లాంటోడని రెచ్చగొడితే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే తెలివి ఉందని, నువ్వు రేణుకని సతాయిస్తున్నావని తెలిస్తే మన చెవులు పట్టుకొని ఆడిస్తాడని బుద్ధిగా ఉండమని అంటాడు. ఇంకోసారి రేణుకని ఏమైనా అంటే ఇంటి నుంచి గెంటేస్తానని అంటాడు. సత్య వంట చేస్తూ బామ్మ చెప్పిన మాటలు తలచుకొని ఆలోచిస్తుంది. క్రిష్‌కి తన మీద మళ్లీ నమ్మకం కలిగేలా చేయాలని క్రిష్ కోసం కాఫీ తీసుకెళ్తుంది.
సత్య: కాఫీ నీ కోసమే..
క్రిష్: నా కోసమే అని బ్రమ పడటం కంటే మోసం ఇంకోటి లేదు.
సత్య: ఆశల్ని వదులుకుంటున్నావా.
క్రిష్: కాదు మనసుని చంపుకుంటున్నా.
సత్య: అది నీ వల్ల కాదు కాఫీ తీసుకో.
క్రిష్: తాగాలి అని లేదు. పరిస్థితుల్ని బట్టి కొన్ని అలవాట్లు పద్ధతులు ఆలోచల్ని వదులుకుంటున్నాను.
సత్య: అలవాట్లేనా మనుషుల్ని కూడానా. కాఫీ తాగి.. నీ గురించే ఆలోచించి కాఫీ పెట్టా అందుకే చాలా టేస్టీగా వచ్చింది. తాగకుంటే మిస్ అయిపోతావ్. పైగా ఇది నువ్వు తాగాల్సిన కాఫీ నేను తాగుతున్నా అందుకే ఎక్ట్రా టేస్ట్ ఉంది.
క్రిష్: నువ్వు నీలా మాట్లాడు.
సత్య: సరే ఇంతలా నిన్ను హర్ట్ చేస్తున్నా మౌనంగా భరిస్తున్నావ్ అంటే కారణం ఏంటో తెలుసా ఈ ఇరిటేషన్‌కి మంచి ఇష్టం నా మీద నీకు ఉంది. నిన్ను జరిగిన సంఘటన నువ్వు ఇంకా మర్చిలేదు నా మీద కోపం ఇంకా తగ్గలేదు కదా. నిన్ను బాధ పెట్టాను..
క్రిష్: నన్ను ఒంటరిగా వదిలేస్తే ప్రశాంతంగా ఉంటా. అయినా నీకు నాకు ఏం రిలేషన్ ఉందని ఇన్ని సేవలు చేస్తున్నావ్. బంధం బాధ్యత అని ఎప్పుడూ లేనిది నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావేంటి. నువ్వు నన్ను అర్థం చేసుకోనప్పుడు మాట్లాడి లాభం ఏంటి. నా మనసుకి గాయం తగలని చోటు లేదు అర్థం చేసుకో ప్లీజ్.
సత్య: నువ్వు మారే వరకు నేను వదిలిపెట్టను.
సంధ్య లాయర్ ధనుంజయ్ దగ్గరకు వెళ్తుంది. సంధ్య తనని తాను పరిచయం చేసుకుంటే ధనుంజయ్ సంధ్య అంటాడు. పేరు గుర్తుందా అని సంధ్య అడిగితే గుర్తుండిపోయిందని అంటాడు. సంధ్య చేతిలో బాక్స్ చూసి నా కోసం ఏదో తీసుకొచ్చావ్ అని అంటాడు.
ధనుంజయ్: నాకు మొహమాటం అస్సలు లేదు కావాల్సింది అడిగి తీసుకుంటా. స్వీట్ క్యూట్‌గా ఉంది నీలా.
సంధ్య: కేసు గెలిచి మా నాన్నని గెలిపించారు థ్యాంక్స్. మహదేవయ్య గారిని ఎదురించి ఎవరూ కేసు టేకప్ చేయలేదు. మీరు చేసి మమల్ని రక్షించారు.
ధనుంజయ్: నేను ఎందుకు కేసు తీసుకున్నానో తెలుసా. నీ సిన్సియారిటీ ఎమోషన్ నచ్చాయి కాబట్టి. కేసు ఒప్పుకోను అంటే మీ వాళ్లు అందరూ వెళ్లిపోయారు నువ్వు మాత్రం ఆగి నన్ను కన్విన్స్ చేసిన తీరు నచ్చింది. జనరల్‌గా నీలాంటి కూతుర్ని కన్న పేరెంట్స్ అదృష్టవంతులని అందరూ అంటారు కానీ నేను ఏమంటానో తెలుసా. నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడు అదృష్టవంతుడు. కన్న వాళ్ల కోసం ఇంత ఆలోచించే నువ్వు రేపు ప్రేమించిన వాడి గురించి ఇంకెంత ఆలోచిస్తావో నిజానికి జలసీగా ఫీలయ్యా. ముందే చెప్పాను నాకు మొహమాటం తక్కువ అని. చాలా బాగుంది నీ సిగ్గు.
సంధ్య: నేను వెళ్లొస్తా.
ధనుంజయ్: ఒక్క నిమిషం నేను చెప్పాల్సింది ఇంకా అవ్వలేదు కూర్చొ. ఐ లవ్ యూ. ఇప్పటికిప్పుడు నువ్వు చెప్పక్కర్లేదు. ఇంటికి వెళ్లి తీరికగా ఆలోచించి చెప్పు. నేను చెప్పాల్సింది అయిపోయింది ఇవ్వాల్సింది మిగిలింది అని సంధ్యకి లాయర్ గిఫ్ట్ ఇస్తాడు.
సంధ్య: నేను వస్తానని మీకు ఎలా తెలుసు.
ధనుంజయ్: నాది ట్రూ లవ్ అని నాకు తెలుసు. నువ్వు కూడా నన్ను ఇష్టపడితే తప్పుకుండా వస్తావ్ అని నా మనసు చెప్పింది వచ్చావ్.
సంధ్య గిఫ్ట్ తీసుకొని వెళ్లిపోతుంది. ధనుంజయ్ దగ్గరకు అతని అసిస్టెంట్ వచ్చి ఇది తప్పు సార్ ఆల్రెడీ ఓ అమ్మాయిని లైన్‌లో పెట్టి మరో అమ్మాయికి ప్రపోజ్ చేయడం తప్పు అంటాడు. దానికి ధనుంజయ్ మోసం పోవడం వాళ్ల తప్పు అని అంటాడు. క్రిష్ గన్ రిపేర్ చేస్తుంటే అది చూసి సత్య క్రిష్ దగ్గరకు వస్తుంది. సత్యని చూసిన క్రిష్ పక్కనున్న పనోడిని పిలిచి గన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సత్య క్రిష్ వెనక పరుగులు తీసి క్రిష్‌ని ఆపుతుంది. తాను రాగానే ఎందుకు వెళ్లిపోతున్నావ్ అని అంటుంది. భోజనానికి క్రిష్‌ని రమ్మని పిలిస్తే క్రిష్ తన గురించి తన తల్లి చూసుకుంటుందని అంటే సత్య తన మెడలా తాళి ఉన్నంత వరకు నీ బాధ్యత నాది అని చెప్తుంది.
క్రిష్ సత్యకి విడాకుల అగ్రిమెంట్ చూపించి దీని ప్రకారం నేను కట్టిన తాళి కొద్ది రోజులే అని ఇప్పటి నుంచే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉండటం అలవాటు చేసుకోవాలి అని అంటుంది. సత్య క్రిష్ చేయి పట్టుకొని భోజనానికి పిలిస్తే క్రిష్ చేయి వదిలేసి వెళ్లిపోతాడు. ఇక పనోడి దగ్గరకు వెళ్లి వాడిని లాగి పెట్టి ఒక్కటిచ్చి సత్యకి వినిపించేలా ఒక్కసారి చెప్తే వినిపించదా. మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే నిలబెట్టుకోవాలి నమ్మకం ప్రాణంతో సమానం అని అంటాడు. చేయని తప్పునకు శిక్ష అనుభవించినోడినని అర్థం చేసుకోలేని ప్రేమ, నమ్మకం లేని బంధం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని క్రిష్ అంటే సత్య చాలా బాధ పడుతుంది.
మరోవైపు సంధ్య లాయర్ మాటలు ప్రపోజల్ తలచుకుని మురిసిపోతుంది. సంధ్యని చూసిన విశాలాక్షి ఇలా ఉందేంటని అనుకుంటుంది. ఏమైంది టెన్షన్‌గా ఉన్నావని అడుగుతుంది. తల నొప్పి అని సంధ్య కవర్ చేస్తుంది. ఇక ధనుంజయ్ ఇచ్చిన గిఫ్ట్ తీస్తుంది. అందులో వాచ్ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!