ఈటీవీలో ప్రసారం అయ్యే డాన్స్ రియాలిటీ షో 'ఢీ' ఎంతో మందిని ప్రేక్షకులకు దగ్గర చేసింది. పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన స్టార్ కొరియోగ్రాఫర్లు శేఖర్, జానీ, గణేష్ వంటి మాస్టార్లు 'ఢీ' నుంచి వచ్చారు. అటువంటి 'ఢీ' షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్లలో చైతన్య మాస్టర్ ఒకరు. గత ఏడాది మార్చిలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను 'ఢీ'కి తీసుకు వచ్చారు.
నా తల కొరివి మీరే పెట్టాలి!
Chaitanya Master Parents In Dhee: చైతన్య మాస్టర్ తండ్రి వెంకట సుబ్బారావు స్టేజి మీదకు చిన్న పిల్లాడిలా రెడీ అయ్యి వచ్చారు. అప్పుడు 'ఢీ' స్టేజిపై ఉన్న ఫ్యామిలీ మెంబర్లకు, 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 సభ్యులకు ఒక్కసారిగా చైతన్య మాస్టర్ గుర్తుకు వచ్చారు.
చైతన్య మాస్టర్ 'ఢీ' ప్రోగ్రాంలో చేసిన పెర్ఫార్మన్స్‌లలో చిన్న పిల్లాడిలా చేసిన పెర్ఫార్మన్స్ ఒకటి. సేమ్ టు సేమ్ గెటప్ వేసుకుని ఆయన ఫాదర్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాజ్యం అయితే కుమారుడిని తలచుకుని మరింత ఎమోషనల్ అయ్యారు. ''వీళ్లంతా (ఢీ షోలో డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు) నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా? నన్ను మోస్తారా?'' అని అడగటంతో అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెను పండు దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఓదార్చాడు. అప్పుడు 'మీరే నన్ను మోయాలి. మీరే తల కొరివి పెట్టాలి. ఇదే నా కోరిక. ఎందుకు అంటే... నా కొడుకు లేడు కాబట్టి' అని ఆవిడ చెప్పారు. హన్సిక సైతం ఆవిడ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నారు.
బిచ్చగాళ్ల గెటప్పులు వేసిన అబ్బాయిలు
జూలై 3న టెలికాస్ట్ కానున్న 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2'లో కేవలం ఎమోషనల్ మూమెంట్స్ మాత్రమే కాదు... మంచి వినోదం సైతం ఉందని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. 'హైపర్' ఆదితో పాటు కంటెస్టెంట్లు, కొందరు కొరియోగ్రాఫర్లు బిచ్చగాళ్ల గెటప్పులు వేశారు. అక్కడ ఆది చేసిన కామెడీకి అందరూ నవ్వుకున్నారు.
Also Read: టాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!