Guppedanta Manasu  Serial Today Episode: వసుధార వచ్చి శైలేంద్రకు ఎండీ అయ్యే అర్హత ఉందని చెబితేనే శైలేంద్రను ఎండీని చేస్తామని ఫణీంద్ర చెప్పడంతో ఇంతలో ధరణి వచ్చి వసుధార ఎప్పటికీ అలా చెప్పదని అంటుంది. దీంతో దేవయాని, ధరణిని తిడుతుంది. నువ్వు హద్దులో ఉండు అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఫణీంద్ర దేవయానిని తిడతాడు. వీళ్లు ఎప్పటికీ మారరని నువ్వు వెళ్లి పని చూసుకోమని ధరణికి చెప్పి తాను వెళ్లిపోతాడు ఫణీంద్ర. మరోవైపు రంగ తాను దాచుకున్న డబ్బులు లెక్కిస్తుంటాడు.


రాధమ్మ: ఏం నాన్నా మీ మామయ్యకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు లెక్కిస్తున్నావా?


రంగ: అవును నాన్నమ్మా ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆయన మాత్రం నెల కాగానే వడ్డీ డబ్బుల కోసం వస్తాడుగా? అందుకే ముందే లెక్కలేసి పెట్టుకుంటున్నా


రాధమ్మ: ఏంటోరా ఆ సరోజేమో నిన్నే పెళ్లి చేసుకుంటానని నీ వెంట తిరుగుతుంటే వాళ్ల నాన్నమే డబ్బుల కోసం తిరుగుతుంటాడు.


సంజీవయ్య: ఏరా లెక్క సరిపోయిందా?


రంగ: రండి మామయ్య.. కూర్చోండి.


సంజీవయ్య: మర్యాదలొద్దులేరా కాస్త డబ్బులిస్తే చాలు


రంగ: లెక్క పెట్టుకోండి మామయ్య.


సంజీవయ్య: నువ్వు ఇచ్చేది తక్కువైనా నీ లెక్క సరిగ్గా ఉంటుందిలేరా?


 అంటూనే వెటకారంగా డబ్బులు లెక్కపెడతాడు. తర్వాత ఇక ఎప్పుడూ వడ్డీలు కడుతూనే ఉంటావా? అని సంజీవయ్య అడగ్గానే త్వరలోనే అసలు కూడా కడతానులే మామ అంటాడు రంగ. ఇంతలో రాధమ్మ సరోజ పెళ్లి గురించి అడుగుతుంది. రంగాతో సరోజ పెళ్లి చేద్దామని చెప్తుంది. దీంతో సంజీవ కోపంగా అప్పు కట్టలేక పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? అనగానే మీకు మీరే నా కాళ్లు కడిగి పెళ్లి చేస్తానన్నా నేను పెళ్లి చేసుకోనని రంగ చెప్తాడు. ఇంతలో వసుధార రాగానే మీకే తిండికి గతి లేదంటే ఇంకొకరిని ఉద్దరిస్తారా? అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర జగతి ఫోటో దగ్గర నిలబడి బాధపడుతుంటాడు. నేను కూడా చనిపోతానని తల గోడకేసి కొట్టుకుంటాడు. మను, అనుపమ వచ్చి ఆపుతారు.


మను: ఏమైంది సార్‌ చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇంత బాధ


మహేంద్ర: ఎందుకింత బాధ అంటావేంటి మను. బ్రతుకంతా బాధే కదా? నువ్వు చెప్పు నాలో ఏరోజైనా సంతోషం కనిపించిందా? పోనీ ఈ మధ్య కాలంలో నేను నవ్వడం ఎప్పుడైనా చూశావా? లేదు కదా? ఇంకెందుకు మను ఈ జన్మ.


మను: సర్‌ బాధలు అందరికీ ఉంటాయి. అలాగని బతుకును దూరం చేసుకోకూడదు కదా?


 


ALSO READ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్పై స్పందిస్తూ సెటైరికల్కామెంట్స్


 


మహేంద్ర: నిజమే మను బాధలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరి బాధ వారిదే కదా? నీ బాధ ఈరోజు కాకపోయినా రేపు తీరుతుంది. మీ అమ్మా నోరు విప్పితే నీ బాధ తీరిపోతుంది. నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కానీ నేను ఏం చేసినా నా జగతి తిరగిరాదు కదా?   ఈ బాధలు తీరేవేనా? అందరూ నాకు దూరం అయిపోయాక ఇక నేను ఎవరి కోసం బతకాలి.


అనుపమ: అలా అనొద్దు మహేంద్ర. అందరూ దూరం అయ్యారని నువ్వు అనుకుంటే సరిపోదు. నీకోసం ఎదురుచూసేవాళ్లు, నీ ప్రేమ పొందాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారు.


మహేంద్ర: లేరు అనుపమ.. ఎవ్వరూ లేరు.


అనుపమ: ఉంటారు మహేంద్ర, కాలం కలిసొచ్చిన రోజు ఆ దేవుడు వాళ్లను నీ దగ్గరకు పంపిస్తాడు. ఆ దేవుడే మిమ్మల్ని కలుపుతాడు.


మహేంద్ర: వద్దు అనుపమ నా జీవితంలో నాకు దూరం అయిపోయే వాళ్లే తప్పా కొత్తగా వచ్చే వాళ్లు ఎవ్వరూ లేరు.


మను: సార్‌ ఏంటా మాటలు..


అనగానే మహేంద్ర మీరిద్దరూ కూడా నాకు దూరంగా వెళ్లిపోండి. లేదంటే నా దురదృష్టం మీకు అంటుకుంటుంది అంటాడు మహేంద్ర. ఇలాంటివన్నీ నమ్ముతారా అటూ మను ప్రశ్నిస్తాడు. ఎందుకు నమ్మలేము మీ అమ్మా ఒక ఫ్రెండ్‌గా నా జీవితంలోకి వచ్చింది కానీ ఎన్ని బాధలు పడుతుంది అందుకే మీరు కూడా వెళ్లిపోండి అంటాడు మహేంద్ర. తర్వాత మను వెళ్తుంటే రౌడీలు అడ్డగించి చంపబోతే వాళ్లను చితక్కొడతాడు మను. నా మీద ఎందుకు దాడి చేశారని మను రౌడీలను అడగ్గానే శైలేంద్ర నిన్ను చంపమని సుపారి ఇచ్చాడని చెప్పి రౌడీలు పారిపోతారు. మరోవైపు రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.