Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ గొడవలన్నీంటికి పులిస్టాప్ పెట్టాలని అపర్ణతో చెప్పబోతుంటే అనామిక కలగజేసుకుని నాకు విడాకులు ఇవ్వాలనే కదా అలా మాట్లాడుతున్నావు అంటూ అప్పును కూడా తిడుతుంది. దీంతో కళ్యాణ్ అనామికను కొట్టబోతుంటే ఇంతలో అనామిక అమ్మానాన్న వస్తారు. ఆగిపోయావేం కొట్టు అని కోపంగా అంటారు. అనామిక ఏడుస్తూ వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లు ముగ్గురు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అనగానే వాళ్లు కళ్యాణ్‌ను తిడతారు. దీంతో రాజ్ వాళ్లను తిడతాడు. ఇంతలో సుభాష్ కలగజేసుకుంటే సుభాష్‌ను కూడా అనామిక తిడుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో స్వప్న సీరియస్ గా అనామికకు వార్నింగ్ ఇస్తుంది.
కావ్య: అనామిక ఒక్కనిమషం నువ్వు మాట జారకుండా ఉంటే కవి గారు నీతో మనసు విప్పి మాట్లాడటానికి వచ్చారు.
అనామిక: ఆయన నువ్వు చెప్తే మనసు విప్పి మాట్లాడటానికి వచ్చారా? ఎంతైనా తను మోజు పడిన ఆడదానికి అక్కవి కదా? నీ మాట కచ్చితంగా వింటాడులే
కళ్యాణ్: విన్నారుగా ఇది మీ కూతురు వ్యవహారం. చాలా ఎక్కువ చేస్తుంది. మా కాపురం చక్కదిద్దాలని నన్ను ఎంతో బతిమాలిన మా వదినను ఎంతలా తూలనాడిందో విన్నారుగా
ధాన్యలక్ష్మీ: తన వల్ల మా ఇంటి పరువు పోతుందా? తను మా వల్ల బాధపడుతుందా?
సుభాష్: చూడండి ఇప్పటి వరకు ఇది భార్యభర్తల సమస్యే అనుకున్నాం. కానీ ఇది ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్యగా మారింది. ఇక నుంచైనా మీ అమ్మాయిని అదుపులో ఉండమని చెప్పండి.
అనామిక: దుగ్గిరాల కుటుంబం దేవలోకం నుంచి ఊడిపడలేదు. అది గుర్తుపెట్టుకో నువ్వు.
ఇందిరాదేవి: ఏమైంది నీకు నా కుంటుంబం గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు. నీకసలు కాపురం చేయాలని ఉందా? లేదా?
అపర్ణ: అనామిక నీతో కానీ మీ వాళ్లతో కానీ మాట్లాడే ఓపిక నాకు లేదు. ఏమైంది నీకు మొత్తం పరువు తీసింది నువ్వే.. మొత్తం చేసిందంతా నువ్వే. అందర్నీ తిట్టావు. పైగా సర్ది చెప్పాల్సిన నీ తల్లిందండ్రులు కూడా ఇంతలా దిగజారిపోయి మాట్లాడుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావేంటి?
అనామిక: దిగజారుడుతనం గురించి నీ దగ్గర నేర్చుకోవాలి. ఈ వయసులో మీ ఆయన ఇంకో దానితో సంబంధం పెట్టుకుని ఓ కొడుకుని కూడా కన్నాడు. అది మర్చిపోయారా?
రాజ్: అనామిక చాలు మా సహనం హద్దులు దాటుతుంది.
ALSO READ: సమంత కొత్త వెబ్ సిరీస్... హిట్ కాంబినేషన్‌లో మూడోది, టైటిల్ ఏంటో తెలుసా?
అనామిక: అవునండి ఈ ఇంట్లో అందరికీ సహనం ఉంటుంది. మీరేమో కంపెనీకి ఏకైక రాజును అన్నట్లు రాజ్యమేలుతారు. నేనేమో ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే మొగుడితో సర్దుకుపోతూ ఉండాలా? మీ తమ్ముణ్ని మీరే ఒక చేతకాని చవటలా తయారు చేస్తున్నారు.
కావ్య: ఇంత మంది పెద్దవాళ్లు నీ బాగుకోరి నీకోసం మాట్లాడుతుంటే నోటికొచ్చిందల్లా మాట్లాడతావా? నా భర్తను అంటావా? నువ్వు మీ అమ్మా మీ నాన్నా నా భర్త కాలి గోటికి కూడా సాటిరారు. అసలు ఏమైందే.. ఇలా మాట్లాడుతున్నావు.
కళ్యాణ్: కూతురే కాదు తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. ఒక నీతి జాతి లేని మనుషులు ఇలాంటి వారికి ఈ ఇంటి గుమ్మంలో కూడా అడుగుపెట్టడానికి అర్హత లేదు. వెళ్లండి.. మీ కూతుర్ను తీసుకుని వెళ్ళిపోండి.
అనామిక నాన్న: మీ వాళ్లంతా సంస్కారవంతులు మేము మాత్రమే..
కళ్యాణ్: ఓరేయ్.. నా జీవితంలో నా నోటి నుంచి నేను జారిన తప్పుడు మాట ఇదొక్కటే నీ కూతుర్ని నీ భార్యని తీసుకుని పో.. పోరా..
ఇందిరాదేవి: కళ్యాణ్ బాగా ఆలోచించే ఈ మాట అంటున్నావా? ఏంటి బావా ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడరేంటి?
అనగానే పరంధామయ్యా ఇది అసలు మన ఇల్లేనా? ఇలాంటి వాళ్లను ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు. ఈ ఇంటికి వచ్చిన కోడళ్లు ఎప్పుడైనా పెద్దవాళ్లను ఎదిరించి మాట్లాడారా? అని అంటాడు. ఇంతలో అనామిక కళ్యాణ్‌కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కళ్యాణ్ ఏడుస్తూ ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతాను అనగానే అందరూ బాధపడతారు. తర్వాత గార్డెన్‌లో ధాన్యలక్ష్మీ బాధపడుతూ ఉంటే కావ్య వెళ్లి ఓదారుస్తుంది. కావ్యను ధాన్యలక్ష్మీ తిడుతుంది. అపర్ణ వచ్చి ధాన్యలక్ష్మీని తిడుతుంది. కావ్యను వెనకేసుకొస్తుంది. తర్వాత అనామిక ఓ న్యూస్ చానెల్ లో తనకు అన్యాయం జరిగిందని.. తనను మెట్టినింటి వారు టార్చర్ పెడుతున్నారని చర్చ పెడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.