సమంత (Samantha)... టాలీవుడ్, కోలీవుడ్ - రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. కథానాయికగా మంచి స్థానంలో ఉన్నప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేశారు. ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ చేయడానికి సంతకం చేశారని బాలీవుడ్ టాక్. ఆ సిరీస్ హీరో ఎవరు? దానికి డైరెక్షన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే...


రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో...
రాజ్ అండ్ డీకే... ఇద్దరు తెలుగు వ్యక్తులే. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు. హిందీ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఓటీటీల్లో అయితే వాళ్ళ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండు సీజన్స్, 'గన్స్ అండ్ గులాబ్స్' తీశారు. ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ 'సిటాడెల్' ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఇది కాకుండా మరొక వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో సమంత మెయిన్ లీడ్ చేస్తుందని బాలీవుడ్ టాక్. 


'రక్తబీజ్'లో ఆదిత్య రాయ్ కపూర్, సమంత!
దర్శకుడు రాజ్ అండ్ డీకే (Raj And DK), హీరోయిన్ సమంతది సూపర్ హిట్ కాంబినేషన్. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2లో ఆవిడ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. 'సిటాడెల్'లో ఆమెది మెయిన్ లీడ్ రోల్. త్వరలో రాజ్ అండ్ డీకే తీయనున్న యాక్షన్ వెబ్ సిరీస్ 'రక్తబీజ్'లోనూ ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read: Animal హీరోయిన్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జనాలు - Bad Newz రిలీజ్ డేట్, ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా?



'రక్తబీజ్' (Rakhtabeej Web Series)లో ఆదిత్య రాయ్ కపూర్ కథానాయకుడు అని ముంబై వర్గాలు చెప్పాయి. సుమారు ఆరు నెలల డిస్కషన్ తర్వాత ఆయన ఈ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి 'ఎస్' అని చెప్పారట. మే నెలలో ఆయన ఓకే చెప్పగా... అప్పుడు సమంతను రాజ్ అండ్ డీకే అప్రోచ్ అయ్యారట. కథ విని ఆవిడ కూడా ఓకే చెప్పారట.


యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రిపరేషన్!
'రక్తబీజ్' కోసం సమంత ఆల్రెడీ ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేశారని తెలిసింది. యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో తన యాక్షన్ పార్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారట. మార్షల్ ఆర్ట్స్, ఇతర విద్యల్లో ట్రైనింగ్ అవుతున్నారట. త్వరలో ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. సమంతతో రాజ్ అండ్ డీకే థర్డ్ సిరీస్ కాగా... ఆదిత్య రాయ్ కపూర్ కాంబినేషన్‌లో వాళ్లకు మొదటి సిరీస్.


త్వరలో బ్రేక్ నుంచి షూటింగులకు సమంత!
'యశోద' చిత్రీకరణ సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడ్డారు. దానికి చికిత్స తీసుకుంటూ 'శాకుంతలం', విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ షూట్స్ స్టార్ట్ చేయనున్నారు.


Also Read: 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సాంగ్ రిలీజుకు ముహూర్తం ఫిక్స్ - స్టెప్పా మార్ సందడి ఎప్పుడంటే?