Double Ismart First Single: 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సాంగ్ రిలీజుకు ముహూర్తం ఫిక్స్ - స్టెప్పా మార్ సందడి ఎప్పుడంటే?
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'స్టెప్పా మార్' లిరికల్ వీడియో జూలై 1న విడుదల చేయనున్నట్లు పూరి కనెక్ట్స్ ప్రకటించింది. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఆయన ఛార్ట్ బస్టర్ ఆల్బంతో పాటు సూపర్బ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైతం మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
'డబుల్ ఇస్మార్ట్'లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున 'చంద్రలేఖ'లో ఆయన అతిథి పాత్రలో సందడి చేశారు. ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది.
ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. శంకర్ పాత్రలో రామ్ నటన, ఆ పాత్రను పూర్తి తీర్చిదిద్దిన తీరుకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.
'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఇంకా శామ్ కె నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలీ, గెటప్ శ్రీను ప్రధాన తారాగణం. సంజయ్ దత్ విలన్ రోల్. కేచ, రియల్ సతీష్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.