Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Kalki Actress Anna Ben Photos:'కల్కి 2898 AD' సినిమాలో అతిథి పాత్ర లిస్ట్ చాలా పెద్దది. ప్రతి సన్నివేశంలోనూ ప్రముఖ నటులే ఉన్నారు. ప్రతి ఒక్కరిది ప్రత్యేకమైన పాత్రే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇలా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు నాగ్ అశ్విన్ ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. అలా ఎన్నో పాత్రలు కల్కిలో ఎదురయ్యాయి. అలా వచ్చిన పాత్రలో కైరా ఒకటి.
ఇందులో లీడ్ రోల్ దీపికాను కాంప్లెక్స్ నుంచి రక్షించేందుకు రెబల్స్ అంతా ఒక్కటయ్యారు. ఈ క్రమంలో దీపికా పదుకొనె రక్షించే రెబల్స్‌లో కైరా పాత్ర ఒకటి. ఇందులో కాంప్లెక్స్ మనుషులతో ధైర్యంగా పోరాడిన ఆమె పాత్ర ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
దీంతో ఇప్పుడు కైరా పాత్రలో నటించిన ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె అసలు పేరు అన్నా బెన్. ఈమే మలయాళ నటి. ఆమె కొచ్చిలోని సెయింట్ థెరిసా కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
చదువుతూనే సినీరంగ ప్రవేశం చేసింది. మలయాళం స్క్రీన్ రైటర్ బెన్నీ నయరాంబలం కూతురైన అన్నా బెన్ మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు 'కల్కి 2898ఏడి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
2019 లో 'కుంభ నంగి నైట్స్' అనే మలయాళం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'హెలెన్' అనే చిత్రంలో నటించిన గుర్తింపు పొందింది.
ఈ మూవీ సక్సెస్‌లో మాలీవుడ్‌లో అన్నా బెన్ పేరు మారుమోగింది. ఈ చిత్రంలో ఉత్తమ నటి పలు అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత కప్పేలా చిత్రంలో నటించిన నటిగా మంచి గుర్తింపు పొందింది.
ఇదే సినిమాను తెలుగులో 'బుట్టబొమ్మ'గా రీమేక్ చేశారు. ఇలా వరుసగా మలయాళంలో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న అన్నా బెన్ ఇప్పుడు పాన్ వరల్డ్ కల్కి చిత్రంలో పవర్ఫుల్ క్యారెక్టర్‌లో నటించి నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందింది.