Krishnamma kalipindi iddarini June 22th: ఈశ్వర్ తన తమ్ముడు ఆదిత్యతో నీ ప్రేమ గురించి నాకు చెప్పవా అంటూ మాట్లాడుతుంటాడు. ఎవరా అమ్మాయి అని అడుగుతాడు. నీ వల్ల నా కళ్ళు పోయాయాని మమ్మీ నీపై కోపంగా ఉంటుందని.. అందుకు నాకు చాలా బాధగా ఉంది అని బాధపడతాడు. ఇప్పుడు నీ ప్రేమ విషయం నేనే స్వయంగా అమ్మకు చెబుతాను అనటంతో ఆదిత్య వద్దు అన్నయ్య నేనే చెబుతాను అని అంటాడు.
ఆ తర్వాత ఆదిత్య తన అన్నయ్య పుట్టినరోజు అని అందరికీ ఫోను చేస్తూ మాట్లాడుతుంటాడు. ఇక ఆ హడావుడి చూసి సునంద బాధపడుతుంది. గౌరీ పెళ్లికి ఒప్పుకోలేదు అని చెబితే ఎలా బాధపడతాడో అని బాధపడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళు అందరికీ ఫోన్ చేశారా అని అడగటంతో అసలైన మెయిన్ గెస్ట్ గౌరీకే చేయలేదు అని అంటాడు.
అప్పుడే ఈశ్వర్ వచ్చి నువ్వేం చేయకు.. మమ్మీనే చేయమని అంటాడు. దాంతో అందరూ సంతోషపడగా.. సునంద మాత్రం షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ సునందను ఇప్పుడే గౌరీ కి ఫోన్ చెయ్యి అనటంతో.. తర్వాతకు చేస్తాను అని అంటుంది సునంద. అంటే మా అందరి ముందు కోడలితో మాట్లాడలేవా అంటూ ఇంట్లో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మరోవైపు సౌదామిని భవాని ఇంటి పక్కన ఉన్న ఆవిడతో గౌరి ఇంట్లో జరిగిన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇక మరుసటి రోజు ఇంట్లో పుట్టినరోజు హడావిడి కనిపిస్తుంది. ఆదిత్య బేకరీ కి ఫోన్ చేసి కేకు గురించి అడుగుతుంటాడు. అప్పుడే అమృత వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఇక ఈ ఇంటి కోడలు కావాలి అది ఉందని హగ్ చేసుకొని మాట్లాడుతుండగా అప్పుడే ఆదిత్య పిన్ని వచ్చి వాళ్ళని చూసి మురిసిపోతుంది. అక్కడి నుంచి అమృతను లోపలికి తీసుకొని వెళ్తుంది.
ఇక ఈశ్వర్ ముఖం చూసిన సునంద చాలా బాధపడుతుంది. సునంద దగ్గరికి ఈశ్వర్ వచ్చి తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటాడు. సునంద మాత్రం బాధపడుతూ ఉంటుంది. గౌరీ వాళ్ళు వస్తున్నారా అని ఈశ్వర్ ప్రశ్నించడంతో సునంద ఏమి చెప్పలేక పోతుంది. అప్పుడే సౌదామిని అక్కడికి వచ్చి గౌరీ ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్పటంతో ఈశ్వర్ షాక్ అవుతాడు.
తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అది చూసి సునంద బాగా ఏడుస్తుంది. గతంలో డాక్టర్ ఈశ్వర్ గురించి చెప్పిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతుంది. ప్రేమించిన అమ్మాయి కాదనటంతో ప్రాణాల మీదికి తెచ్చుకుందని బాధపడుతుంది. అదంతా చూసి సౌదామిని వాళ్ళు సంతోష పడుతుంటారు. ఆ సమయంలో గౌరీ తన తల్లి, చెల్లి తో కలిసి వస్తుంది. వెంటనే సునంద జరిగిన విషయానికి గౌరీ కి చెప్పటంతో గౌరీ ఈశ్వర్ వైపు బాధగా చూస్తుంది.
Also Read: Madhuranagarilo June 22th: సంయుక్త మాటలకు ఫైరైన శ్యామ్, రాధ, పండులను టార్గెట్ చేసిన తల్లి కూతుర్లు?