Madhuranagarilo June 22th: గోల్డ్ షాప్ లో జరిగిన దాని గురించి అపర్ణ కోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంటికి రాగా అక్కడ సంయుక్త కూడా దిగులుగా కనిపిస్తుంది. ఏం జరిగింది అని అపర్ణ అడగటంతో సంయుక్త జరిగిన విషయం చెబుతుంది. శ్యామ్ పండుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అని నాకంటే పండే ఎక్కువ అయ్యాడు అని చెబుతుంది. అపర్ణ కూడా అవును నాకంటే మధురకు రాధ ఎక్కువైంది అని చెబుతుంది.


ఏం జరిగింది అని సంయుక్త అడగటంతో.. గోల్డ్ షాప్ లో జరిగిన విషయాన్ని మొత్తం చెబుతుంది అపర్ణ. దాంతో సంయుక్తకు బాగా కోపం వస్తుంది. ఇద్దరు కలిసి వాళ్లు తమను బాధ పెడుతున్నందుకు శ్యామ్ కు పండును, మధురకు రాధను దూరం చేయాలి అని అనుకుంటారు. మరోవైపు పండు లాప్టాప్ లో తన తండ్రి అడ్రస్ వెతుకుతూ ఉంటాడు.


అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామ్ ఏం చేస్తున్నావు అని అడగటంతో మా డాడీ అడ్రస్ వెతుకుతున్నాను అని డాడీ గురించి చెప్పుకుంటూ బాధపడటంతో శ్యామ్ బాధపడతాడు. ఇకపై నువ్వు నన్ను డాడీ అని పిలువు అనటంతో పండు డాడీ అని పిలుస్తుంటాడు. పండుకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందని అనటంతో అక్కడి నుంచి బయలుదేరుతారు.


గోల్డ్ షాప్ లో జరిగిన నింద గురించి రాధ బాధపడుతూ.. ఆ సమయంలో మధుర తనపై చూపించిన ప్రేమను తలుచుకొని సంతోషపడుతుంది. తనపై వాళ్లు బాగా నమ్మకం పెట్టుకున్నారు అని.. శ్యాం సార్ పెళ్లి విషయంలో కూడా మధుర మేడం నమ్మకం పెట్టుకుంది అని అనుకుంటుంది. కానీ శ్యామ్ ఎంగేజ్మెంట్ తర్వాత తనతో ప్రేమలో ఉన్నాడని.. ఎలాగైనా సంయుక్తను, శ్యామ్ ను ఒకటి చేయాలి అని అనుకుంటుంది.


ఇక గన్నవరం, గోపాల్ వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా పండు.. గోపాల్ ని చూసి ఏనుగు ఎక్కాలని ఉందని శ్యామ్ తో అంటాడు. ఇక శ్యామ్ అక్కడికి తీసుకెళ్లగా.. పండు వాళ్ళ ముందు డాడీ అని శ్యామ్ ను పిలవటంతో వాళ్ళు షాక్ అవుతారు. ఇక డాడీ అని ఎందుకు పిలుస్తున్నాడు అని అడగటంతో జరిగిన విషయం చెబుతాడు శ్యామ్.


ఆ తర్వాత గోపాల్ మీద ఎక్కి ఆడుకుంటాడు. ఇక గన్నవరం, నెల్సన్ కూడా గోపాల్ మీద ఓకే కాసేపు సరదాగా ఆడుకుంటారు. ఆ తర్వాత ఐస్క్రీం పార్లర్ కు శ్యామ్, పండు వెళ్లగా బయట ఆగి ఉన్న కార్ ను చూసి సంయుక్త కూడా లోపలికి వెళుతుంది. అక్కడ పండు ను శ్యామ్ తో చూసి కోపంగా కనిపిస్తుంది. ఇక పండు శ్యామ్ ను డాడీ అని పిలవగా షాక్ అవుతుంది.


ఎందుకలా పిలుస్తున్నావు అంటూ చేయి చేసుకుంటుండగా శ్యామ్ ఆపుతాడు. ఇక శ్యామ్ తనపై ఫైర్ అవుతూ తనను పండు డాడీ అని పిలవడానికి రీజన్ ఉందని చెబుతాడు. అయితే రాధకు కూడా భర్త లేడు కదా భర్తగా ఉంటావా అనటంతో మరోసారి తనపై కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్తాడు. ఇక చీకటి పడ్డాక పువ్వుల అమ్ముకునే ఆవిడ రాధ ఇంటిదగ్గర కనిపించడంతో శ్యామ్ ఆవిడను ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు. రాధ ఇంటికి వచ్చేటప్పుడు పువ్వులు అడిగింది అని ఇవ్వడానికి వెళుతున్నాను అనటంతో.. నేను ఇస్తాను నాకు ఇవ్వు అని కొంటాడు. ఇక ఇంట్లోకి వెళ్లి రాధ కు మల్లెపూలు చూపించడంతో రాధ ఫైర్ అవుతుంది.


Also Read: Krishnamma kalipindi iddarini June 21th: సునందను అయోమయ పరిస్థితిలో ఇరికించిన భవాని-తన ప్రేమ విషయం బయట పెట్టడానికి సిద్ధమైన ఆదిత్య?