Krishnamma kalipindi iddarini June 21th: భవాని అక్కడికి రావడంతో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సునంద అడగటంతో మీరు నాపై కోప్పడను అంటే మాట్లాడతాను అని అంటుంది భవాని. దానికి సరే అంటుంది సునంద. నువ్వు వచ్చి కళ్ళు లేని నీ కొడుకుకు నా కూతురు ఇవ్వమంటే కోప్పడ్డాను కానీ.. ఒక తల్లి మనసుని అర్థం చేసుకోలేకపోయాను.. నువ్వు ఎలా అయితే నీ బిడ్డ గురించి ఆలోచించారో అలాగే నా బిడ్డ గురించి కూడా నేను ఆలోచించాను.. అందుకే ఒక తల్లి మనసును అర్థం చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను అని అనటంతో సునంద ఆమె మాటలకు కాస్త ఆశ్చర్యపోతున్నట్టు కనిపిస్తుంది.
దాంతో సునంద అసలు విషయం అడగటంతో భవాని గౌరీని ఈశ్వర్ కి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాను అని అంటుంది. ఇక సునంద నిజమా అని ఆశ్చర్య పోతుంది. సంతోషంలో కనిపిస్తుంది. వెంటనే భవాన్ని నీ చిన్న కొడుకు కు నా చిన్న కూతురు ఇస్తేనే ఈ పెళ్లి చేస్తాను అని అనటంతో సునంద షాక్ అవుతుంది. ఇక భవాని తన చిన్న కూతురుని ఎలాగైనా మీ ఇంటి కోడలుగా చేసుకోవాలి అని.. ఎందుకంటే చిన్నప్పటినుంచి గౌరీ తన చెల్లెల్ని కన్న బిడ్డ లాగా.. అటువంటి గౌరీ దూరమైతే తన బిడ్డ ఉండలేదు కొన్ని కథలు అల్లి సునందను అయోమయంలో పెట్టేస్తుంది.
అలా అయితేనే పెళ్లికి ఒప్పుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తుంది భవాని. దాంతో సునంద ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంది. ఆ తర్వాత భవాని గౌరీ దగ్గరికి వెళ్లి ఈశ్వర్ ను పెళ్లి చేసుకోమని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తనను గతంలో అన్న మాటలను క్షమించమని కోరుతుంది. దాంతో గౌరీ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయి తనతో ఈశ్వర్, సునంద, భవాని మాట్లాడిన మాటలు తలుచుకుంటుంది.
మరోవైపు సునంద కూడా భవాని మాటలు తలుచుకొని అయోమయ పరిస్థితిలో కనిపిస్తుంది. తన కొడుకుని బాధపెట్టాలేమో అని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఈశ్వర్ తల్లికి థాంక్స్ చెప్పుకుంటూ గౌరీ గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. తను లేకుంటే ఉండలేను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకు సునంద జరగబోయే దాని గురించి తెలుసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడే ఇంట్లో వాళ్ళు వచ్చి ఈశ్వర్ బర్త్ డే విష్ చేస్తారు. రేపు బర్త్డే కాకుండా పెళ్లి ఫిక్స్ చేసే డే ఉందని కుటుంబ సభ్యులు చెప్పుకొని బాగా సంతోషపడతారు. కానీ సునంద మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత ఈశ్వర్ గౌరీ తో గడిపిన క్షణాలను తలుచుకుంటాడు. అప్పుడే ఆదిత్య తన గర్ల్ ఫ్రెండ్ తో రేపు ఇంట్లో తమ విషయం కూడా చెప్పాలి అనడంతో ఆ మాటలు విని ఈశ్వర్ ఆనంద్ దగ్గరికి వెళ్తాడు. ఈశ్వర్ తన తమ్ముడు ప్రేమలో ఉన్నాడని తన తమ్ముడి మాటల ద్వారా తెలుసుకొని సంతోషపడతాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial