వేద అమ్మ తనకి గొప్పదని ఖుషి అనేసరికి మాళవిక కోపంగా నోర్ముయ్ అని తనని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతుంది. వేద వచ్చి చేతిని పట్టుకుని ఆపుతుంది. అప్పుడే ఆదిత్య వచ్చి చూస్తాడు.


వేద: నా కూతురి మీద చెయ్యి ఎత్తుతావా? ఏం చేయమంటావ్ ఆ చేతిని ముక్కలు ముక్కలుగా నరికేయమంటావా? నువ్వు ఇప్పటికే చాలా హద్దులు మీరావు. ఒక కోడలిగా ఓపిక పట్టాను కానీ తల్లిగా అసలు సహించను. అసలు నువ్వు ఏం ఆడదానివి ఆయనకి దగ్గర అవాలనా? ఆయనకి నువ్వంటే అసహ్యం. ఇంట్లో వాళ్ళకి దగ్గర అవాలని చూస్తున్నావా? వాళ్ళకి కూడ నువ్వంటే అసహ్యం. నువ్వు ఇక్కడికి రావడానికి అందరి ఇష్టానికి వ్యతిరేకంగా ఉండటానికి కారణం నేను ఆ విషయం మర్చిపోవద్దు.


ఆదిత్య వెంటనే మాళవికని తీసుకుని వెళతాడు. మాళవికని ఈ ఇంట్లో నుంచి పంపించే రోజు దగ్గర పడిందని వేద అనుకుంటుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉంటే మాలిని, సులోచన వచ్చి ఏమైందని అడుగుతారు. మాళవిక ఉంది కదా ఏదో గొడవ పెట్టి ఉంటుందని సులోచన అంటుంది.


మాలిని: నీకు ముందే చెప్పాను కదా వేద ఆదిత్య కోసం కాస్త ఓపిక పట్టమని


వేద: చెప్పారు కానీ సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఖుషిని కొట్టే హక్కు ఎవరిచ్చారు


Also Read: అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోమని తండ్రికి సలహా ఇచ్చిన దివ్య- నందు బర్త్ డే పార్టీలో లాస్య రచ్చ రచ్చ


సులోచన: మీకు చాలా విషయాలు తెలియవు. చెప్తే మీరు ఏమనుకుంటారోనని చెప్పకుండా దాచింది


మాలిని: నువ్వు నా దగ్గర దాచావా? ఈ ఇంట్లో హక్కు అంటూ ఉందంటే అది. నీకే మాళవికకి ఏం ఉంది హక్కు? నువ్వు దయ తలిచి తీసుకురాబట్టే ఇంట్లో ఉంటుంది లేదంటే తనని పట్టించుకునే వాళ్ళు లేరు


వేద: ఆదిత్య చిన్న పిల్లాడు మనం చెప్పేది నిజమని అనుకుంటాడు. కన్న కొడుకు మనసులో నా మీద విషం నింపుతుంది. నా స్థానాన్ని లాక్కుంటానని నాతోనే ఛాలెంజ్ చేసింది


మాలిని: ఎక్కడుంది ఆ మాళవిక దాని తల పగలగొట్టేసి ముక్కలు ముక్కలు చేస్తాను


వేద: ఆగండి ఇలా ఆవేశపడతారని మీకు చెప్పలేదు


మాలిని: దాన్ని ఈ ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాలి


వసంత్ కి గీత ఫోన్ చేస్తుంది. చిత్ర ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కాల్ చేసింది అబ్బాయి అన్నట్టు వసంత్ మాట్లాడతాడు. ఫోన్ చేసింది అమ్మాయి కదా అబ్బాయి అన్నట్టు మాట్లాడతాడు ఏంటని చిత్ర అనుకుంటుంది. ఇదే విషయం అడిగితే కవర్ చేసి బయటకి వెళ్ళిపోతాడు. వసంత్ మాటలు గుర్తు చేసుకుని ఏదో తేడాగా ఉందని అనుకుంటుంది. ఆరోజు ఇలాగే చేశాడు, ఈరోజు అమ్మాయిని అబ్బాయిని చేశాడు. ఏదో ఉంది ఏదో జరుగుతుందని చిత్ర అనుమానపడుతుంది.


Also Read: 'సాటి మనిషి' అంటూ రాజ్ తిక్క కుదిర్చిన కావ్య- వైరల్ గా మారిన స్వప్న యాడ్


సులోచన, మాలిని గార్డెన్ లో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తారు. అటుగా వెళ్తున్న మాళవిక మీద ముసుగు వేసి కుమ్మెస్తారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉన్నారు మరి నన్ను ఎవరు కొట్టారని మాళవికకి డౌట్ వస్తుంది. వాళ్ళ దగ్గరకి వెళ్ళి తనని ఎవరో కొడుతున్నారని అంటుంది. తమకేమి తెలియదని బుకాయిస్తారు. నొప్పులతో బాధపడుతుంటే ఏమైందని వేద అడుగుతుంది. బాత్ రూమ్ లో జారీ పడ్డానని అబద్ధం చెప్తుంది. సులోచన, మాలిని వచ్చి ఏమైంది అలా ఉన్నావని అడుగుతారు. మీరే కొట్టారని మాళవిక అంటుంది. పెట్టింది తిని ఒక మూలన పడి ఉంటే నాలుగు రోజులు ఇంట్లో ఉంటావ్ లేదంటే ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాల్సి వస్తదని మాలిని వార్నింగ్ ఇస్తుంది.


నీలాంబరిని ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాలని భ్రమరాంబిక అభి వాళ్ళతో చెప్తుంది. ఇక నీలాంబరిని పిలిచి హాస్పిటల్ కి వెళ్దామని అంటుంది. కాసేపటికి మళ్ళీ చంద్రముఖి పూని నీలాంబరి, అభి, ఖైలాష్ ని వాయించేస్తుంది. వేద రత్నం 60వ పుట్టినరోజని యష్ కి గుర్తు చేస్తుంది. షష్టి పూర్తి చేయాలని మాట్లాడుకోవడం విని ఖుషి కూడా సంతోషపడుతుంది. ఖుషి సంతోషంగా వచ్చి తాతయ్యకి విసెష్ చెప్తుంది. ఇక యష్, వేద వచ్చి షష్టి పూర్తి చేయాలని చెప్తారు.