Krishnamma kalipindi iddarini July 26th: గౌరీ చేసిన వంటలు అందరికీ నచ్చటంతో అందరూ గౌరీని పొగుడుతూ ఉంటారు. పైగా ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్లకి తయారు చేయడంతో అందరు ఫిదా అవుతారు. ఇక తనను మరింత పోగడటంతో అఖిల తట్టుకోలేక పోతుంది. ఇక భార్య భర్తల మధ్య ప్రేమ ఇలాగే ఉంటుంది అంటూ గౌరీ ఈశ్వర్ పై చూపిస్తున్న ప్రేమ గురించి కూడా చెబుతూ పొగుడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు.


అఖిల కు మాత్రం బాగా మండిపోతూ ఉంటుంది. వెంటనే వనజ నీకు వంటలు చేయటం వచ్చు కదా అని అఖిలను అనడంతోమా అక్క కంటే బాగా చేస్తాను అని డప్పు కొట్టుకుంటుంది. దాంతో రేపు నువ్వే చేయాలి అని అనటంతో ఇరికిపోయాను అని అనుకుంటుంది అఖిల. అందరు భోజనాలు చేసిన తర్వాత ఈశ్వర్ గౌరీ తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ నచ్చిన ఫుడ్ చేయటంతో అందరు తనను మెచ్చుకోవటం తనకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు.


గౌరీ మీద ఉన్న ప్రేమను మరింత చూపిస్తూ ఉంటాడు. ఇక ఈశ్వర్ మాటలకు గౌరీ ఫిదా అవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. సునంద పూజారి కి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. వనజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ అని అడుగుతుంది. కొడుకు కోడలు లేచారో లేదో అని తెగ హడావుడిగా అక్కడినుండి వెళ్ళిపోతుంది.


సునందను అంత హడావిడిలో చూసిన సౌధామిని.. ఇప్పుడు జరగబోయేది వ్రతం కాదు పెద్ద బీభత్సం అని అనుకుంటుంది. ఆదిత్య ప్రేమ గురించి ఈశ్వర్ కు నిజం చెప్తాను అని.. సాక్షాల ద్వారా బయట పెడతాను అని  అప్పుడు ఈశ్వర్ గట్టిగా నిలదీస్తాడు అని అనుకుంటుంది. ఇక ఈశ్వర్ కు స్నానం చేయించి తల తుడిచి పొగ పెడుతుంది గౌరీ. ఆ సమయంలో ఈశ్వర్ కంట్లో నలుక పడటంతో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.


ఇక అక్కడి నుంచి గౌరీ ఏదో తీసుకొని రావటానికి 
వెళ్లబోతుండగా కాలుజారి ఈశ్వర్ పై పడుతుంది. అలా వారి మధ్య కాస్త రొమాంటిక్గా అనిపిస్తుంది. ఆ తర్వాత గౌరీ లేచాక ఈశ్వర్ డల్లుగా కనిపిస్తాడు. ఏం జరిగింది అని గౌరీ అనడంతో.. తను ఏది అనుకున్న కూడా అది కచ్చితంగా తీరేది అని.. అంత బాగున్న సమయంలో కళ్ళు పోయాయి అని.. ఆ సమయంలో పెళ్లి గురించి కూడా చాలా అవమానపడ్డాను అని అంటాడు.


నువ్వు నన్ను ఎప్పటికీ దూరం చేసుకోవు కదా.. నాతో ఎప్పుడూ ఇలాగే కలిసి ఉంటావు కదా అనడంతో.. నా ప్రాణం పోయేంతవరకు మిమ్మల్ని వదలను అని అంటుంది గౌరీ. మరోవైపు ఆదిత్య పూజకు రెడీ అవుతాడు. గాఢ నిద్రలో ఉన్న అఖిలకు సునంద నిద్ర లేపుతున్నట్లు కల వస్తుంది. వెంటనే లేచి ఆదిత్య పై అరుస్తుంది. తనను ఎందుకు లేపలేదు అని అంటుంది. వెంటనే ఆదిత్య లేపినా కూడా నువ్వు లేవలేదు అని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక త్వరగా స్నానం చేసి రెడీ అవ్వాలి అని అఖిల వాష్ రూమ్ కి వెళ్తుంది. ఎవరు లేనిది చూసి సౌదామిని ఇంట్లో ఆదిత్య, అమృతలకు సంబంధించిన ఏవైనా సాక్షాలు దొరుకుతాయేమో అని గదంతా వెతుకగా అక్కడ ఒక ఫోటో, లెటర్ దొరుకుతుంది.


also read it : Prema Entha Madhuram July 26th : ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: మాన్సీకి చుక్కలు చూపిస్తున్న సత్తెమ్మ, గోపి ముందు నోరు జారిన రేష్మ?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial