వేద యష్ మీద చిర్రుబుర్రులాడుతుంది. కడుపుతో ఉన్న భార్యని జాగ్రత్తగా చూసుకోవాలని యష్ వేద ఇక మీదట క్లినిక్ కి రాదని చెప్తాడు. విషయం తెలిసి వేద భర్త మీద కస్సుబుస్సులాడుతుంది. మనసులో ఉన్నదే చేశాను.. నీకు ఏమైనా అయితే తట్టుకోలేను అందుకే ఆ పని చేసినట్టు చెప్తాడు. తనని, తన  యాక్టివిటీస్ అన్నింటినీ కబ్జా చేస్తున్నారని వేద బుంగమూతి పెడుతుంది. ఇక భార్యని ప్రేమగా దగ్గరకి తీసుకుని నచ్చజెప్తాడు. ఇక వియ్యపురాళ్ళు మాలిని, సులోచన సోది వాగుడుకి దిగుతారు. ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా వేద వచ్చి సర్ది చెప్తుంది. వేద ఇంట్లోనే ఉంది ఏంటా అని సులోచన డౌట్ పడుతుంది.


మాలిని: నీకు తెలియదా? వేదకి బేబీ వైరస్ వచ్చింది


సులోచన: అదేంటి? దీన్ని ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుని గూగుల్ లో సెర్చ్ చేద్దామని అనుకుంటారు. కానీ మళ్ళీ అదంతా ఎందుకు నేరుగా వెళ్ళి డాక్టర్ ని కనుక్కుంటే సరిపోతుందని డిసైడ్ అవుతారు. వెంటనే డాక్టర్ దగ్గరకి ఇద్దరూ వెళతారు. బేబీ వైరస్ ఏంటని డాక్టర్ ని అడుగుతారు.


Also Read: అపర్ణ అహంకారం, కళావతిని వెలివేసిన కుటుంబం- కావ్య బ్యాగ్ పట్టుకుని రాజ్ ఎంట్రీ


డాక్టర్: వేద ఇప్పుడు ప్రెగ్నెంట్.. కానీ తన గర్భసంచి వీక్ గా ఉంది. చాలా కేర్ తీసుకోవాలి


మంచి వార్త చెప్పారని చెప్పి ఇద్దరూ వియ్యపురాళ్ళు తెగ సంతోషపడతారు. ఈ విషయం మనకి తెలిసినట్టు అసలు బయట కూడదని అనుకుంటారు. వేద కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అనుకుంటారు. ఇద్దరూ చెరొక పూట వంట చేయాలని నిర్ణయించుకుంటారు. చిత్రకి వసంత్ కారు డ్రైవింగ్ నేర్పిస్తాడు. తనకి డ్రైవింగ్ రాదని భయపడుతుంటే వసంత్ ధైర్యం చెప్తాడు. వేద కష్టపడకూడదని యష్ కిచెన్ లోకి అడుగుపెడతాడు. భయంకరమైన చపాతీలు చేస్తాడు. ఇక మాలిని, సులోచన కావాలని వేద ముందు అదేంటో బేబీ వైరస్ అంట అని ఏమి తెలియనట్టు మాట్లాడుకుంటారు. యష్ చేసిన చపాతీలు ఖుషి ఇంట్లో వాళ్ళందరికీ చూపించి పరువు తీస్తుంది. అందరూ కలిసి కాసేపు యష్ ని ఆట పట్టిస్తారు.


Also Read: స్టైల్ మార్చి తల్లికి షాకిచ్చిన విక్రమ్- మాజీ భార్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిన నందు


తాను చేసిన వంట ఆమోఘంగా ఉంటుందని చెప్పి అందరికీ వడ్డిస్తాడు. అందరూ దాన్ని టేస్ట్ చేసి మొహం వికారంగా పెట్టేస్తారు. వేద యష్ ని మెల్లగా పిలిచి కూరల్లో ఉప్పు, కారం ఏమి లేవని చెప్తుంది. చపాతీలు కూడా నూనె లేకుండా కాల్చారని అంటుంది. ఇవాళ్టికి ఎలాగోకలా అడ్జస్ట్ అయితే రేపు కొత్తగా ట్రై చేస్తానని అనేసరికి ఇంట్లో అందరూ పారిపోతారు. ఇక మీరు చేసిన వంట మీరు తిని చూడండి అని వేద అంటుంది. అది నోట్లో పెట్టుకోగానే యష్ కి వామిట్ వచ్చినంత పని అవుతుంది. వేదని ఒక్క పని కూడా చేయనివ్వకుండా యష్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వంట గదిలోకి వెళ్లకూడదు, వంటతో ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని వేద యష్ కి చెప్తుంది. బిడ్డ కోసం ఎంత తపన పడుతున్నారు, నాకోసం కాకపోయినా తన కోసమైన బిడ్డని కాపాడమని వేద మనసులోనే దేవుడిని మొక్కుకుంటుంది.