Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode పిల్లలు హనుమంతుడ్ని పిలిచి తమ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యావని ఆంజనేయుడికి స్వీట్స్ ఇస్తారు. స్వామి స్వీట్స్ వద్దని ఇద్దరి చేతి ముద్దులు పెట్టించుకుంటారు. తమ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. సంతోషం వస్తే ఆనందపడినప్పుడు కష్టాలు వస్తే కృంగిపోవద్దని చెప్పి ఆంజనేయ స్వామి వెళ్లిపోతారు. స్వామి అలా చెప్పారేంటి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయా అని పిల్లలు అనుకుంటారు.
రాత్రి జాను గదిలో ఉంటే వివేక్ వెనకాలే వెళ్లి హగ్ చేసుకుంటాడు. ఇంతలో దేవయాని డోర్ కొడుతుంది. ఏంటి మామ్ అని అడిగితే ఏంట్రా అంత చిరాకు పడుతున్నావ్ లోపల అదేం చేస్తుంది అని అంటుంది. దానికి జాను అత్తగారు ఇది నా రూమ్‌కూడా అని అంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చారని పొగరుగా ఉంటుంది జాను.
దేవయాని: ఇవి చెడ్డ రోజులు.
జాను: అది ప్రత్యేకంగా చెప్పాలా
దేవయాని: చెప్పేది వింటావా. నీకు ఎలాగూ అమ్మానాన్నలు లేరు ఇవి భార్యభర్తలు కలుసుకునే రోజులు కావు కొద్ది రోజులు కావు.
వివేక్: ఎవరు చెప్తారు మామ్.
దేవయాని: నేను చెప్తున్నా
జాను: ఆవిడ ఈ మధ్య జాతకాలు ముహూర్తాలు చెప్తున్నారా.
దేవయాని: ఈ పొగరే తగ్గించుకుంటే మంచిది మర్యాదగా బయటకు రా.
జాను: నేను ఎందుకు రావాలి ఏవండీ మీరు దిండు దుప్పటి తీసుకొని వెళ్లండి.
దేవయాని: నాకొడుకు ఎక్కడికి వెళ్తాడే
జాను: మీరే కదా మేం కలిసి పడుకోవద్దు అంటున్నారు. నేను ఎక్కడికీ వెళ్లను. నేను ఈ ఇంటి కోడలిని పైగా మా అక్క ఛైర్మన్.
దేవయాని: అదా నీ పొగరు. నువ్వురా ఫస్ట్ నా పక్కన పడుకో.
జాను: మీ పక్కన. నా పక్కన మీరు పడుకుంటారో లేదో
దేవయాని: నాకు ఏం ప్రాబ్లమ్ లేదురా.
జాను: సరే సరే.
మనీషా: నువ్వు దురదృష్ట లక్ష్మీ అని దేవయాని ఆంటీ చెప్తే నిజమనుకున్నా కానీ నువ్వు అదృష్ట లక్ష్మీవే. అర్హత లేకపోయినా అందలం ఎక్కబోతున్నావ్.
లక్ష్మీ: మరొక్క సారి ఆ మాట అంటే చెప్పు తెగుతుంది. నా గురించి ఏం తెలుసు నీకు ఈ ఛైర్మన్ పదవి పెద్దది అనుకుంటున్నావా. జేఎమ్మార్ కంపెనీలో సీఈవోగా పని చేసిన దాన్ని.
మనీషా: ఆయన నీకు ఆ పదవి నీ టాలెంట్ చూసి ఇవ్వలే తన కూతిరిలా ఉండే నీ రూపం చూసి ఇచ్చారు. సరయు నిన్ను వదలదు
లక్ష్మీ: దానికి అంత సీన్ లేదు. నీ వాలకం చూస్తుంటే నువ్వే ఆ సరయు వెనక ఉండి నడిపిస్తున్నట్లుంది.
మనీషా: నాకు అంత అవసరం ఏంటి అది ఎవరో కూడా నాకు తెలీదు
లక్ష్మీ: తేల్చుతా వన్ బై వన్ తేల్చుతా.
మనీషా: త్వరలో నీ లెక్కలు మిత్ర తేల్చుతాడు. నువ్వు ఆయనకు మాజీ భార్య అవుతావు నేను భార్య అవుతా.
లక్ష్మీ: ఎక్కువ కలలు కనకు మనీషా ఈ కంపెనీ నాదే కుటుంబంనాదే మిత్ర కూడా నావాడే.
మనీషా: అదీ చూద్దాం అదృష్టంతో ఎన్నో రోజులు నెట్టుకురాలేవు.
లక్ష్మీ: మోసంతో గెలవాలి అనుకున్న నీ లాంటి వాళ్లే మునిగిపోతారు. పొద్దు పోయింది వెళ్లి నిద్రపో.
అరవింద, జయదేవ్ చాటుగా విని మనీషాకి లక్ష్మీ సరిగ్గా బుద్ధి చెప్పిందని అనుకుంటారు. నా వల్ల మనీషా దగ్గర లక్ష్మీ తగ్గిపోతుంది. లేదంటే ఎప్పుడో మిత్రకు నిజం చెప్పి సంతోషంగా ఉండేది. లక్ష్మీకి నువ్వు అడ్డు కాదు అండ. లక్ష్మీకి మనం సింహాసనం మీద కూర్చొపెట్టాం అది వజ్రాల సింహాసనం అవుతుందో ముళ్ల సింహాసనం అవుతుందో చూడాలి. మరోవైపు జాను, దేవయాని ఒకే బెడ్ మీద పడుకుంటారు. జాను అత్త మీద కాళ్లు, చేతులు వేసి దేవయానిని తెగ ఇబ్బంది పెడుతుంది. దేవయాని ఎంత జరుగుతుంటే అంత దగ్గరకు వెళ్లి మీద కాళ్లు చేతులు వేసేసి గట్టిగా పట్టేస్తుంది.
బెడ్ మీద అన్ని వైపులా తిరిగి తిరిగి చివరకు అత్తని తన్నేస్తుంది. నడుం విరిగిపోయిందని దేవయాని అరుస్తుంది. జాను లేచి నాకు తెలీదని మంచి నిద్రలో ఉన్నానని అంటుంది. దేవయాని జానుని కింద పడుకోమని అంటే నాకు కింద పడుకునే అలవాటు లేదని జాను అంటుంది. దేవయానినే కింద పడుకోమని జాను చెప్తుంది. దానికి దేవయాని నేను నీ పక్కన పడుకోలేను అలా అని నిన్ను బయటకు పంపలేను అనుకొని కింద పడుకుంటుంది. నన్నే కింద పడుకో బెడతావా నీ లాంటి తిక్క కోడలు ఎవరికీ రాకూడదని అనుకుంటుంది. అత్త తిక్క కుదిర్చానని జాను అనుకుంటుంది.
ఉదయం లక్ష్మీ లక్కీని రెడీ చేస్తుంది. ఇక పిల్లలు మిత్రతో కలిసి లక్ష్మీని ఆఫీస్‌కి వెళ్లమని చెప్పి మా ఫ్రెండ్ మమల్ని డ్రాప్ చేస్తాడని అంటారు. దానికి లక్ష్మీ ఎవరు మీ ఫ్రెండ్ అంటే ఆయన మనిషి కాదు అంటారు. అయితే మీ ఫ్రెండ్ దేవుడా అంటే అవునని అంటారు. ఇద్దరూ బ్యాగ్‌లు వేసుకొని బయటకు వస్తే ఆంజనేయస్వామి పక్కన ఉంటారు. స్వామిని చూసి పరుగున వెళ్తారు. మనసులో తలచుకుంటే వచ్చేస్తా అని స్వామి అంటే ఇద్దరూ ఆంజనేయుడ్ని హగ్ చేసుకుంటారు. నీ వల్లే మా అమ్మ సంతోషంగా ఉందని ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తున్నారని పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటారు. వాళ్లని చూసి స్వామి కనీళ్లు పెట్టుకొని మిమల్ని చూస్తుంటే లవకుశులు గుర్తొస్తున్నారని చెప్తారు. ఇక స్కూల్‌కి తీసుకెళ్లమని అడుగుతారు. ఆంజనేయ స్వామి ఒకే అంటాడు. ఇక మిత్ర ఆఫీస్‌కి రెడీ అవుతాడు. మనీషా చూసి ఎక్కడికి అని అడుగుతుంది. ఆఫీస్‌కి అని మిత్ర చెప్తే షాక్ అవుతుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!