Brahmamudi Serial Today Episode: ఇంట్లో వాళ్లందరూ రాజ్‌ను రౌండప్ చేసి కన్వీన్స్ చేయాలని చూస్తారు. పెళ్లానికి భయపడి ఇంటికే పరిమితమైన దుగ్గిరాల వారసుడు అని లోకం కోడై కూస్తుందిరా అంటుంది ఇందిరాదేవి. లేదు అంటే కావ్యకు ఉన్న తెలివితేటల ముందు నువ్వు ఎందుకు కొరగావని ఆఫీసులో అందరూ అనుకుంటారు అని అపర్ణ చెప్పగానే..
ప్రకాష్: ఆఫీలోనే కాదు వదిన బయట కూడా తెలిసిపోయింది. నాకు తెగ ఫోన్లు వస్తున్నాయి. మీ అబ్బాయి సమర్థుడు కాడా..? మీ కోడలును రంగంలోకి దింపారా అని అడుగుతున్నారు.
అపర్ణ: నిజం చెప్పు కావ్య అంటే భయపడుతున్నావా..?
ఇందిర: కావ్య ముందు ఓడిపోతాననుకుంటున్నావు కదా?
ప్రకాష్: నువ్వేంటో నిరూపించుకోలేవా..?
స్వప్న: రాహుల్ లా ఎప్పటికీ ఇంట్లోనే ఉంటావా..?
అంటూ అందరూ ఏదేదో అంటుంటే రాజ్ కోపంగా ఆపండి అని అందర్ని తిట్టి.. నన్ను పిరికివాడు అనుకుంటున్నారా..? నేను ఆ కళావతికి భయపడేవాణ్నా అంటూ నేను తలుచుకుంటే ఆ కళావతి సీఈవోగా పనికిరాదని ఫ్రూవ్ చేయడానికి నాకు పది నిమిషాలు చాలు అంటాడు రాజ్. మళ్లీ అందరూ తిట్టగానే రాజ్ ఆఫీసకు వెళ్తానని చెప్పి వెళ్లిపోతాడు. అంతా పై నుంచి విన్న రాహుల్ భయంతో లోపలికి రుద్రాణి దగ్గరకు వెళ్తాడు.
రాహుల్: మామ్ అక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా మేకప్ వేసుకుంటున్నావేంటి?
రుద్రాణి: నేనేం అంత మేకప్ అవ్వడం లేదురా.. లేట్ గా టచ్ అప్ అవుతున్నాను అంతే.
రాహుల్: సీరియస్ మ్యాటర్ వదిలేసి మేకప్ గురించి మాట్లాడతావేంటి మామ్.
రుద్రాణి: ఇప్పుడు ఏమైందని అంతలా మాట్లాడుతున్నావు.
రాహుల్: అందరూ కలిసి ఆ రాజ్‌ను ఒప్పించి ఆఫీసుకు పంపిస్తున్నారు.
రుద్రాణి: వాట్ రాజ్ ఆఫీసుకు వెళ్లడానికి ఒప్పుకున్నాడా..? అది కూడా మేనేజర్ గా..
రాహుల్: ఒప్పుకోలేదు. వాడి ఈగోను రెచ్చగొట్టి మరి ఒప్పించారు.
అని రాహుల్ చెప్పగానే మనం చూస్తూ ఊరుకుంటామా..? అని మేనేజర్‌కు ఫోన్ చేసి అక్కడ జరిగే విషయాలు తెలుసుకో అనగానే రాహుల్ ఫోన్ చేస్తాడు. మేనేజర్ తనను కావ్య సెక్యూరిటీ గార్డుగా చేసిందని చెప్పగానే రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత రాజ్ ఆఫీసుకు వెళ్తాడు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఉన్న మేనేజర్ ను చూసి ఆవేశపడతాడు. ఈ అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేరనా నేనున్నాను అంటూ కావ్య రూంలోకి వెళ్తారు.
రాజ్: ఏంటీ అన్యాయం.. ఎందుకింత అమానుషం.. ఎందుకిత కసి నీకు. మేనేజర్ ని ఇలా ఇబ్బంది పెడతావా? ఈ అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లే లేరనుకున్నావా..?
కావ్య: మిమ్మల్ని కూడా ఎండీ పోస్టులోంచి పీకేసీ మేనేజర్ పోస్టలో వేశాం. మీరు మళ్లీ ఆఫీసుకు వచ్చారు కదా?
అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటే.. ఇంతలో అతిన మేనేజర్ పోస్ట్ అతనికి ఇస్తాను.. మీరు వెళ్లి సెక్యూరిటీ గార్డుగా నిలబడండి అని కావ్య చెప్పగానే రాజ్ ఏయ్ నువ్వు సెక్యూరిటీ గార్డు కదా? ఇక్కడ నిలబడ్డావెందుకు వెళ్లి గేటు దగ్గర నిల్చోమని చెప్తాడు. రాజ్ మాట మార్చడంతో సెక్యూరిటీ గార్డు భయంతో వెళ్లిపోతాడు. ఇంతలో శృతి వచ్చి క్లయింట్స్ వచ్చారని చెప్పడంతో మీటింగ్ హాల్ లోకి వెళ్తారు రాజ్, కావ్య. మీటింగ్‌లో క్లయింట్స్ అందరూ వెళ్లిపోతారు.
రాజ్: శభాష్.. చాలానే సాధించావు. పిలిచి మరీ కంపెనీని అవమానించావు. ఇప్పుడు అర్థం అయిందా..? నువ్వేంటో నీ స్థానం ఏంటో.. ఇది బొమ్మలకు రంగులు వేసినంత ఈజీ కాదు. కోట్లలో వ్యాపారం.
కావ్య: మీ కోపం నా మీద కంపెనీ మీద కాదు. వాళ్ల కోపం కంపెనీ మేనేజ్‌మెంట్ మీద. నా మీద కాదు. చెప్పినా వినకుండా రాహుల్ లాంటి ఒక అసమర్థుడిని సీట్లో కూర్చోబెట్టారు. ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా.. పిచ్చోడి చేతిలో రాయిలా మారి కంపెనీ పేరు ప్రతిష్టలు పోగొట్టాడు. చూడండి అవమానం మీది. ఈ కంపెనీది. దుగ్గిరాల కుటుంబానికి.
అని కావ్య చెప్తుండగానే.. రాజ్ వెళ్లిపోతాడు. కావ్య ఆలోచిస్తుంది.. శృతి వచ్చి అరవింద్ వచ్చాడని చెప్తుంది. నా కేబిన్‌లో కూర్చోబెట్టు వస్తున్నాను అని చెప్తుంది కావ్య.
కావ్య: చెప్పండి అరవింద్ గారు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు.
అరవింద్: మీ కంపెనీతో నేను పదేళ్ల నుంచి పని చేస్తున్నాను. మధ్యలో నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నా కంపెనీ డెబ్ సీట్లోకి వెళ్లింది. ఇప్పుడు నా కంపెనీని వేలం వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వేళానికి వెళ్లినా నా ఇల్లు అమ్మినా నా అప్పు కట్టలేం.
కావ్య: మీ పరిస్థితి అర్థం అయింది. కానీ ఇందలో మా కంపనీ నుంచి మీరు ఎలాంటి సాయం ఎక్స్‌ఫర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు.
అరవింద్: దయచేసి మీ కంపెనీ నా కంపెనీని టేకోవర్ చేస్తే నాకు హెల్ప్ అవుద్ది. మీ కంపెనీ అయితే ఈజీగా టేకోవర్ చేయగలదు.
అని చెప్పగానే కావ్య ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో శృతి రాగానే రాజ్ సార్‌ను నా క్యాబిన్ లోకి రమ్మను అని చెప్తుంది. శృతి వెళ్లి రాజ్‌ను భయపెట్టి కావ్య క్యాబిన్ లోకి తీసుకెళ్తుంది. అరవింద్ వెళ్లిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!