Ammayi garu Serial Today Episode పింకీ జీవన్‌ని పెళ్లి చేసుకుందని రాజు విరూపాక్షితో పాటు తల్లిదండ్రులకు చెప్తాడు. జీవన్ ఎంత చెడ్డొడో తెలిసి పింకి పెళ్లి చేసుకోవడం ఏంటి వాడు వల్ల పింకీ జీవితం నాశనం అయిపోతుందని అంటారు. దానికి రాజు పగతోనే చేసుకున్నాడని చెప్తాడు. ఇక విరూపాక్షి కూడా సూర్యకి పింకీ అంటే చాలా ఇష్టం అని సూర్య తట్టుకోలేడని చెప్తుంది.


విరూపాక్షి: సుమ చంద్రల కంటే ముందు సూర్యనే కృంగిపోతా డు.
రాజు: అమ్మగారు పింకీ జీవితానికి ఏం కాదు వాడికి పింకీ మీది ఏం కోపం లేదు వాడి కోపం అంతా పెద్దయ్య గారి మీద వాడి చెల్లి జీవితానికి అడ్డు పడింది అని అమ్మాయి గారి మీద నా మీద. అందుకే ఇలా చేశాడు.
ముత్యాలు: అయ్యా వాడు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ల మీద పగ తీర్చుకోడు నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా నువ్వే కాపాడాలి  పింకీని. అసలు పింకికీ జీవన్‌కి ఎక్కడ పరిచయం. 
విరూపాక్షి: పింకీ ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంటుంది అది తెలుసుకోవాలి.
రాజు: అది ఏంటో తెలుసుకోవాలి అంటే పింకీనే చెప్పాలి.


హారతి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. నా బతుకు ఏంటో నాకే అర్థం కావడం లేదు నా బిడ్డ భవిష్యత్‌ అర్థం కావడం లేదని ఏడుస్తుంది. బాబు పుడితే తండ్రిలా దీపక్‌లా అయిపోతుందని పాప పుడితే నాలా అన్యాయం అయిపోతుంది పాపకూడా వద్దని అనుకుంటూ బాధ పడుతుంది. ఇంతలో దీపక్ వస్తే ఏంటి దీపక్ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని ఏడుస్తుంది. దీపక్ హారతితో రాజకీయంగా కలిసివస్తుందని అనుకుంటే అది మిస్ అయిందని అంటాడు. నెలలు నిండిపోతున్నా నువ్వు రావడం లేదని ఇప్పుడు వెళ్లిపోతే మళ్లీ ఎప్పుడు వస్తావో తెలీదు అని తనని ఇప్పుడే పెళ్లి చేసుకోమని అంటుంది. మీ మామయ్యతో మాట్లాడే ధైర్యం నీకు లేకపోతే నేను చెప్తా అంటుంది. దానికి దీపక్ కన్విస్స్ చేస్తాడు దానికి హారతి ఒక్క రోజు గడువు ఇస్తుంది. దీపక్ మనసులో వెంటనే తల్లికి ఈ విషయం చెప్పి హారతిని ఆర్పేయాలి అనుకుంటాడు.


మరోవైపు పింకి తన దుస్థితి తలచు కొని ఏడుస్తుంది. జీవన్ తన పెద్దనాన్నని ఏం చేస్తాడా అని బాధ పడుతుంది. నువ్వే దారి చూపించాలి తండ్రి అప్పటి వరకు నోరు తెరవను అని అనుకుంటుంది. ఇంతలో రూప అక్కడికి వచ్చి ఏమైంది పింకీ నాకు చెప్పకూడదని అనుకుంటున్నావా అని పెళ్లి గురించి అడుగుతుంది. ఇంతలో పింకీ జీవన్‌ని చూసి చాలా భయంతో నన్ను ఏం అడగొద్దు అని రూప మీద కోప్పడుతుంది. ఏం జరిగిందో చెప్తే రాజు చూసుకుంటాడు అంటే ఏం అవసరం లేదు అని పింకీ చెప్తుంది. నీ లైఫ్ చూసుకో అక్క రాజుకి నీ ప్రాబ్లమ్స్ పరిష్కరించని చెప్పమని అంటుంది. పింకీ మాటలకు రూప హర్ట్ అయిపోతుంది. మరోవైపు దీపక్ హారతి విషయం తల్లితో చెప్తాడు. ఏదో ఒక సాయం చేయమని అంటాడు.


హారతి నీ గురించి చెప్తే మనల్ని భయటకు గెంటేస్తాడని అంటుంది. దానికి దీపక్ భయటకు గెంటేస్తే పర్లేదు కానీ చంపేస్తాడు అంటాడు. ఇంతలో జీవన్ వచ్చి అంత భయపడాల్సిన పని లేదు అని అంటాడు. హారతిని చంపేద్దామని జీవన్ అంటాడు. అలా కాదు అంటే మీ మామయ్యని లేపేద్దాం అని అంటాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. విజయాంబిక వాళ్లు ఒకే అంటారు. టెంపుల్‌కి తీసుకెళ్లమని అక్కడ మావోయిస్టుల గెటప్‌లో రేణుక, గౌతమ్‌లు ఉంటారని వాళ్లు మీ తమ్ముడిని చంపేస్తారని మనం పారిపోదాం అని అంటాడు. దానికి విజయాంబిక ఓకే అంటుంది. ఇంట్లో అందరూ బాధగా ఉంటే విజయాంబికి అక్కడికి వెళ్తుంది. సూర్యప్రతాప్ బాధ పడుతుంటే సుమ, చంద్రలు పింకీ గురించి ఆలోచించొద్దని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: త్రినయని సీరియల్: నయని చేతిలో బొమ్మ పునర్జనమ్మను చూపిస్తుందా.. రేపే పాపకు ప్రాణ గండం!