Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode వివేక్ జానుని చాటుగా తీసుకెళ్లి పెళ్లి అయిన తర్వాత కూడా ముద్దు ముచ్చట లేదని ముద్దు ఇవ్వమని అడుగుతాడు. జాను వెటకారంగా దానికి కూడా మీ అమ్మ పర్మిషన్ కావాలని అంటుంది. ఇక వివేక్ జానుని ముద్దు పెట్టుకుంటాడు. రాత్రి లక్ష్మీ ఖడ్గం తీసుకొని ఆరు బయట ఆటు ఇటూ తిరగడం జయదేవ్ చూస్తాడు. షాక్ అయిపోతాడు. అరవింద రావడంతో లక్ష్మీని చూపిస్తాడు. అరవింద కూడా షాక్ అవుతుంది. మిత్ర కూడా కత్తి పట్టుకొని తిరగడం చూస్తాడు.
అరవింద: ఈ టైంలో అక్కడేం చేస్తుందండి.
జయదేవ్: ఇంకా నీకు అర్థం కలేదా ఈ కుటుంబాన్ని కాపాడటానికి అలా తిరిగుతుంది. తనని చూస్తుంటే దేశ సరిహద్దుల్లో సైనికుడిలా ఊరి పోలి మేరలో తిరిగే గ్రామ దేవతలా కనిపిస్తుంది.
అరవింద: నిజమే అండీ లక్ష్మీ మన ఇంటికి దేవత మిత్ర ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేస్తున్న దేవత. మిత్ర ఎందుకండీ లక్ష్మీని అపార్థం చేసుకుంటున్నాడు.
రౌడీలు వచ్చి చూసి లక్ష్మీ తిరగడం చూసి ఈ రాత్రికి ఏం చేయలేమని వెళ్లిపోతారు. ఉదయం గుడి దగ్గరకు అమ్మవారి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అందరూ నందన్ వంశ రాక కోసం ఎదురు చూస్తారు. ఇక ఇంట్లో అందరూ రెడీ అవుతారు. అరవింద ఇద్దరు కోడళ్లు లక్ష్మీ ,జానులకు దీపం పెట్టమని అంటుంది. ఇద్దరూ వెళ్తుంటే మనీషా ఆపుతుంది.
మనీషా: దీపాలు నేను వెలిగిస్తా.
అరవింద: ఇంటి కోడల్లే దీపాలు వెలిగించాలి నువ్వు ఎలా వెలిగిస్తావ్ మనీషా.
దేవయాని: తను కాబోయే కోడలు కదా అక్క.
మనీషా: ఈ లక్ష్మీ అడ్డుకోవడం వల్లే నా పెళ్లి జరగలేదు.
అరవింద: ఆ పెళ్లి జరగలేదు కాబట్టే నీకు దీపం పెట్టొద్దు అన్నా. ఇప్పటికి లక్ష్మీనే ఈ ఇంటి కోడలు.
మనీషా: ఏంటి మిత్ర ఇది నన్ను ఇక్కడికి పిలిచి అవమానిస్తారా. అందుకేనా నన్ను ఇక్కడికి రమ్మన్నారు.
మిత్ర: మామ్ దీపాలు ఎవరు వెలిగిస్తే ఏంటి మనీషానే విలిగించనివ్వు.
జయదేవ్: అది కాదు మిత్ర లక్ష్మీ ఉండగా మనీషా ఎలా వెలిగిస్తుంది.
లక్ష్మీ: మామయ్య గారు పర్లేదు దేవుడి కార్యం ఎవరు చేస్తే ఏంటి. మనీషా నువ్వే వెలిగించు. జాను నువ్వు కూడా వెలిగించు. జాను వెళ్లేలోపు మనీషానే రెండు వెలిగించేస్తుంది. అదేంటి మనీషా రెండు దీపాలు నువ్వు వెలిగించావ్ జాను కూడా ఈ ఇంటి కోడలు తాను వెలిగించాలి కదా.
మనీషా: నేను ఏదీ సగం సగం చేయను.
దేవయాని: మంచి పని చేశావ్ మనీషా.
మనీషా: మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఒక దీపం ఆర్పేసి జానుని వెలిగించమనండి నాకు అభ్యంతరం లేదు.
లక్ష్మీ: ఆ మాట ఎలా అంటావ్ మనీషా దీపం ఆర్పడం అంటే ఏంటో తెలుసా నీకు.
అరవింద: అదే తెలిస్తే తను మనతో ఎందుకు ఉంటుంది లక్ష్మీ. మిత్ర కూడా తనకే సపోర్ట్ చేస్తున్నాడు.
మనీషా ఖడ్గం తీసుకోవడానికి వెళ్తే వద్దని అరవింద ఆపుతుంది. దానికి మనీషా ఈ సారి అమ్మవారి పూజ నా చేతుల మీదే జరుగుతుందని అంటుంది. జయదేవ్ మనీషా మీద కోప్పడతాడు. తనకి అర్థమయ్యేలా చెప్పమని మిత్రకు అంటాడు. మిత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. మిత్ర మాత్రం పర్వాలేదు మనీషాని తీసుకురమ్మని అంటుంది. అరవింద మాత్రం ఏంటి పర్వాలేదు అని అంటుంది. మిత్రనే మౌనంగా ఉంటే నేను మాట్లాడి ప్రయోజనం లేదని లక్ష్మీ అంటుంది. మిత్ర మనీషాకి చెప్పబోయే టైంలో మనీషా మిత్ర మనం ప్రేమించుకున్నప్పుడే, నువ్వు నీతో లక్ష్మీకి సంబంధం లేదన్నప్పుడే, మనం పెళ్లి పీటలు ఎక్కినప్పుడే నాకు నీ భార్యగా అన్ని హక్కులు ఉన్నాయని కాదు అంటే ఇప్పుడే వెళ్లిపోతా అంటుంది.
ఇంతలో ఊరి పెద్దలు రావడంతో మనీషా ఖడ్గం తీసుకొని వెళ్లిపోతుంది. అందరూ చూస్తూ ఉండిపోతారు. పెద్ద మనుషులు మాత్రం వంశ కోడలి చేతిలోనే ఖడ్గం ఉండాలని అంటారు. నేను ఇంటి కోడలినే అని మనీషా అంటే మీరు కాదు లక్ష్మీ అమ్మే ఈ ఇంటి కోడలని అంటారు పెద్ద మనుషులు. మిత్ర మీ మెడలో తాళి కట్టలేదు కదా మీరు ఎలా భార్య అవుతారు ఎలా కోడలు అవుతారు అని అంటారు. ఇదంతా ఊరందరికి సంబంధించనదని లక్ష్మీ ఖడ్గం తీసుకొని వస్తే ఓకే లేదంటే జాతర ఆపేస్తామని అంటారు. దాంతో తప్పని పరిస్థితుల్లో మనీషా ఖడ్గం లక్ష్మీకి ఇస్తుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!