Brahmamudi Serial Today Episode: రాజ్‌ దగ్గరకు వచ్చిన కనకం వ్రతంలో కూర్చోవడానికి కావ్యను నువ్వే ఒప్పించాలి బాబు అని చెప్తుంది. మీ కోసం నేను ఇంత వరకు చేశాను. కానీ మీ అమ్మాయిని మాత్రం ఒప్పించలేనని అంటాడు. దీంతో కనకం ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతుంది. దీంతో సరే నేను మీ అమ్మాయిని ఒప్పిస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. రాజ్‌. రాజ్‌కు అపర్ణ, ఇందిరాదేవి ఎదురుగా వస్తారు.


అపర్ణ: రాజ్‌ మీ అత్తగారి ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే గుండె చెరువవుతుందిరా..?


ఇందిర: నీకు చెరువే అవుతుంది అపర్ణ నాకు అయితే సముద్రమే అవుతుంది.


అపర్ణ: దాంపత్య వ్రతానికి కూర్చోరా..?


రాజ్‌: మమ్మీ నేను కూర్చోను అన్నానా..? ఆ కళావతే కనీసం నిల్చోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు.


ఇందిర: పాపం కావ్య అమాయకురాలు కన్నతల్లి కడసారి కోరిక తెలియక కాదంటుంది. తెలిస్తే..


అపర్ణ: అంత మాట అనకండి అత్తయ్యా కావ్య మన ఇంటి కోడలు.. కలకాలం పిల్లాపాపలతో జీవించాలని దీవిద్దాం.


అంటూ రాజ్‌ను నువ్వేమైనా చేసి కావ్యను వ్రతానికి ఒప్పించరా..? అంటూ ఇద్దరూ కలిసి రాజ్‌కు బ్రెయిన్‌ వాష్‌ చేస్తారు. ఓకే ఏదో ఒకటి చేసి కళావతిని ఒప్పిస్తానని చెప్పి కావ్య దగ్గరకు వెళ్తాడు రాజ్‌. కావ్యను పక్కకు తీసుకెళ్తాడు.


రాజ్‌: చూడు నీకు నాకు ఏమైనా ఉంటే ఈ ఫంక్షన్‌ అయ్యాక  ఎక్కడికైనా వెళ్లి తేల్చుకుందాం.


 కావ్య: ఎక్కడికి వెళ్దాం. బూతు బంగ్లాకే కదా? నేను ఎక్కడికి రాను.


రాజ్‌: ఇప్పుడు దాంపత్య వ్రతానికి వచ్చి కూర్చుంటావా? లేదా?


కావ్య: దాంపత్య వ్రతంలో దంపతులే కూర్చుంటారు. నాకు నీకు ఏ సంబంధం లేదన్నావు కదా?


రాజ్‌: ఈ వ్రతం నా కోసం కాదు.


కావ్య: మరి నన్ను ఉద్దరించడానికా..?


రాజ్‌: మీ అమ్మా ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లు కూర్చోవాలని కోరుకుంటుంది.


కావ్య: మా అమ్మతో నేను మాట్లాడుకుంటానులే.. కట్టుబట్టలతో అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలిసి కూడా ఇలాంటి కోరికలు ఎలా కోరిందో నేను తేల్చుకుంటాను.


రాజ్‌: ఇదిగో నువ్వు ఏదైనా అనాలనుకుంటే నన్ను అను మీ అమ్మను ఒక్కమాట అన్నా ఊరుకోను. నీకు పుణ్యం ఉంటుందే వచ్చి వ్రతంలో కూర్చోవే..


కావ్య: వ్రతంల ఏలా కూర్చోవాలి. భార్యగా కూర్చోవాలా? కనకం కూతురిగా కూర్చోవాలా? దుగ్గిరాల ఇంటి కోడలిగా కూర్చోవాలా..?


రాజ్‌: నా భార్య స్థానంలో కూర్చో..  చూడు నేను మీ అమ్మగారి ఆనందం కోసమే కాదు.. మా అమ్మకోసమే కాదు మన గురించి కూడా ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇది మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. నేను అన్ని మర్చిపోయి పిలుస్తున్నాను. నువ్వు అన్ని గుర్తు పెట్టుకుని రానంటే అది నీ ఇష్టం నేను వెళ్లి పీటల మీద కూర్చుంటున్నాను. నువ్వు వస్తావో రావో నీ ఇష్టం కళావతి. ఇది నేను మనఃస్పూర్తిగా చెప్తున్న మాట


 అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. కావ్య షాకింగ్‌గా చూస్తుంటుంది.  మరోవైపు అప్పు రూంలోకి వచ్చిన బంటి.. కనకం నాటకం గురించి అప్పుకు చెప్తాడు. అయితే ఈ ఫంక్షన్‌ అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పొద్దు అంటుంది. అయితే కిటికీలోంచి రుద్రాణి మొత్తం వింటుంది. ఇక నేను రంగంలోకి దిగుతాను అనుకుంటుంది. తర్వాత అందరూ వ్రతం దగ్గర అందరూ కూర్చుని ఉంటారు. కావ్య మాత్రం రాదు.


ధాన్యలక్ష్మీ: ఏంటీ అక్కా కూర్చుంది చెల్లి కూర్చుంది ఈవిడకు ఏమైందో.. ఈవిడ ఇంట్లో జరిగే వ్రతానికి కూడా బొట్టు పెట్టి పిలవాలా?


కావ్య రెడీ అయి వస్తుంది.


ప్రకాష్‌: బొట్టు అవసరం లేదే కావ్యనే వస్తుంది. నోటికి ఎంత వస్తే అంత అరవడమే.. చూడు కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు.


అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. రుద్రాణి మాత్రం నిజం ఎప్పుడు బయటపెట్టాలా అని ఎదురుచూస్తుంది. పంతులు పూజ మొదలుపెడతాడు.


మూడు జంటలు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుని కంకణాలు కట్టుకుంటుంటే రుద్రాణి చప్పట్లు కొడుతుంది.


స్వప్న: ఏంటి రాహుల్‌ మీ అమ్మకు చేతులు దురద పెడుతున్నాయా? అలా కొడుతుంది.


కనకం: ఏంటిది..?


రుద్రాణి: చప్పట్టు.. నాటకం రసవత్తరంగా ముగిసిపోయాక ప్రేక్షకులు కొట్టే చప్పట్లు.


కనకం: ఏం మాట్లాడుతున్నారు


రుద్రాణి: నీ నాటకం గురించే మాట్లాడుతున్నాను కనకం.


రాజ్‌: అత్తా ఏంటిదంతా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు..?


రుద్రాణి: ఒక అద్భుతాన్ని ఇప్పుడు నేను ఆవిష్కరించబోతున్నాను రాజ్‌. నువ్వెలా మోసపోయావో.. మనమంతా నమ్మి పూల్స్‌ అయ్యామో దాని గురించి బయటపెట్టబోతున్నాను.


 అనగానే కావ్య, రుద్రాణిని మీద కోప్పడుతుంది. అవును నేను రుద్రాణినే అంటూ నాటకం ఇక్కడ జరుగుతుంటే మనం ఎక్కడికో వెళ్దాం అంటావేంటి అంటుంది రుద్రాణి. దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్‌ ను చంపేయమన్న స్వామీజీ