Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా మిత్రని తన పక్కన కూర్చొపెట్టుకుంటుంది. మిత్ర చేయి పట్టుకొని భుజం మీద వాలడం బిడ్డతో మాట్లాడు మిత్ర అని చెప్తుంది. మనీషా అంత క్లోజ్‌గా ఉండటంతో మిత్ర ఇబ్బందికరంగా ఫీలవుతాడు. అయినా మనీషా క్లోజ్‌గా ఉంటుంది. ఫొటోలు చూపించాలని ప్రయత్నిస్తుంది. తాను సగం తాగిన జ్యూస్ ఇస్తుంది. నేను నీ భార్యనే మిత్ర తాగు అని అంటుంది. అందంతా చూసిన లక్ష్మీ మనీషా దగ్గరకు వచ్చి మనీషాని పిలిచి కావాలనే జ్యూస్ ఇద్దరి మీద పడేలా చేస్తుంది. దాంతో మనీషా మిత్ర షర్ట్ తుడుస్తుంటే నేను మిత్ర గారిని చూసుకుంటా నువ్వు వెళ్లి నీ చీర చూసుకో అంటుంది. మిత్ర లక్ష్మీకి 
సారీ చెప్తాడు  అవసరం లేదని లక్ష్మీ అంటుంది. తర్వాత లక్ష్మీ మనీషా గదికి వెళ్తుంది.

Continues below advertisement


మనీషా: కావాలనే అలా చేశావు కదా. నాకు తెలుసు లక్ష్మీ.
లక్ష్మీ: డౌటా కావాలనే చేశాను. రాముడి పక్కన సీత ఉండాలి కానీ సూర్ఫణక కాదు. నీ తాళి కడుపు రెండు ఫేకే. నీ కడుపులో లేని బిడ్డకు ఆయన కబుర్లు చెప్పాలా. 
మనీషా: మిత్ర నన్ను ఫేక్ అని నమ్మే వరకు నేను చెప్పేదే నిజం. నేను చేసేదే కరెక్ట్. ఇలా ప్రతీ సారి నువ్వు నన్ను ఆపలేవు. 
లక్ష్మీ: నేను ఏంటో నీకు బాగా తెలుసు. ఆయనకు ఆపద వస్తుంది అంటే అది అడ్డుకోవడానికి నా ప్రాణాలు అయినా అడ్డు పెడతా అవసరం అయితే ప్రాణాలు అయినా తీసేస్తా. 
మనీషా: నేను ఆ పని చేయగలను. నువ్వు అయినా ఒక సారి మిత్రని వదిలేసి వెళ్లావేమో కానీ నేను ఎప్పుడు మిత్ర పక్కనే ఉన్నాను. 
లక్ష్మీ: నేను వచ్చిందే నీ నుంచి ఆయన్ను కాపాడటానికి. నువ్వే మిత్ర గారికి గండం. నీ ఫేక్ పెళ్లి నీ ఫేక్ ప్రెగ్నెన్సీ నీ కుట్రలు వల్లే ఆయనకు గండాలు వస్తున్నాయి. నువ్వు ఆయన జీవితం నుంచి తప్పించుకోవాలి. రేపు ఆసలైన ఉగాది గిఫ్ట్ నీకు ఇస్తా.  రేపు ఇంట్లో నుంచి వెళ్లిపోయేది నువ్వే.
మనీషా: అదే 24 గంటల్లో నేను నిన్ను ఇంటి నుంచి పంపేస్తా.


వివేక్‌ దేవయాని తల్లి వాచ్‌కి బగ్ పెడతాడు. ఇద్దరూ టెస్ట్ చేస్తారు. వాచ్ ఆన్ చేసి మాటలు వింటారు. ఇక దేవయానికి ఆ వాచ్ ఇస్తాడు. దేవయాని మనీషాకి అడిగిన సీడ్స్ ఇస్తుంది. ఇక వాచ్ పని చేస్తుందా లేదా అని జాను, వివేక్‌ మాటలు వింటారు. మనీషా లక్ష్మీ మీద ప్లాన్ వేశానని చెప్తుంది. జాను వివేక్‌లు వింటారు. ఏం ప్లాన్ చేస్తుందా అనుకుంటారు. ఇక దేవయాని జానుని తిడుతూ జాను అంతు చూస్తానని అంటుంది.  నా మీద మీ అమ్మ ఏం ప్లాన్ చేస్తుందో చూడు అని తిడుతుంది. ఈ బగ్ పెట్టించుకోవడం వల్ల నా గొయ్యి నేనే తవ్వుకున్నా అనుకుంటాడు. 


లక్ష్మీ మిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మీరే నా మొదటి దైవం అని మిత్రతో చెప్తుంది. ఉగాది సందర్భంగా మనకు అంతా మంచే జరగాలి అని అంటుంది. మిత్ర లక్ష్మీ నుదుటిన కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తాడు. ఏం జరిగినా నేను నీ వెంటే ఉంటాను అని అంటాడు. ఇక మనీషా ఉగాది పచ్చడిలో ఏదో కెమికల్స్ కలిపి తన ఫేక్ ప్రెగ్నెంట్ పోయేలా ప్లాన్ చేసి నింద లక్ష్మీ మీద తోసేసి ఇంటి నుంచి గెంటేస్తానని ప్లాన్ చేస్తుంది. జాను, వివేక్‌లు ఇద్దరూ బ్లూటూత్ పెట్టుకొని దేవయాని మాటలు వింటారు. దేవయాని కిచెన్‌లో గరిటె తీసుకొని కాల్చుతుంది. జాను చేయి కాల్చాలని ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!