Ennallo Vechina Hrudayam Serial Today Episode తాంబూలం ఇచ్చిపుచ్చుకున్నందుకు రమాప్రభ, ఊర్వశి సంతోషంగా వెళ్తుంటే నాగభూషణం, వాసుకిలు వచ్చి పెళ్లి ఫిక్స్ అయింది కదా కాస్త పెన్‌ కెమెరా ఇస్తే మేం కూడా హ్యాపీగా ఉంటాం అని అంటారు. ఊర్వశి పెళ్లి అయితే ఇస్తానని అంటుంది. పెళ్లి అయిపోగానే పెన్ను భద్రంగా మీ చేతిలో పెడతాను అని వెళ్లిపోతుంది. గాయత్రీ తాతయ్యతో కలిసి పోలీస్‌ని కలుస్తుంది. ఏం సమాచారం తెలిసినా మీకు చెప్తామని ఆయన అంటారు. రమాదేవి, ఊర్వశిలు ఇంటికి వస్తారు. 

రమాప్రభ: ఏంటి మామయ్య ఏం జరుగుతుంది ఈ టైంలో పోలీసులు ఇంటికి రావడం ఏంటి.పెద్దాయన: గాయత్రీ కేసు గురించి వచ్చారు అయితే ఏంటి.. రమాప్రభ: అయినా పోలీసులు ఎంక్వైరీ ఎందుకు మీరు మీ మనవరాలిని కూర్చొ పెట్టి ఎవరితో తిరిగిందో ఏం ఏం చేసిందో అడిగితే సరిపోతుంది కదా.గాయత్రీ: నాకు మీలా నాటకాలు ఆడటం. గుంటనక్కలా టైం చూసి గోతులు తవ్వడం తెలీదు.రమాప్రభ: ఏంటే చేసిన బాగోతం చాలదు అన్నట్లు ఎగిరెగిరి పడుతున్నావ్.పెద్దాయన: రమాప్రభ నోరు అదుపులో పెట్టుకో.రమాప్రభ: నా నోరు కాదు మీ ఇద్దరు మనవరాల్ని అదుపులో పెట్టుకోండి అసలే ఇది పెళ్లి కుదురిన ఇళ్లు. ఇలా పోలీసులు వచ్చి వెళ్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా.పెద్దాయన: పెళ్లి కుదరడం ఏంటి.త్రిపుర: అనంత్ గారికి ఊర్వశికి రేపే పెళ్లి. ఇదాంకే ముహూర్తాలు పెట్టుకొని తాంబూలాలు మార్చుకున్నారు. పెద్దాయన: ఏం చేస్తున్నావ్ రమాప్రభ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకి ఒక మాట చెప్పాలి అని లేదా.రమాప్రభ: చెప్తే ఏం చేస్తారు మీ మనవరాళ్ల వంతు పాడుతూ నా కూతురికి అన్యాయం చేస్తారు. రేపు మంగళస్నానాలు, గౌరీ పూజ అన్నీ మా వియ్యంకుల ఇంట్లోనే మీ ఏడుపులు పక్కన పెట్టి జరగబోయే పెళ్లి చూడటానికి రెడీగా ఉండండి.ఊర్వశి: చిన్నప్పటి నుంచి నువ్వు ఇష్టపడిన ప్రతీది నా సొంతం. ఇప్పుడు అనంత్ కూడా నా సొంతం అవుతున్నాడు. ఇక నీ గుండెల్లో నుంచి జ్ఞాపకాల్లోంచి అనంత్‌ని తుడిచేసే.గాయత్రీ: సరేనే నేను అంతా మర్చిపోతాను  కానీ రేపు నువ్వు అనంత్ చేత నీ మెడలో తాళి కట్టించుకున్న తర్వాత అయినా అనంత్ నిన్ను ప్రేమిస్తాడా. కనీసం నిన్ను భార్యగా అయినా చూస్తాడు. అప్పుడు కూడా అనంత్ నన్నే ప్రేమిస్తాడు. ఆరాధిస్తాడు. నువ్వు ఎన్ని స్కెచ్‌లు వేసినా అనంత్ నిన్ను ప్రేమించేలా చేయలేవు. నా మీద ప్రేమ చంపలేవు. 

గాయత్రీ బయటకు వెళ్లి అనంత్‌ని తలచుకొని ఏడుస్తుంది. త్రిపుర గాయత్రీ దగ్గరకు వచ్చి బాధపడకే మన నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది. నీది అనంత్ గారిది స్వచ్ఛమైన ప్రేమ మీ నమ్మకం మీ ప్రేమ మిమల్ని కలుపుతుందని అంటుంది. అక్కని పట్టుకొని గాయత్రీ చాలా ఏడుస్తుంది. నా ప్రేమ నాకు దూరం అవుతుందని అర్థమవుతుంది అక్క తట్టుకోలేకపోతున్నా అని ఏడుస్తుంది. ఉదయం అందరూ అనంత్ వాళ్లు ఇంటికి చేరుకుంటారు. పెళ్లి హడావుడి మొదలవుతుంది. యశోద, వాసులు ఎదురొచ్చి రమాప్రభ, ఊర్వశిలకు స్వాగతం పలుకుతారు.  త్రిపుర వాళ్లకు ఏం అనరు.

రమాప్రభ వాళ్లని మంగళ స్నానాలకు పిలుస్తారు. మంగళస్నానాలకు ఊర్వశిని రెడీ చేసి కూర్చొపెడతారు. అనంత్‌ని కూడా తీసుకొస్తారు. అనంత్ గాయత్రీని చూస్తూ ఉంటాడు. అందరూ బలవంతంగా అనంత్‌ని ఊర్వశి పక్కన కూర్చొపెడతారు. గాయత్రీ బాధ చూసి త్రిపుర కన్నీరు పెట్టుకుంటుంది. బాల బయట కూర్చొని పేపర్ చూస్తుంటాడు. వాటిలో గాయత్రీ పక్కన ఉన్న ఓ అబ్బాయి పొటో ఉంటుంది. అది ఎగిరి మంగళస్నానాల దగ్గరకు వెళ్లి త్రిపుర ముందు పడుతుంది. బాల త్రిపురని పలకరిస్తాడు. అనంత్ గాయత్రీలకు నువ్వే పెళ్లి చేయాలని అంటాడు. గాయత్రీ ఏడుస్తుంటే ఏం ఫీలవ్వకు మేం నీ పెళ్లి చేస్తాం అంటారు. ఇక బాల ఆ పేపర్ తీసి రాకెట్ చేసుకుంటాడు. ఊర్వశి, అనంత్‌లకు మంగళస్నానాలు అవుతుంటే గాయత్రీ, అనంత్ ఇద్దరూ ఏడుస్తారు. ఊర్వశి నవ్వుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!