Seethe Ramudi Katnam Serial Today Episode మిధునగా ఉన్న సీత రామ్‌తో సీత గురించి మాట్లాడితే నువ్వు నీ పని చూసుకో మా గురించి నీకు అనవసరం అని రామ్ మిధునతో చెప్తాడు. గౌతమ్ మహాలక్ష్మీ దగ్గరకు వెళ్లి సీత నా గురించి మంచిగా చెప్పదు మిధున నన్ను పెళ్లి చేసుకోదు అందుకే సీతని చంపేస్తా అని తల్లితో చెప్తాడు. సీతతో పెట్టుకుంటే నువ్వే చస్తావ్ అని మహాలక్ష్మీ గౌతమ్‌తో చెప్తుంది. ఇద్దరూ సీత గురించి మాట్లాడుతుండగా రామ్ వస్తాడు.
రామ్: ఏమైంది పిన్ని మీరు ఇద్దరూ ఎందుకు టెన్షన్‌గా ఉన్నారు.మహాలక్ష్మీ: ముఖర్జీ గారి డాటర్ గురించి మాట్లాడుతున్నాం.అర్చన: మిధున గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుందంట రామ్.రామ్: ఏంటి వీడిని పెళ్లి చేసుకుంటుందా.చలపతి: నాదీ సేమ్ ఫీలింగ్ రామ్. గౌతమ్: ఏంటి బ్రో నాకేం తక్కువ మిధున నన్ను ఇష్టపడి చేసుకుంటుంది. జనా: గౌతమ్ మిధునని పెళ్లి చేసుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా రామ్.రామ్: నాకేం అభ్యంతరం లేదు నాన్న. మిధున గురించి నాకు అనవసరం వీడు పెళ్లి చేసుకుంటే చేసుకోని.గిరి: మిధున గౌతమ్‌ని పెళ్లి చేసుకోవాలి అంటే సీత మంచోడని సర్టిఫికేట్ ఇవ్వాలంట.జనార్థన్: రామ్ గౌతమ్ మంచోడని మిధునకు చెప్పమని నువ్వే సీతకి చెప్పాలి.రామ్: సారీ డాడ్ వీడి గురించి సీత అభిప్రాయాలు సీతకి ఉన్నాయి నేను వాటిని మార్చలేను.గౌతమ్: నా కోసం ఆ మాత్రం చేయలేవారామ్: నేను సీతతో ఏం మాట్లాడను. మహాలక్ష్మీ: గౌతమ్ గురించి సీత మిధునతో చాలా బ్యాడ్‌గా చెప్పింది రామ్.. సీతతో నువ్వు నిజాలు చెప్పిస్తే మిధున పెళ్లికి ఒప్పుకుంటుంది కదా..రామ్: సారీ పిన్ని నేను తనని బతిమాలలేను. మహాలక్ష్మీ: పోనీ మేం సీతని కన్విన్స్ చేస్తే నీకు ఓకే కదా. సీతని మళ్లీ ఈ ఇంటికి తీసుకురావాలి.చలపతి: రామ్ పిలిస్తే రాని సీత నువ్వు పిలిస్తే ఎందుకు వస్తుంది. సీత వీడి గురించి మంచిగా చెప్పదు ఈ పెళ్లి జరగదు అంతే.మహాలక్ష్మీ: ఎలా అయినాఈ పెళ్లి జరగాలి మనం ముఖర్జీ గారితో వియ్యం అందుకోవాలి.రామ్: ఈ విషయంలో నేను ఏం చేయలేను పిన్ని సీతతో మీరు ఏం చెప్పినా నాకు ఒకే.మహాలక్ష్మీ: సీతతో నేను మాట్లాడుతా. ఎలా అయినా సీతని ఈ ఇంటికి రప్పిస్తా. గౌతమ్ గురించి మంచిగా చెప్పిస్తాను. గౌతమ్: ఇందుకే ముందే చెప్పాను సీతకి జాతర చేస్తానని నువ్వే వద్దు అంటున్నావ్.అర్చన: జాతరా..గౌతమ్: అంటే పిన్ని అదిమహాలక్ష్మీ: దానికి అంతా తెలుసులే కవరింగ్‌లు వద్దు. బెదిరిస్తే సీత రాదు బతిమాలడం ఒక్కటే దారి.
సీత బట్టలు ఆరేస్తుంటే మహాలక్ష్మీ, అర్చనలు సీత దగ్గరకు వెళ్తారు. ఇద్దరు అత్తలు సీతతో ప్రేమగా పిలుస్తారు. ఇంతలో అడుక్కున్నామె అక్కడికి రావడంతో సీత అత్తలకు వేయాల్సిన డైలాగులు అడుకున్నదానికి వేస్తుంది. దాంతో అర్చన వెళ్లి ఆమెకు డబ్బులు ఇచ్చి పంపేస్తుంది. తర్వాత సీతని పిలుస్తారు. సీత చూసి అత్తయ్యలు మీరా ఇంకా అడుక్కునే వాళ్లు అనుకున్నా అని అంటుంది. నీతో మాట్లాడాలి అని మహాలక్ష్మీ అంటే బిజీగా ఉన్నానని చెప్పి అత్తలతో బట్టలు ఉతికిస్తుంది. మీరు తొందరగా ఉతికేస్తా మాట్లాడుకుందాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!