'బ్రహ్మముడి' సీరియల్ (Brahmamudi Serial) ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన తమిళ అమ్మాయి దీపిక రంగరాజు (Deepika Rangaraju). మానస్ నాగులపల్లికి జంటగా కావ్య పాత్రలో ఆవిడ 'బ్రహ్మముడి'లో సందడి చేస్తున్నారు. ఆ సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో రియాలిటీ షోలు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ యాడ్స్ చేస్తున్నారు. ఏకంగా నాచురల్ స్టార్ నాని (Natural Star Nani)తో ఒక యాడ్ చేశారు.

ఆశీర్వాద్... నానితో కావ్య యాడ్!నాచురల్ స్టార్ నాని, 'బ్రహ్మముడి' కావ్య అలియాస్ దీపికా రంగరాజు కలిసి ఆశీర్వాద్ బ్రాండ్ కోసం ఒక యాడ్ చేశారు. ఈ సందర్భంగా నానితో దిగిన సెల్ఫీలను దీపిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ''నాని గారు చాలా హంబుల్ అండ్ సింపుల్ పర్సన్. ఆయనతో యాడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని దీపికా రంగరాజు పేర్కొన్నారు.

Also Read: ఆస్పత్రిలో అలేఖ్య చిట్టి... చావు తప్ప మరో దిక్కు లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న సుమ

'బ్రహ్మముడి'తో పాటు షోస్ కూడా!'బ్రహ్మముడి'లో కావ్యగా దీపిక రంగరాజు ఎంత సీరియస్ రోల్ చేశారో... బయట ఆవిడ అంత సరదాగా ఉంటారు. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో ఆవిడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీపిక ఏం మాట్లాడినా సరే ప్రేక్షకులకు నవ్వొచ్చేలా ఉంటుంది. 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్'లో కూడా దీపికా రంగరాజు సందడి చేశారు. ప్రస్తుతం ఆహా ఓటీడీలో స్ట్రిమింగ్ అవుతున్న 'షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె'లో సందడి చేస్తున్నారు.

Also Readఅల్లు అర్జున్ బర్త్‌ డే స్పెషల్... ‘ఆర్య’, ‘హ్యాపీ’ to ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జులాయి’ వరకు - ఈ మంగళవారం (ఏప్రిల్ 8) టీవీలలో వచ్చే సినిమాలివే