Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అరవింద దగ్గరకు మనీషా వెళ్తుంది. ఆంటీ ఇంకా పడుకోలేదా ఈరోజు జరిగిన దానికి సారీ ఆంటీ. మీరంతా చెప్పేవరకు నేను ప్రెగ్నెంట్ కాదని నాకు తెలీదని అంటుంది. దానికి అరవింద మిత్రని నువ్వు ప్రేమించడం నిజం అయితే మిత్ర నీ మెడలో కట్టిన తాళి నిజం అయితే మిత్రను గండం నుంచి కాపాడే కూతుర్ని ఇవ్వు అని చెప్తుంది. 


మనీషా అరవిందతో తప్పకుండా ఇస్తాను ఆంటీ మిత్రతో బేబీని కని మీకు ఇస్తాను ప్రామిస్ అని అంటుంది. దానికి అరవింద మిత్ర నీ మెడలో తాళి కట్టాడు అని నేను నమ్మాను కాబట్టి లక్ష్మీకి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి ఆ అవకాశం నేను నీకు ఇచ్చాను ఈ విషయంలో నువ్వు క్లారిటీగా ఉండాలి అంటుంది. దాంతో మనీషా తనకు మిత్ర ఇష్టమని మిత్ర కోసం ఏమైనా చేస్తాను నా ప్రేమ ఎంత బలమైనదో నేను నిరూపించుకుంటానని అంటుంది. మిత్ర కోసం లక్ష్మీని బాధ పెట్టాల్సి వస్తుందని అరవింద బాధ పడుతుంది. మిత్రని కాపాడే బిడ్డను తాను కని లక్కీని దూరం చేసి ఇంటికి పర్మినెంట్ కోడలు అవుతానని అనుకుంటుంది. 


 ఉదయం ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి లక్కీ, జున్నులు స్కూల్‌ కాంపిటీషన్‌లో ఫస్ట్ వచ్చారని ఇప్పుడు పిల్లల్ని స్టేట్ కాంపిటీషన్‌కి తీసుకెళ్తామని అంటారు. స్కూల్‌ వాళ్లు చూసుకోవాలి కదా మీరు సపరేటేగా తీసుకెళ్లడం ఏంటి అని మిత్ర అడుగుతాడు. ఇక వాళ్లు స్కూల్‌కి కాల్ చేసి కనుక్కోమని అంటే లక్ష్మీ చేస్తుంది వాళ్లు పిల్లలు సెలక్ట్ అని పిల్లల్ని పంపడం పంపకపోవడం మీ ఇష్టం అని చెప్పారని అంటారు. దాంతో అందరూ పంపాలి అనుకుంటారు. రేపు తామే పిల్లల్ని వ్యాన్‌లో తీసుకెళ్తామని అంటారు. మిత్ర వాళ్లు తమ కార్‌లో తీసుకొస్తామని అంటే అందరూ పిల్లలతో కలిసి వెళ్తే బాగుంటుందని అంటారు. దాంతో మిత్ర వాళ్లు సరే అంటారు. తర్వాత ఆ వ్యక్తి సరయుకి కాల్ చేసి పిల్లలు రేపు మన గుప్పొట్లోకి వస్తారని అంటారు. దాంతో సరయు ప్లాన్ ప్రకారం వాళ్లని తీసుకొచ్చేయండి అని చెప్తుంది.


మనీషాకి సరయు లోకేషన్ పెట్టి అర్జెంటుగా రమ్మని చెప్తుంది. మనీషా దేవయానిని తీసుకెళ్లాలి అనుకుంటుంది. ఇద్దరి మాటలు జాను, వివేక్ వింటారు. దేవయాని రాను అనేస్తుంది. దేవయానిని మనీషాతో పంపాలి అని వివేక్, జానులు ప్లాన్ చేసి తమకు సాయం చేయమని అంటుంది. దేవయాని, జాను గొడవ పడతారు. ఖాళీగా ఉన్నావ్ కదా రా అమ్మ అని వివేక్ అంటే నేను ఖాళీగా లేను మనీషాతో వెళ్తున్నా అని అంటుంది. లక్ష్మీకి కన్ను అదురుతుంటుంది. దాంతో అపశకునంలా ఫీలవుతుంది. ఇక మిత్ర దగ్గరకు వస్తుంది. మిత్ర తల మీద బల్లి ఉండటంతో అది ఎక్కడ మిత్ర మీద పడుతుందో అని కొంగు అడ్డుపెడుతుంది. అన్నీ చూసి లక్ష్మీ రేపే త్రయోదశి రేపు ఏ ప్రమాదం జరగకుండా చూడమని కోరుకుంటుంది. 


మనీషా, దేవయాని సరయు దగ్గరకు వెళ్తారు. జాను, వివేక్‌లు వాళ్ల మాటలు సరిగా వినిపించవు. దాంతో సరయుని కలిసినట్లు వివేక్ వాళ్లకి తెలీదు. సరయు దేవయానిని అనుమానంగా చూస్తూ ఆవిడ మన పార్టీనే అని చెప్తుంది. లక్కీ, జున్నులను కిడ్నాప్ చేస్తున్నట్లు సరయుతో చెప్తుంది.  లక్కీ కన్న కూతురు అని తెలిస్తే నాకు ఇంట్లో స్థానం ఉండదు అని రేపు త్రయోదశి కాబట్టి మిత్రకు గండం వస్తుంది. లక్కీ మిత్రకు దూరం ఉంటే గండం అరవింద అత్తయ్యని భయపెడుతుంది. కాబట్టి నన్ను మిత్రను దగ్గర చేస్తుందని అంటుంది. రేపు పిల్లల్ని మీ ఇంటి వాళ్లు ఎవరూ ఫాలో అవ్వకుండా చూడమని సరయు అంటుంది. అలా నేను చేస్తా కానీ జాను మాకు దూరం అయ్యేలా చేయమని దేవయాని చెప్తుంది. సరయు సరే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!