Lakshmi Nivasam Serial April 14th Today Episode: తమను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు బసవ ఇంటికి వెళ్తారు లక్ష్మీ, శ్రీనివాస్, తులసి. అయితే, తాను బయటకు తీసుకు రాలేదని వారితో బసవ చెప్పడంతో వాళ్లు ఆశ్చర్యానికి గురవుతారు. తులసి సిద్ధు ఇంటికి చేరినా అతను కార్యకర్తలతో బిజీగా ఉండడంతో ఆమెను చూడడం మిస్ అవుతుంది. మరోవైపు, జానుతో పెళ్లి కోసం కలలు కంటాడు జై. అటు, చిన్నారి ఖుషీని భార్గవ్ అతని తల్లి భాగ్యం, సుపర్ణిక ఇబ్బందులు పెడుతుంటారు. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో..
సిద్ధు తులసి కలుస్తారా..
తమను జైలు నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారో తెలియక కన్ఫ్యూజన్‌తోనే బసవ ఇంటి నుంచి బయల్దేరేందుకు సిద్ధమవుతారు లక్ష్మి, శ్రీనివాస్, తులసి. ఇదే సమయంలో సిద్ధు కిందకు వచ్చి వారు వెళ్తుండగా చూస్తాడు. వాళ్లు ఎవరిని బసవను అడుగుతాడు. అయితే, మనోళ్లే అంటూ కవర్ చేస్తాడు బసవ.
కీర్తి టెన్షన్..
ఓ వైపు లక్ష్మి, శ్రీనివాస్‌లు తన ఇంటికి వెళ్లగా కీర్తి టెన్షన్ పడుతుంది. తన తండ్రి వాళ్లను రిసీవ్ చేసుకుంటారో లేదో అని అనుకుంటుంది. ఇదే సమయంలో హరీష్ ఆమె వద్దకు వచ్చి ఏదో చెప్పబోతుండగా తనకు తలనొప్పిగా ఉందని విసిగించొద్దని అంటుంది. ఫ్యామిలీ అంతా కీర్తిని పొగుడుతుంటారు. ఇదే సమయంలో లక్ష్మి, శ్రీనివాస్‌లు అక్కడకు వస్తారు.
నిజం తెలిసి ఫ్యామిలీ షాక్
కీర్తిని ఎంత పొగిడినా తక్కువే అని.. తమను క్షేమంగా బయటకు తీసుకొచ్చారని లక్ష్మి కీర్తితో అంటుంది. దీంతో కీర్తి టెన్షన్ పడుతుంది. బసవకు అసలు ఏమీ తెలియదని.. తమను విడిపించింది వారు కాదని అందరితో చెప్తారు లక్ష్మి, శ్రీనివాస్. దీంతో అంతా కీర్తిని వెటకారంగా మాట్లాడతారు. అబద్ధం ఎందుకు చెప్పావంటూ జాను.. కీర్తిని నిలదీస్తుంది. ఇంకెప్పుడూ ఇలా చేసి తమను అవమానించొద్దని లక్ష్మి, శ్రీనివాస్ కీర్తితో అంటారు. దీంతో కీర్తి తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
శ్రీ జ్ఞాపకాల్లో తులసి
ఆ తర్వాత తులసి శ్రీ జ్ఞాపకాలతో బాధ పడుతుంది. అతను గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఖుషిని తలుచుకుని వేదనకు గురవుతుంది. ఇదే సమయంలో జాను అక్కడకు వచ్చి తులసిని ఓదారుస్తుంది. ఖుషి.. సుపర్ణిక ఇంట్లో ఇబ్బందులు పడుతుందని చెప్తుంది. ఎవరి గురించి ఆలోచించొద్దని.. పాపను చూసి రావాలని అంటుంది.
ఆకలితో ఖుషి వేదన
చిన్నారి ఖుషి ఆకలితో ఇబ్బందులు పడుతుంది. ఓవైపు భాగ్యం ఇష్టానుసారం తింటూ.. ప్లేట్లను కడగాలని ఖుషికి చెప్తుంది. దీంతో ఖుషి కాలి నొప్పితోనే పనులు చేస్తుంది. ఇదే సమయంలో తులసి అక్కడకు వెళ్తుంది. ఆమెను చూసిన భార్గవ్, భాగ్యం షాక్‌కు గురవుతారు. ఖుషిని పట్టుకెళ్లిపోతుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు. తులసిని చూసి సుపర్ణిక కోపం తెచ్చుకుంటుంది. తులసిని చూసి ఖుషి సంతోషపడుతుంది.
మరోవైపు, జై.. జానుతో పెళ్లి కోసం ఆరాటపడుతుంటాడు. అసలు వారిద్దరి పెళ్లికి లక్ష్మి, శ్రీనివాస్ ఫ్యామిలీ ఒప్పుకొంటారా?, విశ్వకు జాను దూరమవుతుందా? ఖుషిని భార్గవ్ ఫ్యామిలీ బారి నుంచి తులసి కాపాడుతుందా?, సిద్ధు, తులసిలు కలుస్తారా? ఇవన్నీ తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.