Seethe Ramudi Katnam Serial Today Episode సీతని బయటకు వెళ్లిపోమని రామ్ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. సీత రాత్రి నేను ఏం చేశానో నాకు తెలీదు అంటుంది. రామ్‌తో నువ్వే నన్ను వెళ్లిపోమని చెప్తున్నావా లేక వీళ్ల బలవంతంతో ఇలా చెప్తున్నావా అని అడుగుతుంది.
రామ్: నువ్వు నాతో అన్న మాటలే నేను నీతో అంటున్నా సీత. నిర్దోషిలా నిరూపించుకొని కడిగిన ముత్యంలా ఈ ఇంట్లో అడుగుపెట్టాలి.చలపతి: బాగుంది అల్లుడు మహాలక్ష్మీ ఏమో నిన్ను సీతని కలపాలి అని సీతని తీసుకొచ్చింది నువ్వు సీతని పంపేయాలి అనుకుంటున్నావా. మీ ఇష్టానికి చేస్తుంటే సీత తరఫున అడగటానికి ఎవరూ లేరు అనుకుంటున్నారా.సీత: వదిలేయండి బాబాయ్ వద్దు లెండీ మామ కోరుకున్నట్లు నేను కడిగిన ముత్యంలానే మళ్లీ తిరిగి వస్తాను. అని బ్యాగ్ తీసుకొని వస్తుంది. వెళ్లొస్తా మామ. గౌతమ్: హమ్మయ్యా సీత వెళ్లిపోయింది. ఎల్లుండే నిశ్చితార్థంమహాలక్ష్మీ: నిశ్చితార్థం ఏర్పాట్లు చేయండి జనా మన ఇంట్లోనే నిశ్చితార్థం.అర్చన: నువ్వు గ్రేట్ మహా సీతతో సంతకం పెట్టించి నిశ్చితార్థం పెట్టించావ్. ఇప్పుడు సీతని పంపేశావ్.
సీత ఇంటికి వెళ్తుంది. తానే కావాలని నిశ్చితార్థానికి ఓకే చెప్పానని అంటుంది. ఇక ఎల్లుండి నిశ్చితార్థంలో మిధునలా సీతలా హడలెత్తిస్తానని అంటుంది. కిరణ్, రేవతిలు సీతకి జాగ్రత్తలు చెప్తారు. మిధున లాంటి అందమైన ఆస్తి ఉన్న అమ్మాయి కోడలిగా రాబోతుందని మహాలక్ష్మీ సంతోషంలో ఉందని అది నిజం కాదని తెలిస్తే నిన్ను ఉంచదు చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావని అంటారు. దాంతో సీత తెలిసే మహాలక్ష్మీతో పెట్టుకున్నా అని సుమతి అత్తమ్మను చంపిన మహా అంతు చూడటానికే ఈ ప్రమాదకరమైన ఆట ఆడుతున్నానని అంటుంది.
గౌతమ్‌తో నిశ్చితార్థం చేసుకుంటావా అని రేవతి వాళ్లు అంటే ఆ రాముడికి ఒక్కర్తే సీత ఈ సీతకు ఒక్కడే రాముడు అని అంటుంది. ఈ నిశ్చితార్థం అడ్డుపెట్టుకొని గౌతమ్, మహాలక్ష్మీల అంతు చూస్తానని సీత అంటుంది. ఇక గౌతమ్‌కి కాల్ చేసి లొకేషన్ పెడతా వెంటనే రమ్మని చెప్తుంది. రేపు నేను ఆడబోయే ఆటకి ఇది ఆరంభం అని కిరణ్, రేవతిలతో చెప్తుంది. మిధునలా వెళ్లి వాడికి స్వీట్ షాక్ ఇస్తానని అంటుంది. ఇక గౌతమ్ ఇంట్లో అందరికీ తనని మిధున మాట్లాడటానికి పిలిచిందని చెప్తాడు. రేపు నిశ్చితార్థం ఇప్పుడు వెళ్లడం ఎందుకు అని జనార్థన్ వాళ్లు అంటారు. పర్లేదులే మిధున పిలిచింది కదా వెళ్లు అని మహాలక్ష్మీ పంపిస్తుంది.
పార్క్‌లో మిధునని గౌతమ్ కలుస్తాడు. హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే మిధున కోపంగా చూస్తుంది. కాబోయే భర్తనే కదా షేక్ హ్యాండ్ ఇవ్వవా అంటాడు. దాంతో మిధున కాబోయే భార్య దగ్గరకు ఏం తీసుకురాకుండా వస్తావా అని అంటుంది. బొకే తీసుకొస్తానని గౌతమ్ అంటే వద్దని గౌతమ్‌తో చెప్తుంది. నిశ్చితార్థానికి మా డాడ్ ప్లాటినం వడ్డానం ఇస్తాను అన్నారు. నువ్వు డైమండ్ నక్లెస్ ఇస్తావా అని అడుగుతుంది. ఓ ఫొటో చూపించి నాకు డైమండ్ నెక్లెస్ నిశ్చితార్థంలో వేయమని అంటుంది. అది జస్ట్ 25 లక్షలే అంటుంది. గౌతమ్ తనకు అంత సీన్ లేదు అని ఇన్‌డైరెక్ట్‌గా అనుకొని నువ్వేం అడిగినా ఇస్తాను అని అంటాడు. గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత మిధున తనలో తాను ఇంటికెళ్లాక నీకు మీ మహాలక్ష్మీకి మడతకాజా తినిపిస్తా అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కోనేటిలో పడిపోయిన ఉష.. చూపుల్లోనే అదిరిపోయే ఎమోషన్స్..!!