రుద్రాణి కావ్యని ఇరికించేందుకు తన మీద అపర్ణకి లేనిపోనివి కల్పించి చెప్తుంది. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళని గ్రిప్ లో పెట్టుకుంది ఇప్పుడు పని వాళ్ళు కూడా నీ మాట వినకుండా చేస్తుందని ఎక్కిస్తుంది. అపర్ణ కోపంగా కావ్య దగ్గరకి వెళ్తుంది. డబ్బులు తీసుకొచ్చి కావ్య శాంతకి ఇవ్వబోతుంటే ఆగు అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ బయటకి వస్తారు.
అపర్ణ: ఏం చేస్తున్నావ్?
కావ్య: శాంత డబ్బులు అడిగితే ఇస్తున్నాను అత్తయ్య
అపర్ణ: అంటే నువ్వు ఈ ఇంటి యజమానురాలు అయిపోయావా? ఈ డబ్బు నీకు ఎక్కడిది. మీ పుట్టింటి నుంచి తెచ్చావా?
కావ్య: నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అంత ఉన్నవాళ్ళు కాదు
అపర్ణ: దేనికి గతి లేకుండా వచ్చిన నువ్వు ఈ ఇంట్లో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని తెలియదా? నీకు ఏం అధికారం ఉందని పని మనిషికి అంత డబ్బు ఇస్తున్నావ్. ఏ హక్కు, అర్హత ఉందని దాన ధర్మాలు మొదలుపెట్టావ్. అది నువ్వు ఏమైనా డిజైన్స్ వేసి సంపాదించిన డబ్బా? లేదంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చారా?
కావ్య: లేదు
Also Read: పనిమనిషిగా మారిన రాజ్యలక్ష్మి- దివ్యకి దూరమవుతోన్న విక్రమ్!
అపర్ణ: మరి నా కొడుకు సంపాదన నువ్వు ఎందుకు ఇస్తున్నావ్. శాంత నన్ను డబ్బు అడిగింది ఇవ్వను అన్నాను. నాకు తెలియకుండ రాజ్ ని తనకి తెలియకుండా నన్ను శాంత డబ్బులు అడుగుతూనే ఉంది. ఈరోజు అడిగింది నేను ఇవ్వను అన్నాను. దానం చేయడంలో తప్పు లేదు కానీ అప్పు తీసుకోవడం అలవాటు చేసుకునే వారికి దానం చేయడం తప్పు. అందుకే ఇవ్వను అన్నాను. కావ్యని అడిగితే తను వెంటనే ఇస్తుంది. ఈ ఇంట్లో సర్వ హక్కులు తనవే అనుకుంటుందా? ఈ ఇంట్లో స్థానం కంటే తన స్థానం గొప్పది అనుకుంటుందా? నన్ను అలుసుగా చూస్తుందా?
ఇంద్రాదేవి: మీ అత్త ఇవ్వను అంటే ఏ కారణంతో ఇవ్వను అంటుందో ఆలోచించాల్సిన పని లేదా?తన మాట ఎందుకు ధిక్కరించావ్
కావ్య: అత్తయ్య డబ్బులు ఇవ్వనని అన్న విషయం నాకు తెలియదు
రుద్రాణి: మీ అత్త డబ్బులు ఇవ్వనని అన్నదని నీకు తెలుసు మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను కూడా. మీ అత్త కంటే నీకే ఎక్కువ అధికారం ఉందని అనిపించుకోవడం కోసం ఇలా చేశావ్
అపర్ణ: అందుకే నేను ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వనని ఆరోజే చెప్పాను
రుద్రాణి చెప్పుడు మాటల వల్ల గొడవ జరుగుతుందని ధాన్యలక్ష్మి అంటుంది. రుద్రాణి కావాలని తను తప్పించుకోవడం కోసం శాంత మీద అరిచి డబ్బులు ఇస్తుంది. తనకి డబ్బు వద్దని అంటుంది కానీ కావ్య మాత్రం డబ్బు వల్ల జరిగే గొడవ కాదని చెప్పి తీసుకెళ్లమని పంపించేస్తుంది. దానికి కూడా అపర్ణ మరింత పెద్ద విషయం చేసి గొడవ చేస్తుంది.
కావ్య: ఎందుకు హక్కులు దాకా వెళ్తున్నారు నాకు అర్థం కావడం లేదు?
అపర్ణ: నా మాట కాదని నువ్వు పని మనిషికి డబ్బులు ఇవ్వడం తప్పు కాదా?
కావ్య: ఇంతకముందు మీరు పని మనిషికి డబ్బులు ఇచ్చినప్పుడు అమ్మమ్మ ఇలాగే పంచాయతీ పెట్టారా? మరి మీరు నన్ను ఎందుకు అంటున్నారు. అది మా ఆయన డబ్బు నేను ఇవ్వడంలో తప్పేమీ లేదు
అపర్ణ: మీ ఆయన ఎక్కడ నుంచి వచ్చాడు. వాడి మంచితనం ఆసరా చేసుకుని ఆరోజు నీ పుట్టింటికి దోచి పెట్టావ్. ఈరోజు నన్ను కాదని పని మనిషికి దోచి పెట్టావ్
కావ్య: ఈ ఇంటి కోడలిగా మీకు ఎంత హక్కు ఉందో మీ కోడలిగా నాకు అంతే హక్కు ఉందని అనుకున్నాను
అపర్ణ: నువ్వు, నేను ఒకటేనా? నువ్వు ఎంత నీ బతుకు ఎంత చంపి పడేస్తా అని కావ్య మీదకి చేయి ఎత్తితే రాజ్ అడ్డుకుంటాడు.
రాజ్: చెయ్యి దించు మమ్మీ. దుగ్గిరాల వంశంలో ఎవరూ ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ మమ్మీ. కళావతి మీద చెయ్యి ఎత్తడం తప్పు
అపర్ణ: నేను చేసింది తప్పా. ఈ అమ్మాయిని వెనకేసుకొచ్చి తల్లిని తప్పుపడుతున్నావా? ఏ కారణంతో చెయ్యి ఎత్తానో తెలుసా
రాజ్: మన ఇంట్లో ఒక ఆడపిల్లని ఇంతమందిలో అవమానించడం తప్పే. మా మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా ఆవేశం కలిగిన ఏ నాడు చెయ్యి ఎత్తలేదు. ఆ అమ్మాయి మనల్ని నమ్మి మన ఇంట్లో ఉంటుంది. ఎవరు ఏ స్థానంలో నిలబెట్టినా తట్టుకుని నిలబడింది. నీకు ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయ్. కళావతి మీద చెయ్యి చేసుకునే హక్కు నీకు, నాకు కాదు ఇంట్లో ఎవరికీ లేదు
రుద్రాణి: శభాష్ రాజ్.. నీ భార్య ఎక్కువైపోయింది తల్లి తక్కువైపోయింది
రాజ్: అసలు కళావతి తప్పు ఏం చేసింది
ధాన్యలక్ష్మి: పనిమనిషి శాంతకి అక్క డబ్బులు ఇవ్వకపోతే కావ్య ఇచ్చింది
Also Read: ఒక్క సీన్ తో తల్లకిందులైన మూడు జీవితాలు- మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, ముకుంద
కావ్య: భగవంతుడి సాక్షిగా చెప్తున్న అత్తయ్య డబ్బులు ఇవ్వనన్నారని నాకు తెలియదు. శాంత తన కష్టం చెప్పుకుంటే తెచ్చి ఇచ్చాను
రాజ్: అది తప్పా? నేరమా? అమ్మ ఇవ్వనని అంటే తను ఇచ్చింది కానీ తనంత తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదు. నన్ను అడిగింది కారణం చెప్పింది ఇవ్వమని నేను అంటేనే ఇచ్చింది. అందుకేనా ఇంత కోపం
ఇంద్రాదేవి: ఇప్పటి దాకా నా మనవరాలిని దోషిని చేశావ్. కానీ ఇప్పుడు నీ కన్న కొడుకు నీ కోడలు నిర్దోషి అని అన్నావ్. నీ కొడుకు అబద్దం చెప్తున్నాడని అంటావా?
శుభాష్: ఇంతసేపు ఈ ఇంటిని నియంత సభ చేశావ్. ఒక ఆడపిల్లకి ఈ ఇంట్లో పరాభవం జరిగింది
ప్రకాశం: ఏది ఏమైనా కావ్యని కొట్టాలని అనుకోవడం తప్పే వదిన. ఐయామ్ సోరి చాలా అన్యాయంగా అనిపించింది
శుభాష్: ఈ ఇంటి కోడలు పనిమనిషికి పదివేలు కూడ ఇవ్వలేని దుస్థితిలో ఉందని అంటే ఆ అవమానం నా కొడుకుది నాది మా నాన్నది. దీనికి ఇంత పెద్ద గొడవ చేయాలా?
అపర్ణ: నన్ను క్షమించండి అంటూ పేరు పేరునా అందరినీ పిలిచి చెప్తుంది. మీరందరూ మానవత్వానికి పెద్ద పీట వేసేవాళ్ళు. మీ ఔదార్యం ముందు నేను తలదించుకునే తప్పు చేశాను
రాజ్: అంత మాట అనకు మమ్మీ
అపర్ణ: ఇంటిల్లిపాది ఏకమై నన్ను ఏకాకిని చేశారు. నేను ఏదో నేరం చేసినట్టు నన్ను నేరస్థురాలిగా నిలబెట్టారు. ఈరోజు అవమానం కావ్యకి జరగలేదు. ఈ ఇంటి ఇల్లాలికి జరిగింది. ఈ తప్పుకి నేనే ప్రాయశ్చితం చేసుకుంటాను. ఈ ఇంటి గడప దాటను. ఈరోజు నుంచి నన్ను వెలివేయండి