Gruhalakshmi September 14th : దివ్య, విక్రమ్ గదిలో ఉండగా జాహ్నవి పిలుస్తుంది. కానీ దివ్య పక్కన ఉండేసరికి వెళ్ళాలా వద్దా అని భయపడుతూ ఉంటాడు. కాసేపటికి ఫోన్ వచ్చినట్టు డ్రామా ఆడి మెల్లగా జాహ్నవి గదికి వెళతాడు. వెనుకాలే దివ్య వెళ్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి రగిలిపోతుంది. ఎందుకు పిలిచావ్ అంటే గిఫ్ట్ పట్టుకొచ్చాను అనేసి షర్ట్, పర్ఫ్యూమ్ ఇస్తుంది. కానీ విక్రమ్ మాత్రం పర్ఫ్యూమ్ వాడటం లేదని చెప్పేసి షర్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. దివ్య గదికి వచ్చి చిరాకు, కోపంగా వస్తువులన్నీ విసిరికొడుతుంది.
దివ్య: ఫోన్ రాకపోయినా వచ్చినట్టు నాటకం ఆది జాహ్నవి గదిలోకి దూరావ్. నేనేమైన అడిగానా? దివ్యతో నాకేం సంబంధం లేదని చెప్పావ్ కదా. పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ తనతో ఆడుకోకపోయావా? ఏది పర్ఫ్యూమ్ బాటిల్
విక్రమ్: తీసుకురాలేదు
Also Read: ఒక్క సీన్ తో తల్లకిందులైన మూడు జీవితాలు- మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, ముకుంద
దివ్య: మరి షర్ట్ ఎందుకు తీసుకున్నావ్. అయిన నన్ను కనీసం ముద్దు పేరు పెట్టి కూడా పిలవకుండా ఏయ్ అని పిలుస్తావా? పెళ్ళాం అంత చేదు అయిపోయిందా అని చిందులు తొక్కుతుంది. నేను కొన్న షర్ట్స్ కదా ఇవన్నీ తగలబెట్టేస్తాను. నా మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు
విక్రమ్: నువ్వు బెదిరిస్తే నేను లొంగిపోతాను అనుకోకు నీ ఇష్టం వచ్చింది చేసుకో
బసవయ్య కళ్ల జోడు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే రాజ్యలక్ష్మి పని మనిషిలా మారి సేవలు చేస్తుంది. కాసేపు రాజ్యలక్ష్మిని నానా మాటలు అంటాడు. చెయ్యి లాగేస్తుందని చెప్పి చెయ్యి నొక్కించుకుంటాడు. డబ్బుల వ్యవహారాలు మొత్తం తనే చూసుకుంటున్నట్టు కల కంటాడు. కాసేపటికి అందులో నుంచి బయటకి వచ్చి అప్పుడే ఇంటి యజమాని అయినట్టు ఊహించుకున్నానా? ఎప్పుడు అవుతానో అని అనుకుంటాడు. అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి ఏమైందని అడుగుతుంది.
బసవయ్య: ఇంకొక రెండు నెలల్లో ముహూర్తాలు ఉన్నాయి. అప్పటిలోగా జాహ్నవి, విక్రమ్ కథ కొలిక్కి రావాలి
రాజ్యలక్ష్మి: నీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది
తులసితో మాట్లాడటానికి నందు వస్తాడు. మీతో వాదించే ఓపిక లేదని అంటే వాదించడానికి కాదు సోరి చెప్పడానికి వచ్చానని అంటాడు.
నందు: మన రిలేషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎంత కాదనుకున్నా పాతికేళ్లు కలిసి ఉన్నాం కదా తెలియకుండానే చనువు బయటకి వచ్చేసింది. ఏమీ అనుకోవద్దు సోరి
తులసి: మీతో పాటు నేను ఆవేశపడకుండా ఉండాల్సింది. సోరి
నందు: ఏం ఆలోచిస్తున్నావ్. అంకుల్ అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నారు
తులసి: సామ్రాట్ కంపెనీ షేర్స్ పడిపోయాయి. బిజినెస్ బాధ్యత నన్ను తీసుకోమని అంటున్నారు
నందు: అక్కడ జాబ్ చేయడం లేదు. కంపెనీకి ఏమైనా అయితే నిందలు పడాల్సింది నువ్వే కదా
తులసి: అవును ఇంతకముందు మీరు చేసింది అదే కదా
నందు: ఏం సమాధానం చెప్పావ్
తులసి: నేను సమాధానం చెప్పేలోపు ధనుంజయ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటానని మాట ఇచ్చారు. కానీ ఎందుకో అంకుల్ కి ధనుంజయ్ మీద నమ్మకం ఉన్నట్టు అనిపించలేదు. వాళ్ళ పద్ధతి ఎందుకో నచ్చలేదు
నందు: అలా అని వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకు ఇది నా అభిప్రాయం మాత్రమే నిర్ణయం నీదే.. అడ్డుపడను ఆలోచించుకో
తులసి: సామ్రాట్ రుణం తీర్చుకోకుండా నా స్వార్థం నేను చూసుకుంటున్నా అనే బాధ తప్ప ఆ ఇంటిమీద ఆశ లేదు
నందు: తెలియక ఏదైనా పొరపాటు జరిగితే నీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరు. రక్త సంబంధీకులు కాదని నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావని అంటారు ఆలోచించుకో
Also Read: కావ్యపై చేయెత్తిన అపర్ణ- తల్లికి ఎదురుతిరిగిన రాజ్, రుద్రాణి పైశాచికానందం
జాహ్నవి ఇచ్చిన షర్ట్ వేసుకుని విక్రమ్ వచ్చేసరికి సంతోషిస్తుంది. హాస్పిటల్ కి వెళ్తామని దివ్య అంటే సరే అంటాడు. కానీ జాహ్నవి మాత్రం వెళ్ళడానికి వీల్లేదని షాపింగ్ కి వెళ్తున్నా తోడు రమ్మని అడుగుతుంది.
జానూ: చిన బావ నువ్వు పెద్ద బావ బదులు హాస్పిటల్ కి వెళ్ళు
దివ్య: సంజయ్ నువ్వు గుడికి వెళ్ళి పూజ పనులు చూడు
జానూ: అయితే నేను ఢిల్లీ వెళ్లిపోతాను అత్తయ్య
రాజ్యలక్ష్మి: ఎందుకమ్మా విక్రమ్ నువ్వు జానూతో షాపింగ్ కి వెళ్ళు తర్వాత హాస్పిటల్ కి వెళ్ళు అనేసరికి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా అర్థం అయ్యిందా దివ్య నీది ఒంటరి ప్రయాణమే రాసి పెట్టుకో
ధనుంజయ్ వాళ్ళు తులసిని వీలైనంత వరకు ఇంటికి దూరం చేయాలని అనుకుంటారు. వెంటనే హనీకి దగ్గర అవాలని అనుకుంటూ ఉండగా పాప వస్తుంది. రేపు కృష్ణాష్టమి కదా నిన్ను చిన్ని కృష్ణుడుగా తయారు చేస్తానని రత్నప్రభ కపట ప్రేమ ఒలకబోస్తుంది. తులసి ఆంటీకి ఫోన్ చేసి రమ్మని హనీ చెప్తుంది.
రత్నప్రభ: తులసి ఎందుకు నేను ఏం కావాలన్న చేస్తాను కదా
హనీ: నాకు నీతో పని లేదు తులసి ఆంటీ నాకు కృష్ణుడి వేషం వేస్తుంది అని తనకి ఫోన్ చేయమని చెప్తుంది. వెంటనే పెద్దాయన తులసికి ఫోన్ చేసి హనీ అడిగిందని కృష్ణుడి గెటప్ వేయాలని చెప్తాడు. వేరే పని ఉందని కుదరదని తులసి చెప్తుంది. కావాలనే రావడం లేదు కదా హనీ బాధపడుతుంది. తన మాటలకి తులసి బాధపడుతుంది.
తరువాయి భాగంలో..
హనీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అందరూ కంగారుగా వెతుకుతూ ఉంటారు. హనీ చేతికి దెబ్బ తగిలితే తులసి గాయానికి మందు రాసి ఇంటికి వెళ్ళమని చెప్తుంది.