తను ఏ తప్పూ చేయలేదని ముగ్గురూ కలిసి నాటకం ఆడుతున్నారు. నీ భార్య ఇదంతా చేయిస్తుందని రాహుల్ అనేసరికి రాజ్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు. ఎంత నమ్మాను నిన్ను పిన్నీ నీకు గుర్తుందా స్వప్నతో డేట్ కి వెళ్తుంటే ఈ ఉంగరమే డిజైన్ చేయించి తీసుకొచ్చాను అప్పుడే కదా వీడు లాక్కుందని రాజ్ గుర్తు చేస్తాడు. నా బదులు కేఫ్ కు ముందే వెళ్ళి రింగ్ గిఫ్ట్ గా ఇచ్చి స్వప్నని నీవైపుకి తిప్పుకున్నావ్. నాతో ఉంటూ సరిగా పెళ్లి టైమ్ కి స్వప్నని తీసుకుని వెళ్లిపోయావు. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ప్రతి వస్తువు కావాలంటే నీకు ఇస్తూ వచ్చాను. ఆఖరికి నేను పెళ్లి చేసుకోవాలనుకున్న స్వప్నని తీసుకుపోయావు కదా ఛీ పక్కనే ఉంటూ ఎంత ద్రోహం చేశావని రాజ్ బాధపడతాడు.
అపర్ణ: ఏం రుద్రాణి నోరు పెగలడం లేదా అరుంధతి కూతురిని నీ కొడుకు సరిపోడని అంటే ఎన్ని మాటలు అన్నావు. ఇదా నీ కొడుకు చేసే నిర్వాకం. పెళ్ళిలో నా కొడుకు పరువు తీసి ఈ అమ్మాయికి ముసుగు వేసి తీసుకొచ్చావ్
Also Read: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి
రుద్రాణి: ఇదంతా కుట్ర
సీతారామయ్య: ఎవరది కుట్ర ఆ బిడ్డని తల్లిని చేసి ఇప్పుడు మరో అమ్మాయిని చేసుకోవాలని చూస్తాడా?
అరుంధతి: ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇస్తుంటే ఎందుకు ఆపలేకపోయావు అపర్ణ. నిన్ను నమ్మే కదా నా కూతుర్ని ఇవ్వాలని అనుకున్నాను. మీ ఫ్యామిలీ అంటే గొప్ప ఫ్యామిలీ అనుకున్న కానీ కట్టుకున్న భార్యని అపార్థం చేసుకుని దూరం పెట్టాడు. ఇంటి కోడలిని పనిమనిషి కంటే హీనంగా చూసావు నువ్వు. ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నావ్ ఛీ
కావ్య: మా కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు. రుద్రాణి వల్ల ముసుగు వేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అందుకే నన్ను అందరూ అపార్థం చేసుకున్నారు. ఏ ఒక్కరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు
అరుంధతి: ఇది నీ సొంత విషయం నేనేమీ మాట్లాడను. నా కూతురి జీవితం నువ్వే నిలబెట్టావు. ఈ నిజం పెళ్లి తర్వాత బయట పడితే ఏం అయ్యేది తలుచుకుంటేనే భయమేస్తుంది
వెన్నెల రాహుల్ కి పెట్టాలనుకున్న ఉంగరం వాడి మొహం మీద విసిరికొట్టి ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. కనకం ఇంట్లో కూర్చుని స్వప్నని తలుచుకుని ఏడుస్తుంది. కావ్య స్వప్న వాళ్ళని తీసుకుని ఇంటికి వస్తుంది. ఇదేంటి మీతో ఉందని అంటే దానికి న్యాయం జరగాల్సింది మా ఇంట్లోనేనని కావ్య చెప్తుంది. అక్కని తీసుకెళ్ళి మోసం చేసి గర్భవతి కావడానికి కారణం రుద్రాణి కొడుకు రాహుల్ అని కావ్య చెప్పేసరికి కనకం కుటుంబం షాక్ అవుతుంది. ఆ కుర్రాడు మీ ఆయనకి అత్త కొడుకు అవుతాడు అంటే నీకు అన్న వరుస అవుతాడు, అంటే దీనికి కూడా అన్న వరసే కదా అని అన్నపూర్ణ అంటుంది. ఎంత పాపం చేసిందని కనకం తిడుతుంది.
Also Read: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్
రుద్రాణి తాతయ్య కూతురి కాదు ఆయన దగ్గర పని చేసిన మేనేజర్ కూతురు రుద్రాణి, ఆయన చనిపోతే అనాథలా ఉన్న రుద్రాణిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి రక్త సంబంధం లేదని కావ్య చెప్తుంది. ఈ నిజం తనకు కూడా తెలుసని తప్పు కూడా ఆ రేంజ్ లోనే చేశానని స్వప్న అనేసరికి పళ్ళు రాలగొడతానని అప్పు తిడుతుంది. ఇప్పుడు అతను దీన్ని చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? అని కృష్ణమూర్తి బాధపడతాడు. రుద్రాణి కొడుకు చెంప పగలగొట్టి తిడుతుంది. వెన్నెలని పెళ్లి చేసుకుంటే ఆస్తికి వారసుడి అవుతావని అనుకుంటే ఇలా చేశావని బాధపడుతుంది. స్వప్నని పెళ్లి చేసుకోకుండా రాజ్ ని దెబ్బ కొట్టాలని అనుకున్నాను కానీ ఇలా అయిందని అంటాడు. ఇప్పుడు నువ్వు అడుక్కుతినే ఇంటికి అల్లుడివి కాబోతున్నావని రుద్రాణి సీరియస్ అవుతుంది. స్వప్న ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రుద్రాణి ప్లాన్ వేస్తుంది. సీతారామయ్య వాళ్ళని రాజ్ కనకం ఇంటికి తీసుకుని వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద వాళ్ళని నానా మాటలు అంటారు. అప్పు వాళ్ళని తిట్టి పంపించేస్తుంది.