ఎందుకు అంతగా దిగులు పడ్డావని ఏదో పొగుట్టుకున్న దానిలా ఉన్నావాని కృష్ణని మురారీ అడుగుతాడు. ఏమి లేదని చెప్పి తిక్క తిక్కగా సమాధానాలు చెప్తుంది. నీ మాటల్లో ఏదో బరువు కనిపిస్తుందని మురారీ అంటాడు కానీ కృష్ణ మాత్రం కవర్ చేస్తుంది. ఏది అడిగినా కూడా కృష్ణ వంకరగానే ఆన్సర్ ఇస్తుంది. మురారీ స్టేషన్ కి వెళ్లేందుకు రెడీ అవుతుంటే ప్రతిదీ మర్చిపోయానని అంటాడు. అన్నీ ఎదురు అందిస్తుంది. కిందకి దిగుతుంటే మురారీ వాళ్ళకి ముకుంద ఎదురుపడుతుంది కానీ పట్టించుకోకుండా వెళ్లిపోతారు. రేవతికి బై చెప్పేసి వెల్లతునటే ముకుంద వారివైపు అలాగే చూస్తుంది. నా కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే ముకుంద కడుపు రగిలిపోతున్నట్టు ఉందని తిట్టుకుంటుంది.
మురారీ మాటలు, కృష్ణ భర్తకి ప్రపోజ్ చేసిన విషయం గురించి ముకుంద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇది? రోజు రోజుకీ చేజారిపోతున్నావ్. కృష్ణ నీకు దగ్గర అవుతుందా? నువ్వు తనకి దగ్గరవుతున్నావా? రాయివి అయిపోతున్నావా? పరాయి వాడివి అయిపోతున్నావా? అని బాధపడుతుంది. ముకుంద వాలకం చూస్తుంటే తన ప్రేమ సంగతి అందరికీ చెప్పేలా ఉంది ఏదో ఒక విధంగా తనకి వార్నింగ్ ఇవ్వాలని రేవతి ఆలోచిస్తుంది. నీతో జీవితం పంచుకోలేక ఇంకొకరి భర్తగా ఊహించుకోలేక నాకు పిచ్చి పడుతుంది. ఎలాగైనా నువ్వు నాకు కావాలని ముకుంద కోపంగా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నవి విసిరికొడుతుంది. అప్పుడే రేవతి గదిలోకి వస్తుంది. తనని చూసి ముకుంద కన్నీళ్ళు తుడుచుకుంటుంది. తన జీవితానికి అడ్డంగా చాలా మంది ఉన్నారని ముకుంద అంటుంది.
రేవతి: నీ కష్టం, బాధ, ఒంటరితనానికి మీ నాన్న పరిష్కారం చెప్పారు కదా
ముకుంద: అ పరిష్కారం నాకు నచ్చలేదు, గుండె పగిలిపోతే ఏం చేయాలి
రేవతి: అది నీ దురదృష్టం అనుకోవాలి
ముకుంద: అనుకోలేను నాకేం తక్కువ
Also Read: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్
రేవతి: నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం ఆదర్శ్ వాడు పారిపోవడం వల్ల ఇలా జరిగింది
ముకుంద: నాకు తెలుసు మీకు అంతా తెలుసని? మీకు తెలిసి కూడా ఏం చేయగలిగారు
రేవతి: తెలుసు కానీ ఇంకొకరి జీవితం నాశనం చేయలేను
ముకుంద: నా జీవితానికి ఇక్కడే పునాది వేయమని అడిగితే
రేవతి: ఈ ఇంటి పునాదులు కదిలిపోతాయి. నీ విషయంలో నిస్సహాయురాలిని, ఏమి సాయం చేయలేను
ముకుంద: నేను పోగొట్టుకున్న జీవితం నాకు కావాలి అనేసరికి రేవతి షాక్ అవుతుంది. నీ జీవితం నీకు ఇవ్వడానికి ఇంకొకరి జీవితం నాశనం చేసే హక్కు తనకి లేదని అంటుంది.
రేవతి; అప్పుడే నువ్వు అర్థం లేని త్యాగం చేయకుండా విషయం చెప్పి ఉంటే ఇంట్లో అందరం నీకు సపోర్ట్ చేసే వాళ్ళం. నువ్వు తీసుకున్న నిర్ణయంలో నీ అజ్ఞానం కనపడుతుంది
ముకుంద: అంటే తప్పంతా నా మీదే నెడుతున్నారా
ALso Read: వేద ఆంటీ చాలా మంచిదన్న ఆదిత్య- యష్ కాపురంలో చిచ్చు పెట్టేందుకు సిద్ధమైన మాళవిక
రేవతి: నువ్వు ఎక్కాల్సిన రైలు వెళ్ళిపోయింది ఒక జీవితకాలం లేటు అయింది. వాడు తాళి కట్టిన భార్య పట్ల నిజాయితీగా ఉన్నాడు. కానీ నువ్వు అలా లేవు. ఇది నీ పతనానికి తప్ప ఎందుకు పనికిరాదు. మీ నాన్న మాట విని మళ్ళీ పెళ్లి చేసుకో లేదంటే గతాన్ని పూర్తిగా మర్చిపో ఇంతకు మించి ఏమి సాయం చేయలేను
మురారీ వాళ్ళు కారులో వెళ్తుండగా రోడ్డు మీద ఒక జంట గొడవ పడుతూ ఉంటారు. అబ్బాయి ప్రేమిస్తున్నానంటే అమ్మాయి మాత్రం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్తుంది.