Prema Entha Madhuram July 29th: జైల్లో ఉన్న మాన్సీని సత్తెమ్మ గట్టిగా కొరకటంతో గట్టిగా అరుస్తుంది. మరోవైపు ఆర్య కారులో ప్రయాణిస్తూ ఉండగా ఆ సమయంలో ఎఫ్ఎం లో సీతమ్మ పడిన కష్టాలు గురించి, రాముడు సీత కోసం పడుతున్న బాధ గురించి చెప్పటంతో  ఆర్య ఆ కథ విని అను ని గుర్తుకు చేసుకొని బాధపడతాడు. ఇక ఇంటికి తిరిగి రాగా తన రూమ్ లో అను తనకు బాగా గుర్తుకురావడంతో వెంటనే చేతిని పక్కన బలంగా కొట్టడంతో చేతికి గాయం అవుతుంది.


ఆ శబ్దం విని శారదమ్మ ఆర్య అనుకుంటూ పరిగెత్తుకొని వచ్చి గాయం చూసి గాయానికి కట్టు కడుతుంది. ఎందుకిలా అవుతున్నావు.. అందర్నీ ధైర్యంగా ఉండమని చెప్పి నువ్వే ధైర్యం కోల్పోతున్నావు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆర్య అందరూ తనను చూసి ధైర్యంగా ఉంటున్నారనుకుంటున్నారు కానీ తన మనసు మాత్రం ధైర్యంగా లేదు అని.. అక్కడ అను దగ్గర పిల్లలైనా ఉన్నారు.. కానీ నేను మాత్రం ఒంటరి వాడిని అంటూ బాగా ఫీల్ అవుతూ ఉంటాడు.


ఆ తర్వాత ప్రీతి వాళ్ళు ఇల్లు చాలా బాగుంది అని అంత మంచి కుటుంబానికి ఆ దేవుడి నిన్ను ఎందుకు దూరం చేశాడో అని అనటంతో వెంటనే అను పరిస్థితులలో వచ్చాయి కాబట్టి ఎవరిని నిందించకూడదు అని అంటుంది. అందరికీ కష్టాలు వస్తుంటాయి అని వాటిని ఎదుర్కోవాలి అని చెబుతూ ఉంటుంది. ఇక అక్కడే టిఫిన్ సెంటర్ నడిపిస్తున్న ఒక అవ్వ పరిస్థితి చూసి తనకు అక్కడ బేరం అవ్వట్లేదని గమనించి మనం అక్కడికి వెళ్లి టిఫిన్ చేసి డబ్బులు ఇస్దాం అని అంటుంది అను.


ఇప్పుడే అక్కడ బాగా తినేసి వచ్చాము కదా అని రేష్మ అనటంతో పర్వాలేదు కాస్తంత తిని తనకు డబ్బులు ఇచ్చేద్దాం అని అంటుంది. ఇక అవ్వ దగ్గరికి వెళ్లి టిఫిన్ చేస్తారు. ఇక అవ్వ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు. దాంతో అను ప్రీతిని సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారని అడిగి ఒక వీడియో తీసి పోస్ట్ చేయిస్తుంది. ఆ వీడియోలో అవ్వ పరిస్థితి గురించి చెబుతుంది.


దాంతో ఆ అవ్వ సంతోష పడగా టిఫిన్ చేసినందుకే కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తుంది అను. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్లాక అవ్వ టిఫిన్ సెంటర్ దగ్గరికి చాలామంది వస్తుంటారు. అంజలి కూడా ఆ వీడియో చూసి భాను మనసు చాలా మంచిది అని పొగుడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత అను ఆర్య ఇంట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది.


ఇక ప్రీతి అవ్వది హోటల్ బేరం బాగా జరుగుతుందని చెప్పటంతో అను సంతోషపడుతుంది. ఇక అవ్వ లాంటి హోటల్స్ చాలా ఉన్నాయని వాళ్లను కూడా బతికించడానికి ఒక ఐడియా చెబుతుంది. ఇక అది కూడా సక్సెస్ అవుతుంది. ఇక జైల్లో ఉన్న మాన్సీ ని ఒళ్ళు నొక్కమంటుంది సత్తెమ్మ. అప్పుడే మాన్సీ కి బెయిల్ దొరికిందని కానిస్టేబుల్ వచ్చి చెప్పటంతో బాగా సంతోష పడి బయటికి వెళుతుంది.


వెంటనే సత్తెమ్మ మళ్లీ ఎన్ని రోజులు బయట ఉండవు తిరిగి వస్తావు అని అంటుంది. బయటికి వచ్చిన మాన్సీ ని లాయరు ఎక్కడికి వెళ్తావు అని అడగటంతో వర్ధన్ ఇంటికి అని తన ఇంటికి అని పగతో అనడంతో.. మళ్లీ ఏదైనా తప్పు చేస్తున్నారేమో గమనించండి అని లాయర్ అంటాడు. కానీ తను మాత్రం అస్సలు ఊరుకోదు.


also read it : Madhuranagarilo July 28th: 'మధురానగరిలో' సీరియల్: రాధను దూరం చేయటానికి ప్లాన్ చేసిన సంయుక్త.. గన్నవరంను చితక్కొట్టిన విల్సన్, వాసంతి?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial